ప్రింటింగ్ ప్రెస్‌లో అగ్ని ప్రమాదం
పాలకొండ : శ్రీకాకుళం జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. పాలకొండ పట్టణం మెయిన్ రోడ్డులో ఉన్న హనుమాన్ ప్రింటింగ్ ప్రెస్‌లో మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది రంగంలోకి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ఈ ఘటనలో ప్రింటింగ్ ప్రెస్‌లోని వస్తుసామాగ్రి, యంత్రాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో రూ.10 లక్షల ఆస్థి నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.