చెత్త తగలబెడుతూ సజీవ దహనం | former died in fire at Farms | Sakshi
Sakshi News home page

చెత్త తగలబెడుతూ సజీవ దహనం

May 30 2015 2:46 PM | Updated on Sep 3 2017 2:57 AM

పొలంలోని చెత్తను తగలబెడుతూ ప్రమాదవశాత్తూ మంటలు అంటుకుని ఓ రైతు సజీవ దహనమయ్యాడు.

కరీంనగర్ : పొలంలోని చెత్తను తగలబెడుతూ ప్రమాదవశాత్తూ మంటలు అంటుకుని ఓ రైతు సజీవ దహనమయ్యాడు. ఈ ఘటన శనివారం కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని చల్లూరు గ్రామానికి చెందిన అశీర్వాదం(60) పొలంలో చెత్తను తగలబెడుతుండగా నిప్పుంటుకుని అక్కడికక్కడే సజీవ దహన మయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
(వీణవంక)

Advertisement
 
Advertisement
Advertisement