breaking news
Huge fire
-
జనగామలో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, జనగామ: జనగామలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున విజయ షాపింగ్ మాల్లో మంటలు చెలరేగాయి. దీంతో పక్క షాపులకు కూడా విస్తరించాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి.ఈ ప్రమాదంలో రూ.10 కోట్లకు పైగా ఆస్తినష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. మంటలు భారీగా ఎగిసిపడటంతో ఫైర్ సిబ్బంది అదుపుచేయలేకపోతున్నారు. పక్కనే ఎస్బీఐ బ్యాంక్ ఉండటంతో బ్యాంక్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఆలేరు, కోదాడ, స్టేషన్ ఘన్పూర్, కోడకండ్లతో సహ 6 ఫైర్ ఇంజన్లతో సిబ్బంది మంటలార్పుతున్నారు. -
భారీ అగ్ని ప్రమాదం.. 20 అంతస్తుల్లో చెలరేగిన మంటలు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని సెంచూరిస్ మాల్లో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మూడో అంతస్తులో ముందుగా మంటలు చెలరేగి 20వ అంతస్తు వరకు వ్యాపించాయి. మంటలు వేగంగా మొదటి ఫ్లోర్‌కు సైతం వ్యాపించాయి. పై అతస్తుల్లో నివాస సమూదాయాలు ఉండటం వల్ల భారీగా ప్రాణనష్టం జరిగే అవకాశాలు ఉన్నట్లు ఆ దేశ మీడియాలు పేర్కొన్నాయి. అయితే.. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక విభాగం హూటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే చర్యలు చేపట్టాయి. భవనంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సిబ్బంది తీవ్రంగా ప్రయత్నాలు చేపట్టారు. సెంచూరియస్ మాల్లో మొత్తం 26 అంతస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. రెస్క్యూ బృందాలు రావటంలో జాప్యం కారణంగా మంటలు పై అంతస్తులకు వ్యాపించినట్లు స్థానిక మీడియాలు ఆరోపించాయి. మొనాల్ రెస్టారెంట్లో ముందుగా మంటలు చెలరేగాయని, ప్రమాదంలో రెస్టారెంట్ మొత్తం కాలి బూడిదైనట్లు పేర్కొన్నాయి. Fire in Centaurus Mall is getting stronger#Centaurus #Islamabad pic.twitter.com/Duo32Bjcmz — Shehzad Gul Hassan (@ShehzadGul89) October 9, 2022 Islamabad’s upscale Centaurus Mall under a massive fire right now pic.twitter.com/vuHfvGiuGc — omar r quraishi (@omar_quraishi) October 9, 2022 ఇదీ చదవండి: దేశంలోనే తొలి ‘సోలార్’ గ్రామంగా మొధేరా.. ప్రధాని మోదీ ప్రకటన -
ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం
-
అగ్నికి ఆహుతి
లండన్‌లో భారీ అగ్నిప్రమాదం ► 12 మంది మృతి.. 74 మందికి గాయాలు ► కాలిబూడిదైన 24 అంతస్తుల భవనం ► మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ► పిల్లలను కాపాడేందుకు కిందకు జారవిడిచిన తల్లిదండ్రులు లండన్: ఇటీవల జరిగిన ఉగ్రదాడులను మరవకముందే బ్రిటన్ రాజధాని లండన్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. పశ్చిమలండన్లో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ 24 అంతస్తుల భవనంలో అందరూ ఆదమరిచి నిద్రిస్తున్న సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 12 మంది సజీవదహనం కాగా.. 74 మం దికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. 120 ఫ్లాట్లుండే ప్రమాదం జరిగిన లాంకస్టర్ వెస్ట్ ఎస్టేట్‌లోని గ్రెన్‌ఫెల్ టవర్‌లో ఘటన జరిగిన సమయంలో దాదాపు 600 మంది వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. మం టలు ఇంకా ఎగసిపడుతుండటంతో.. భవనం కూలిపోయే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. భవనం కూలిపోకుండా స్ట్రక్చరల్ ఇంజనీర్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భవనం నుంచి బాధితులను కాపాడేందుకు భారీ ఆపరేషన్ కొనసాగుతోంది. 250మంది అగ్నిమాపక దళ సిబ్బంది మంటలను ఆర్పేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. మంట లు ఎగసిపడుతుండగానే చాలా మందిని వీరు క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. ‘అయినా ఇంకా చాలా మంది జాడ తెలియటం లేదు’ అని లండన్ మేయర్ సాదిక్ ఖాన్ వెల్లడించారు. ఇది చాలా పెద్ద ప్రమాదమని, భవనం భద్రత విషయానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానం వెతుకుతున్నామన్నారు. భారీ ప్రమాద ఘటనపై బ్రిటన్ ప్రధాని థెరిసా మే విచారం వ్యక్తంచేశారు. హృదయవిదారకం! అందరూ ఆదమరిచి నిద్రిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. దీంతో ప్రాణాలు కాపాడుకునేందుకు ఎటువైపు వెళ్లాలో తెలియక భవనంలో ఉన్నవారు కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశారు. బతికించండంటూ వేడుకున్నారు. వీరి అరుపులు, ఆర్తనాదాలతో ఈ ప్రాంతమంతా మార్మోగింది. అగ్నిమాపక సిబ్బంది ఓవైపు నుంచి ప్రయత్నాలు చేస్తూ వీలైనంత మందినిS క్షేమంగా కిందికి దించారు. అయినా ఎగసిపడుతున్న అగ్నికీలలు ఒక్కో ఫ్లాటును, ఒక్కో అంతస్తును మింగేస్తూ పైపైకి ఎగబాగాయి. దీంతో కొందరు కిటికీల్లోనుంచి దుప్పట్ల సాయంతో కిందికి దిగే ప్రయత్నం చేస్తే.. మరికొందరు కిందికి దూకేశారు. తామెలాగూ బతకలేమనుకున్న తల్లిదండ్రులు కనీసం తమ పిల్లలనైనా కాపాడాలంటూ.. కిందనుంచి ప్రమాదాన్ని గమనిస్తున్న వారివైపు జారవిడిచారు. ‘భవనం నుంచి చాలా మంది సహాయం కోసం అరుస్తున్నారు. ఇంతలో తొమ్మిదో అంతస్తు నుంచి ఓ మహిళ కిటికీలోనుంచి కింద గుమిగూడిన వారిని చూస్తూ.. పాపను కిందకు వదిలేస్తున్నట్లు సైగల ద్వారా చెప్పి వదిలేసింది. కిందనున్న ఓ వ్యక్తి పరిగెత్తి ఆ పాపను క్షేమంగా పట్టుకున్నారు’ అని సమీరా అనే ప్రత్యక్షసాక్షి వెల్లడించారు. చిన్నారులు కూడా బతికించండంటూ చేసిన ఆర్తనాదాలు చాలా బాధ కలిగించాయని.. దీన్ని జీవితంలో మరిచిపోలేనని ఆమె తెలిపారు. ఓ మహిళ కూడా ఇలాగే తన ఐదేళ్ల కుమారుడిని బయటకు విసిరేసిందని, ఆ బాలుడు కూడా క్షేమంగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. అతికష్టం మీద ప్రాణాలతో బయటపడిన వారి బాధ వర్ణనాతీతం. రోజుల తరబడి సహాయక చర్యలు ‘ప్రస్తుతానికి ఆరుగురు అగ్నికి ఆహుతయ్యారు. ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దీంతో సహాయకచర్యలు కొన్ని రోజుల వరకు కొనసాగే అవకాశాలున్నాయి. దీంతో మృతుల సంఖ్యపై ఇప్పుడే ఓ అంచనాకు రాలేం’ అని లండన్ మెట్రోపాలిటన్ పోలీస్ కమాండర్ స్టువర్ట్ కండీ స్పష్టం చేశారు. ముందుగా బాధితులను కాపాడి వారికి సరైన వైద్యం అందించడమే ముఖ్యమని.. ఆ తర్వాతే ప్రమాదానికి కారణాలపై విచారణ కొనసాగుతుందన్నారు. మృతులను ఇంతవరకూ గుర్తించలేదని కూడా ఆయన వెల్లడించారు. ‘ఈ ఘటన ఊహించేందుకే భయంగా ఉంది. ఇంత భయంకరమైన అగ్నిప్రమాదాన్ని నా 29 ఏళ్ల ఉద్యోగ జీవితంలో చూడలేదు. ఘటన తెలియగానే ఓవైపు బాధితులను కాపాడుతూనే.. పక్కనున్న భవంతుల్లో ఉండేవారిని ఖాళీ చేయించాం’ అని ఫైర్ బ్రిగేడ్ చీఫ్ డేనీ కాటన్ తెలిపారు. ఈ దుర్ఘటనకు కారణమేంటో ఇంకా తెలియరాలేదన్నారు. అయితే.. మూడు లేదా నాలుగో అంతస్తులో ఓ రిఫ్రిజిరేటర్ కారణంగానే మంటలు మొదలై ఉండొచ్చని.. ఆ వెంటనే వరుసగా ఒక్కో ఫ్లాట్‌కు మంటలంటుకుని మొత్తం భవనం దగ్ధమయినట్లు అధికారులు భావిస్తున్నారు. విచారణ తర్వాతే అసలు కారణం తెలుస్తుందన్నారు. గతేడాదే ఈ భవనాన్ని భారీమొత్తం వెచ్చించి పునరుద్ధరించారు. అయితే అగ్నిప్రమాదాన్ని పసిగట్టి స్పందించే వ్యవస్థ విషయంలో తీవ్రమైన లోపం కారణంగానే ఇంత భారీ ప్రమాదం జరిగిందని అగ్నిమాపక అధికారులు తెలిపారు. భవన దుర్ఘటన బాధితులను ఆదుకునేందుకు పశ్చిమలండన్లోని గురుద్వారాలు, మసీదులు, చర్చిలు ముందుకొచ్చాయి. ప్రజలనుంచి సేకరించిన దుస్తులు, ఆహార పదార్థాలను రగ్బీ కమ్యూనిటీ సెంటర్లోని బాధితులకు అందజేశాయి. ముస్లిం కుటుంబాలే ఎక్కువ దుర్ఘటనకు కారణమైన గ్రెన్‌ఫెల్ టవర్‌లో ఎక్కువగా ముస్లిం కుటుంబాలే నివాసముంటున్నాయని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో చాలా మంది మెలకువగానే ఉన్నారన్నారు. రంజాన్ మాసం సందర్భంగా ఉపవాస దీక్షలు ప్రారంభించేందుకు తెల్లవారుజామున భోజనం చేస్తున్న సమయంలోనే మంటలు చుట్టుముట్టాయన్నారు. రంజాన్ కారణంగా తెల్లవారుజామునే లేవటంతో తీవ్రతను ముందుగానే పసిగట్టి కుటుంబంతో సహా ప్రాణాలతో బయటపడ్డట్లు మహ్మద్ అనే వ్యక్తి తెలిపారు. ప్రాణాలతో బయటపడిన వారిని సమీపంలోని రగ్బీ పోర్టోబెల్లో కమ్యూనిటీ సెంటర్‌కు చేర్చారు. అక్కడే వారికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. బాధితుల మాటల్లోనే ‘మంటలు అంటుకున్న విషయం తెలియగానే మెట్లగుండా బయటకు వచ్చే ప్రయత్నం చేశాను. అంతలోనే ఫైర్‌ఫైటర్లు లోపల చిక్కుకున్న చాలా మందిని కాపాడేందుకు పైకొస్తున్నారు. వారే నన్ను క్షేమంగా కిందికి పంపించారు’ అని ఏడో అంతస్తులో ఉండే పాల్ మునాక్ర్ తెలిపారు. ‘మంచి నిద్రలో ఉన్నాను. ఇంతలోనే ఏదో శబ్దమైందని మేల్కొనే లోపే దట్టమైన పొగ ఆవహించింది. పొగ అలారం మోగుతూనే ఉంది. చూస్తుండగానే నాలుగో అంత స్తు నుంచి 23వ అంతస్తుకు పాకిపోయింది’ అని జోయ్ అనే మరో బాధితురాలు ఆవేదనగా వెల్లడించారు. ఈ భవనంలో ఉం టున్న తమవారి క్షేమసమాచారం, బాధితుల బంధువులు ఆసుపత్రులు, కమ్యూనిటీ సెంటర్ల వద్ద ఆత్రుతతో వెదుకుతున్నారు. మంటల ఉధృతికి రెయిన్‌స్క్రీన్ కారణమా? మంటలు ఇంతగా ఎగసి పడటానికి భవనానికి ఉన్న రెయిన్‌స్క్రీన్ (బయటి వేడి ప్రభావం లోపలకు రాకుండా ఉండేందుకు, భవనాన్ని ఆధునికంగా మార్చేందుకు గోడలకు అమర్చే ఒక తొడుగు) కారణం అయ్యుండొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. రెయిన్స్క్రీన్లను సాధారణంగా చెక్క, ప్లాస్టిక్, లోహాలతో తయారుచేస్తారు. ప్రమాదం జరిగిన భవనం 1974లో నిర్మితమైనది. 2016లో దీనిని ఆధునీకరించారు. అప్పుడే రెయిన్‌స్క్రీన్ ఏర్పాటు చేశారు. వాస్తవానికి మంటలు రెండు లేదా మూడు అంతస్తులకు పరిమితం అవ్వాల్సినవనీ, రెయిన్స్క్రీన్వల్లే నిమిషాల్లో భవనం మొత్తానికి వ్యాపించాయని నిపుణులంటున్నారు. -
ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. నలుగురు మృతి
-
ముంబైలో భారీ అగ్ని ప్రమాదం
-
పిడుగుపడి భారీగా ఎగసిన మంటలు
బి.కొత్తకోట: చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలంలోని కోటావూరు గ్రామం సమీపంలో ఓ గుట్టపై బుధవారం పిడుగు పడగా ఆ ప్రాంతంలో మంటలు ఎగసిపడ్డాయి. గుట్టపై 33 కేవీ విద్యుత్‌లైన్ దగ్గర బుధవారం తెల్లవారుజామున పిడుగుపడింది. గుట్టపై ఉన్న విద్యుత్ స్తంభం వద్ద పొగలు వస్తుండడాన్ని గుర్తించి గ్రామస్తులు అక్కడికెళ్లి చూడగా... భూమి చీలినట్టు ఉండి మంటలు ఎగసిపడడం కనిపించింది. సర్పంచ్ జయచంద్రారెడ్డి విద్యుత్ శాఖ ఏఈకి సమాచారం ఇవ్వడంతో సరఫరా నిలిపివేశారు. ఏఈ గుట్టవద్దకు చేరుకుని ట్యాంకర్లతో నీటిని తెప్పించి పోయించారు. మంటలు ఆరిపోయినా లోపలి నుంచి ఆవిర్లు, వేడి మాత్రం తగ్గలేదు. -
చెత్త తగలబెడుతూ సజీవ దహనం
కరీంనగర్ : పొలంలోని చెత్తను తగలబెడుతూ ప్రమాదవశాత్తూ మంటలు అంటుకుని ఓ రైతు సజీవ దహనమయ్యాడు. ఈ ఘటన శనివారం కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని చల్లూరు గ్రామానికి చెందిన అశీర్వాదం(60) పొలంలో చెత్తను తగలబెడుతుండగా నిప్పుంటుకుని అక్కడికక్కడే సజీవ దహన మయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. (వీణవంక) -
38 మంది వృద్ధుల సజీవ దహనం
చైనాలో భారీ అగ్ని ప్రమాదం బీజింగ్: చైనాలోని హెనాన్ రాష్ట్రంలో సోమవారం ఓ ప్రైవేట్ వృద్ధాశ్రమంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 38 మంది వృద్ధులు సజీవ దహనం అయ్యారు. మరో ఆరుగురు గాయపడ్డారు. పింగ్దింగ్షాన్ సిటీలోని లూషాన్ కౌంటీలో ఉన్న కాంగ్లెయూవాన్ రెస్ట్ హోంలో ఈ విషాదం చోటు చేసుకుంది. మృతదేహాలు గుర్తుపట్టని విధంగా కాలిపోయాయి. సోమవారం సాయంత్రం మొదలైన మంటలు మొత్తం వృద్ధాశ్రమంలోని భవనాలన్నింటికి వ్యాపించాయని, గంట తర్వాత వాటిని ఆర్పేశామని అధికారులు తెలిపారు. వృద్ధాశ్రమంలో మొత్తం 51 మంది వృద్ధులు ఉండేవారని చెప్పారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. మంటల ధాటికి భవనాలు కూలిపోయి బూడిద కుప్పలా మారిపోయాయి. తన గదిలో 11 మంది ఉండేవారని, తనతోపాటు మరొకరు మాత్రమే ప్రమాదం నుంచి బయటపడ్డామని జావో యులాన్ అనే మహిళ చెప్పింది. రెస్ట్ హోం లీగల్ ప్రతినిధిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.