breaking news
Horrific accident
-
Anantapur: ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు సజీవదహనం
-
నా భర్తను కళ్లెదుటే కాల్చి బూడిద చేశారు!
సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం మండలం వెలగవలస గ్రామంలో వింత వ్యాధి కలకలం రేపుతోంది. గడపకో రోగి.. ఇంటికో వ్యథ.. ఎక్కడ చూసినా ఇదే స్థితి. పదుల సంఖ్యలోనే ఇళ్లు ఉండే గిరిజన పల్లెలో రెండు నెలలుగా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అంతుచిక్కని కలవరం.. అంతులేని భయం. జ్వరం, జలుబు, దగ్గుతో పాటు రోగుల్లో వింత ప్రవర్తన. ఒక్కసారిగా పెద్ద అరుపులు.. వెర్రి చూపులు.. కాళ్లు, చేతులు కొట్టుకుంటూ ఒళ్లు గగుర్పాటుకు గురిచేసేలా చేష్టలు. అసలే మూఢ నమ్మకాలను బలంగా నమ్మే గిరిజనులు. ఆకులు, అందుబాటులో దొరికిన మందులతో వైద్యం చేస్తున్నారు. దెయ్యం పట్టిందని ఒకరు.. చేతబడి చేశారని ఇంకొకరు.. ఆ భయంతోనే గ్రామానికి చెందిన తాడంగి రమేష్ (30) ను సోమవారం సాయంత్రం గ్రామస్తులంతా తీవ్రంగా కొట్టి గాయపరిచారు. చేతబడి చేస్తున్నాడని, అందువల్లే గ్రామంలో ఉన్నవారంతా వింతగా ప్రవర్తిస్తున్నారని అనుమానించారు. అక్కడితో వారి కోపం చల్లారలేదు. మంత్ర శక్తులు ఉన్నాయని కాళ్లు, చేతులు వేరు పడేసినట్లు సమాచారం. చనిపోయాక మృతదేహాన్ని మంటల్లో తగులబెట్టారు. సోమవారం రాత్రితో పాటు, మంగళవారం కూడా పోలీ సులు అక్కడికి చేరుకుని విచారణ జరిపారు. ఊరిలోనే చికిత్స.. గ్రామానికి చెందిన చాలామంది అనారోగ్యంతో బాధ పడుతున్నా.. ఏ ఒక్కరూ ఆస్పత్రిని ఆశ్రయించడం లేదు. పసరమందులు, మంత్రాల వైద్యంతో కాలం వెళ్లదీస్తున్నారు. వింత వ్యాధితో బాధపడుతున్న యువతి కడ్రక బంగారమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో హుటాహుటిన పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. వ్యాధి నిర్ధారణ కావాల్సి ఉంది. వైద్య నిపుణులు, అధికారులు గ్రామాన్ని సందర్శించి ప్రజలకు అవగాహన కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు. 16 మంది నిందితుల అరెస్టు చేతబడి చేస్తున్నాడనే నెపంతో రమేష్‌ను సజీవ దహనం చేసిన ఘటనలో 16 మందిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఆధునిక కాలంలోనూ ఇలాంటి అపోహలతో ప్రాణాలు తీయడం దారుణమని, గుంపుగా దాడి చేసినా ప్రతి ఒక్కరినీ గుర్తించి క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ మనీషారెడ్డి స్పష్టంచేశారు. -
యూపీలో గొలుసుకట్టు వాహన ప్రమాదం...
మిర్జాపూర్: ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. గొలుసుకట్టు ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అదుపుతప్పిన ఓ లారీ ముందు వెళ్తున్న రెండు కార్లను, ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. మంటలు చెలరేగడంతో ఒక కారులోని నలుగురు చిన్నారులు, ముగ్గురు మహిళలు సహా 9 మంది సజీవ దహనమయ్యారు. బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో 135వ నంబర్ జాతీయ రహదారిపై ద్రుమ్మొండ్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బర్కామోడ్ సమీపంలో ఈ గొలుసుకట్టు ప్రమాదం చోటుచేసుకుంది. ద్రుమ్మొండ్‌గంజ్ నుంచి లసోదా వైపు సెనగల లోడుతో వేగంగా వస్తున్న లారీ ముందుగా వెళ్తున్న బొలెరోతోపాటు, మరో కారును, ఆపై ఆగి ఉన్న ట్రయిలర్ ట్రక్కును ఢీకొట్టింది. లారీ, ట్రక్కు మధ్య ఇరుక్కుపోయిన కార్లలో మంటలు చెలరేగాయి. బొలెరోలో ఉన్న నలుగురు చిన్నారులు, ముగ్గురు మహిళలు సహా మొత్తం 9 మంది సజీవ దహనమయ్యారు. మరో కారు, ట్రక్కు, డ్రైవర్లు కూడా చనిపోయారు. -
అయ్యో అంజలి.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో షాకింగ్ విషయాలు
ఢిల్లీ: సుల్తాన్‌పురి-కంఝావాలా మధ్య కారుతో ఈడ్చుకెళ్లిన ఘటనలో దారుణ రీతిలో ప్రాణం కోల్పోయిన అంజలి(20) కేసులో పోస్ట్‌మార్టం రిపోర్ట్ బయటకు వచ్చింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆమె ఆల్కాహాల్ తీసుకోలేదని, ఆమె మృతదేహంలో ఆనవాలు కనిపించలేదని స్పష్టం అయ్యింది. అంతేకాదు ఆ ఘటన సమయంలో ఆమె నరకం అనుభవించి ఉంటుందని పోస్ట్‌మార్టం రిపోర్ట్ ద్వారా స్పష్టం అవుతోంది. మొత్తం ఎనిమిది పేజీల ఆ రిపోర్ట్‌లో దిగ్భ్రాంతి కలిగించే విషయాలు వెల్లడయ్యాయి. ‘‘రోడ్డుపై కిలోమీటర్ల పొడవునా బాడీని ఈడ్చుకెళ్లారు. శరీరం మట్టి కొట్టుకుపోయింది. ఆమె ఒంటిపై 40కి పైగా గాయాలు అయ్యాయి. పక్కటెముకలు బయటకు వెనుకవైపు పొడుచుకువచ్చాయి. రోడ్డుపై ఈడ్చుకెళ్లడంతో శరీరం మొత్తం కమిలిపోయింది. తల పగిలి మెదడు బయటకు వచ్చి.. అందులో కొంత భాగం మిస్సయ్యింది. వెన్నుముక పూర్తిగా విరిగిపోయిందని రిపోర్ట్‌లో వైద్యులు వెల్లడించారు. తీవ్ర గాయాలతో, రక్త స్రావంతోనే ఆమె మరణించిందని శవ పరీక్ష ద్వారా వైద్యులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలో జరిగిన శవ పరీక్ష నివేదికను పోలీసులు స్వీకరించారు. అయితే.. సాధారణ శవ పరీక్ష తర్వాత మరోసారి కెమికల్ అనాలసిస్, బయోలాజికల్ శాంపిల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాతే తుది ధృవీకరణ చేసినట్లు వైద్యులు ఆ నివేదికలో వెల్లడించారు. పోలీసుల నివేదిక ప్రకారం.. డిసెంబర్ 31 అర్ధరాత్రి తర్వాత(జనవరి 1న) స్కూటీపై స్నేహితురాలితో వస్తున్న అంజలి సింగ్‌ను.. వేగంగా వస్తున్న బలెనో కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె బాడీని అలాగే కిలోమీటర్ల మేర లాక్కునిపోయింది ఆ కారు. సుల్తాన్‌పురి-కంఝావాలా మధ్య చక్కర్లు కొట్టి.. చివరకు ఆమె మృతదేహాం కారు నుంచి వేరై రోడ్డు మీద పడిపోయింది. కారులో ఉన్న ఐదుగురు ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్నట్లు తేలింది. ఈ ఘటన ఢిల్లీని కుదిపేయడంతో పాటు దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. ఘటనపై నిరసనలు వెల్లువెత్తడంతో నిందితులను త్వరగతిన అరెస్ట్ చేసిన పోలీసులు.. మూడు రోజుల పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. బుధవారం(ఇవాళ) సాయంత్రంతో ఆ కస్టడీ ముగియనుంది. ఇక అత్యాచారం జరిగిందనే కోణాన్ని శవ పరీక్ష కొట్టిపారేసింది. ఇక బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన డిప్యూటీ ముఖ్యమంత్రి సిసోడియా.. దారుణ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన అంజలి కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు. -
ఘోర రోడ్డు ప్రమాదం: బస్సు బోల్తా.. 10 మంది మృతి
కర్ణాటక: పావగడ వద్ద ఘరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ బస్సు బోల్తా పడటంతో 10 మంది మృతి చెందారు. 20 మంది గాయపడ్డారు. వైఎన్‌ఎస్ కోట నుంచి పావగడకు వస్తుండగా ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని పావగడ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 మంది వరకు ఉన్నట్టుగా సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. చదవండి: రెండో పెళ్లి.. అడిగిన డబ్బులు తేకుంటే మొదటి భార్యను తీసుకొస్తానని.. -
లారీ ఢీకొని అక్కా చెల్లెళ్లు దుర్మరణం
-
షాకింగ్ వీడియో: వెంట్రుకవాసిలో తప్పించుకున్నారు!
స్కూటీ మీద వెళుతున్న ఇద్దరు వ్యక్తుల్ని వేగంగా దూసుకొచ్చిన ఓ లగ్జరీ వాహనం భీకరంగా ఢీకొట్టింది. పక్కనుంచి వస్తున్న స్కూటీని పట్టించుకోకుండానే ఎస్వీయూ వాహనం వారిపైకి దూసుకెళ్లింది. స్కూటీ మీద ఉన్న వాళ్లిద్దరు గాలిలోకి ఎగిరారు. అయినా అదృష్టం బాగుండుటంతో వెంట్రుకవాసిలో ఆ ఇద్దరు మృత్యువు నుంచి తప్పించుకున్నారు. గాల్లోకి ఎగిరినప్పటికీ వాహనం కింద పడకపోవడంతో ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. స్కూటీని ఢీకొట్టిన ఆ లగ్జరీ వాహనం ఏమాత్రం నిర్లక్ష్యంగా ముందుకెళ్లింది. గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో ఈ ఘటన జరిగింది. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. ఈ సీసీటీవీ కెమెరా దృశ్యాలను పరిశీలించి మరిన్ని వివరాలు వెలుగులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. WATCH: Horrific accident caught on camera in Ahmedabad,victims escape alivehttps://t.co/VRDhqfjQCV — ANI (@ANI_news) 18 May 2016


