breaking news
hotel fire
-
ఢిల్లీ అగ్నిప్రమాదం: కుక్ నిర్లక్ష్యమే కొంపముంచిందా?
న్యూఢిల్లీ: దేశరాజధాని డిల్లీలోని మాలవీయ నగర్ ‘ఫ్లరిష్ ఇన్’ హోటల్లో 21 మందిని బలితీసుకున్న అగ్నిప్రమాదం కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. హోటల్ వంటవాడు (కుక్) కేశవ్ నేగిని ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఇతని నిర్లక్ష్యం కారణంగానే మంటలు వేగంగా వ్యాపించడమే కాకుండా, హోటల్లోని ఎలక్ట్రానిక్ తలుపులు లాక్ అయిపోయి, పెను విషాదానికి దారితీసిందని పోలీసు వర్గాల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ప్రమాదంలో 9 మంది భారతీయులు, 12 మంది విదేశీయులతో సహా మొత్తం 21 మంది ఊపిరాడక, మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.ఒకే ఒక్క స్విచ్ కారణంగా..పోలీసుల కథనం ప్రకారం.. బుధవారం ఉదయం కిచెన్‌లో ఎలక్ట్రిక్ స్టవ్ ఆన్ చేయగానే ఒక్కసారిగా పేలుడు సంభవించి మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో తీవ్ర భయాందోళనకు గురైన కుక్ కేశవ్ నేగి, హోటల్ మెయిన్ పవర్ స్విచ్ (ఎలక్ట్రిసిటీ సప్లై)ను పూర్తిగా ఆఫ్ చేసి, దట్టమైన పొగల మధ్య నుంచి ప్రాణాలు దక్కించుకోవడానికి బయటకు పారిపోయాడు. ఆయన తీసుకున్న ఈ ఒక్క నిర్ణయమే హోటల్లో ఉన్నవారికి మృత్యుపాశంగా మారింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో హోటల్లోని సెన్సార్ ఆధారిత ఎలక్ట్రానిక్ తలుపులన్నీ జామ్ అయిపోయాయి. లోపల ఉన్న బాధితులు బయటకు వచ్చే మార్గం లేక లోపలే చిక్కుకుపోయారు.బాత్రూమ్లోనే భార్యాభర్తల సజీవ దహనంఈ ప్రమాదంలో అత్యంత దయనీయమైన పరిస్థితులు వెలుగుచూశాయి. పవర్ కట్ కావడంతో తలుపులు తెరుచుకోక, దట్టమైన పొగలు హోటల్ అంతటా కమ్మేశాయి. కేవలం ఒకే ఒక ఎగ్జిట్ పాయింట్ ఉండటం, కిటికీలన్నీ శాశ్వతంగా మూసివేసి (సీల్డ్) ఉండటంతో బాధితులు ఊపిరి పీల్చుకోలేక విలవిలలాడారు. ఓ జంట (భార్యాభర్తలు) ప్రాణాలు కాపాడుకోవడానికి బాత్రూమ్లోకి వెళ్లగా, అక్కడ కూడా డోర్ లాక్ అయిపోయింది. బయటకు రాలేక, ఊపిరాడక వారు అక్కడికక్కడే మరణించారు. నేగి చేసిన నిర్లక్ష్యపు పనే ఇంతమంది ప్రాణాలు గాల్లో కలవడానికి ప్రధాన కారణమని ఢిల్లీ పోలీసులు నిర్ధారించారు.ముమ్మరంగా సాగుతున్న పోలీసు విచారణఅగ్ని ప్రమాదం జరిగిన ఐదు అంతస్తుల ఈ ఇరుకైన భవనంలో మొత్తం 22 గదులు ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో రెస్టారెంట్ నడుస్తుండగా, బేస్మెంట్, పై అంతస్తులను హోటల్‌గా ఉపయోగిస్తున్నారు. హోటల్ యజమాని లవకేష్ బజాజ్‌ను పోలీసులు ఇదివరకే అరెస్ట్ చేయగా, తాజాగా కుక్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేయడానికి హోటల్ సిబ్బందిని, ఇతర నిర్వాహకులను పోలీసులు విచారిస్తున్నారు. -
ఢిల్లీ అగ్ని ప్రమాదంపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: ఢిల్లీలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్.. ఢిల్లీలోని రెస్టారెంట్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోవటం బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. ఈ ప్రమాదంలో విదేశీయులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు వస్తున్న వార్తలు మరింత ఆవేదన కలిగిస్తున్నాయని అన్నారు. -
Mumbai Hotel Fire: ఒక్కటవ్వకుండానే ఒక్కటిగానే వెళ్లిపోయారు..
ముంబై: ఆదివారం రోజున నైరోబీ వెళ్లాల్సిన విమానం ఆలస్యం కావడంతో ఓ జంట శాంతాక్రూజ్ సమీపంలో గెలాక్సీ హోటల్లో బస చేశారు. అంతలో అక్కడ అగ్నిప్రమాదం జరగడంతో ఆ జంట సజీవ దహనమయ్యారు. వీరితోపాటు ఆ ప్రమాదంలో మరో వ్యక్తి కూడా చనిపోయారు. ఆదివారం మధ్యాహ్నం ముంబైలోని గెలాక్సీ హోటల్‌లోహోటల్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమైన సంగతి తెలిసిందే. ఆ ముగ్గురిలో ఒక జంట కథ అందరి హృదయాలను ద్రవింపజేస్తోంది. మృతుడి సొంతూరైన రామ్‌పార్ గ్రామ సర్పంచ్ సురేష్ కారా తెలిపిన వివరాల ప్రకారం ఎన్నారై కిషన్ హాలాయ్(28) అతడికి కాబోయే భార్య రూపాలు వెకారియా(25) ఇద్దరి కుటుంబాలు గుజరాత్‌లోని రామ్‌పార్ గ్రామానికి చెందినవారే అయినా వారి పూర్వీకులు నైరోబీలో స్థిరపడటంతో వీరు కూడా అక్కడే పెరిగి పెద్దయ్యారన్నారు. వీరిరువురికీ పెద్దలు పెళ్లి కూడా నిశ్చయించారు.. అయితే కిషన్ సోదరుడి వివాహం నిమిత్తం సొంత గ్రామానికి వచ్చారని వివాహం పూర్తవగానే కొత్తగా పెళ్ళైన జంటతో పాటు ఈ జంట తల్లిదండ్రులు నైరోబీ వెళ్లిపోగా కిషన్ మాత్రం బంధువులను కలిసి వెళదామని ఆగిపోవడంతో అతడితోపాటు రూపాల్ కూడా ఉండిపోయినాట్లు తెలిపారు. అన్ని పనులను పూర్తిచేసుకుని ఆదివారం వీరు కూడా నైరోబీ తిరిగి వెళ్లాల్సి ఉండగా అహ్మదాబాద్ నుండి ముంబై చేరుకున్నారు. తీరా ముంబై వచ్చాక విమానం ఆలస్యమవుతుందని తెలియడంతో శాంతాక్రూజ్ సమీపంలోని గెలాక్సీ హోటల్లో బస చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఆ జంట ఒక్కటవ్వకుండానే ఒక్కటిగా వెళ్లిపోయారని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు సురేష్ కారా. ఇది కూడా చదవండి: సినిమా చూసేందుకు వెళ్లి మృత్యుఒడిలోకి.. ఏమైందంటే? -
అగ్నిప్రమాదం.. ఇద్దరి మృతి
కొల్‌కత: కొల్‌కతలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. బ్రిటిష్ హై కమిషన్ సమీపంలోని గోల్డెన్ పార్క్ హోటల్లో గురువారం మధ్యాహ్నాం 2.55 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన మంటలను ఆర్పి 31 మందిని రక్షించారు. క్షతగాత్రులను ఎస్ఎస్కేఎమ్ ఆసుపత్రికి తరలించారు. అతిథులుగా హోటల్లో బస చేసిన అనూప్ అగర్వాల్, కిషోర్ గుప్తలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.హోటల్ సిబ్బంది నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని అగ్రిమాపక అధికారులు తెలిపారు. ఫైర్ సిబ్బంది రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చిందన్నారు. అగ్నిప్రమాదాలు జరగకుండా హోటల్ సిబ్బంది జాగ్రత్తలు తీసుకోలేదని, కనీస పరికరాలు లేకుండా బిల్డింగ్ నిర్మించారని నగర మేయర్ సోవాన్ చటర్జీ ఆరోపించారు. -
ఆ చెత్త సెల్ఫీ జంటను ఎట్టకేలకు విడిచిపెట్టారు!
దుబాయ్: కొత్త సంవత్సరం సందర్భంగా దుబాయ్‌లో ఓ హోటల్ తగలబడుతుండగా.. దాని ముందు తాపీగా నిలబడి సెల్ఫీ తీసుకున్న ఓ జంటకు ఎట్టకేలకు విముక్తి లభించింది. పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆ ఇద్దరు వ్యక్తులను విడుదల చేసినట్టు యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ శుక్రవారం తెలిపింది. దుబాయ్ ఎమిరెట్స్ అటార్నీ జనరల్ ఎస్సాం అల్ హుమైదన్ను ఉటంకిస్తూ ప్రభుత్వ వార్తాసంస్థ డబ్ల్యూఏఎం ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రపంచంలోనే అతిపెద్దదైన దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా పక్కన ఉన్న 64 అంతస్తుల హోటల్లో డిసెంబర్ 31 అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు ఎగిశాయి. నూతన సంవత్సరం వేడుకలకు కొద్దిముందే జరిగిన ఈ ప్రమాదంతో హోటల్లోని వారు ఉరుకులు, పరుగులతో హాహాకారాలు చేశారు. ఈ సమయంలో ఓ జంట మాత్రం కాలుతున్న హోటల్ ముందు నిలబడి సెల్ఫీ తీసుకుంది. 2015లో ఇదే అత్యంత చెత్త సెల్ఫీ నమోదైంది. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అయితే వారికి ఎలాంటి నేరపూరిత ఉద్దేశం లేదని తెలియడంతో వదిలేశారు. అనుమతి లేకుండా సంబంధిత సంస్థలు, వ్యక్తుల ఫొటోలు తీయడం దుబాయ్‌లో నేరం. ఇందుకు అరెస్టుచేసి జైల్లో వేసే అవకాశం కూడా ఉంది. అయితే ఆ జంటను అరెస్టు చేయడం పనిలేని వ్యవహారమని దుబాయ్ రాజకీయ పరిశీలకులు పోలీసుల చర్యను తప్పుబట్టారు. -
బోర్డు మాత్రమే మిగిలింది
శామీర్‌పేట్: గుర్తుతెలియని వ్యక్తులు ఓ హోటల్‌కు నిప్పంటించారు. ఈ సంఘటన శామీర్‌పేట్ మండలపరిధిలోని పెద్దచెరువు శివారులో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. శామీర్‌పేట్‌కు చెందిన ఎం. శ్రీనివాస్ కొన్నేళ్లుగా మేడ్చల్ మండల పరిధిలోని మెడిసిటీ సమీపంలో (శామీర్‌పేట్ పెద్ద చెరువు శివారులో) ఓ గది అద్దెకు తీసుకొని చిన్నపాటి హోటల్ నిర్వహిస్తున్నాడు. ఎప్పటిమాదిరిగా ఆదివారం రాత్రి ఆయన కొట్టు మూసివేసి ఇంటికి వ చ్చాడు. సోమవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు ఆయన హోటల్‌కు నిప్పంటించారు. స్థానికుల సమాచారంతో శ్రీనివాస్ అక్కడికి వెళ్లేసరికి హోటల్ పూర్తిగా కాలిపోయి కేవలం బోర్డు మాత్రమే మిగిలి ఉంది. తన బతుకు రోడ్డున పడిందని, రూ.50 వేలు విలువైన ఆస్తినష్టం జరిగిందని బాధితుడు కన్నీటిపర్యంతమైంది. ఈమేరకు శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.


