‘జెన్సీ డీఎంకే’ ఆవిర్భావం!
సాక్షి, చెన్నై: ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధికారాన్ని కోల్పోవడానికి గల కారణాలపై ఆ పార్టీ అధినేత ఎం.కే. స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యానం చేశారు.
యువతరం ఎక్కువగా ఉండే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో, ముఖ్యంగా ఇన్‌స్ట్రాగామ్ ద్వారా పార్టీ సిద్ధాంతాలను, అభివృద్ధిని సరిగ్గా ప్రచారం చేయకపోవడమే ఓటమికి ప్రధాన కారణమని ఆయన విశ్లేషించారు. ఈ లోపాన్ని సవరించుకుని, ద్రావిడ సిద్ధాంతాలను డిజిటల్ మాధ్యమాల్లో బలంగా తీసుకెళ్లడానికి డీఎంకే సరికొత్త డిజిటల్ విభాగాన్ని ప్రారంభించింది.
చెన్నైలోని కళైజ్ఞర్ ఆడిటోరియం వేదికగా జరిగిన కార్యక్రమంలో ‘జెన్సీ డీఎంకే – వి విల్ రిటర్న్’ అనే సరికొత్త డిజిటల్ సైన్యాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వెయ్యికి పైగా ద్రావిడ భావజాలం ఉన్న యువతీ యువకులు పాల్గొన్నారు. పార్టీ ఐటీ వింగ్ కార్యదర్శి టి.ఆర్.పి. రాజా మాట్లాడుతూ.. వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్ వేదికలుగా ఈ వింగ్ పనిచేస్తుందన్నారు.


