breaking news
Hereditary politics
-
నేపాల్‌కు నిప్పు పెట్టిందెవరు?
కాఠ్మండు: చేతికి ఆరో వేలుగా అతుక్కుపోయిన స్మార్ట్‌ఫోన్‌లో సోషల్‌మీడియా యాప్స్ అనేవి ఓ రకంగా ఆత్మ వంటివి. అలాంటి ఆత్మను చంపేస్తామంటూ ఊరుకోబోమని తెలియజేప్పేందుకే శాంతియుత నిరనస ర్యాలీలు చేపట్టామని నేపాల్‌లోని జెన్ జెడ్ యువత చెబుతోంది. దేశాన్ని చీడపీడలా తొలిచేస్తున్న అవినీతి, వారసత్వ రాజకీయాలు, ఉన్నతవర్గాల విలాసవంత జీవనాన్ని ప్రశ్నించేందుకు కదం తొక్కామని, మూడ్రోజులుగా జరుగుతున్న హింసాత్మక ఘటనలతో తమకు ఎలాంటి సంబంధం లేదని జెన్ జెడ్ విద్యార్థులు, యువజన సంఘాలు స్పష్టంచేశాయి. రాజకీయ అవకాశవాదులు ఉద్యమకారుల మాటున నిరసనకార్యక్రమాల్లో దూరిపోయి నేపాల్‌ను అగి్నగుండంలా మార్చేశారని విద్యార్థులు ఆరోపించారు. బంగ్లాదేశ్‌లో విద్యార్థుల నిరసనతో మొదలైన ఆందోళనలు తీవ్రరూపం దాల్చి చివరకు ప్రభుత్వాన్ని పడగొట్టాయని, నేపాల్లోనూ అదే కుట్ర జరుగుతోందని విద్యార్థులు తీవ్ర ఆరోపణలు చేశారు. లూటీలు, దోపిడీలకు తాము ఆమడదూరంలో ఉండిపోయామని, పోలీసులపై రాళ్లదాడి ఘటనలతో తమకెలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. ఈ విధ్వంసం వెనుక బయటి శక్తుల హస్తముందని విద్యార్థులు ఆరోపించారు. ఏకపక్షంగా సామాజిక మాధ్యమాలపై ఆకస్మిక నిషేధం వల్ల కలిగే అనర్థాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని తెలియజేప్పేందుకే వీధుల్లోకి వచ్చామని, విధ్వంసం చేయడం తమ ఉద్దేశ్యంకాదని స్పష్టంచేశారు. మద్దతు పలికిన మాజీ ప్రధాని విద్యార్థుల వాదనలకు పరోక్షంగా మాజీ ప్రధాని బాబూరామ్ భట్టారాయ్ మద్దతు పలికారు. ‘‘నాకు తెల్సిన విద్యార్థులు ఇలాంటి విధ్వంసాలకు అస్సలు దిగరు. వారసత్వ రాజకీయాలు, రాజకీయనేతలు, ఉన్నతవర్గాల విలాసవంత జీవితం, అవినీతిపై విద్యార్థుల తిరుగుబాటు మొదలైంది. తీరాచూస్తే ఈ తిరుగుబాటుకు వ్యతిరేకంగా మరో ‘తిరుగుబాటు’ఆరంభమైనట్లు తాజా ఘటనలు నిరూపిస్తున్నాయి. మేకవన్నె పులులు మీ ఉద్యమ మందల్లో దూరిపోయాయి. వారితో జాగ్రత్త అని మొదట్నుంచీ హెచ్చరిస్తూనే ఉన్నా’’అని విద్యార్థులను భట్టారాయ్ హెచ్చరించారు. ఉద్యమంలో బయటిశక్తులనుద్దేశిస్తూ.. ‘నేపాల్ ప్రజాస్వామ్య పునాదులనే పెకళించే దుస్సాహసానికి వాళ్లు దిగారు. వాళ్ల తదుపరి దారుణ లక్ష్యం ఏమిటో’’అని ఆందోళన వ్యక్తంచేశారు. సొంత దేశాన్ని తగలబెడుతున్న విద్యార్థులు అంటూ వస్తున్న వార్తలను భట్టారాయ్ తప్పుబట్టారు. ‘‘మొసలికన్నీరు కార్చడానికి విద్యార్థులేమీ రాజకీయనేతలు కాదు. అల్లర్లు, ఘర్షణలు చూసి విద్యార్థులే అవాక్కవుతున్నారు. శాంతియుత నిరసన కార్యక్రమాన్ని బయటి శక్తులు దురుద్దేశ్యంతో ఉగ్రరూపంలోకి మార్చేశారని విద్యార్థులు బాధపడుతున్నారు. తాజా వినాశనానికి బయటిశక్తులే కారణం’’అని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. తీవ్రంగా ఖండించిన యువజన, ఎన్జీవో సంఘాలు హింసాత్మక ఘటనలను యువజన, విద్యార్థి, లాభాపేక్షలేని ప్రభుత్వేతర ఎన్జీవోలు ఖండించాయి. ముఖ్యంగా తొలుత శాంతియుత నిరసన ప్రదర్శనలకు నాయకత్వం వహించిన జెన్ జెడ్ నేపాల్, హమీ నేపాల్ సంస్థలు ఈ విధ్వంసకాండపై ధ్వజమెత్తాయి. ఈ మేరకు బహిరంగ ప్రకటన చేశాయి. ‘‘మొదట్నుంచీ విధ్వంసాన్ని మేం అడ్డుకునేందుకే ప్రయతి్నంచాం. వినాశనానికి మాకు వీసమెత్తయినా సంబంధం లేదు. విద్యార్తులెవరూ ఇలా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసంచేయలేదు. ప్రధాని, మాజీ ప్రధానులు, ప్రభుత్వ కార్యాలయాలపై దాడులతో మాకు ఎలాంటి సంబంధం లేదు’’అని బుధవారం ప్రకటనలో స్పష్టంచేశాయి. ‘‘ఘటనాస్థలికి మేం తర్వాత వచ్చాం. బాధితులను కాపాడాం. సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాం. ప్రజల ఆస్తుల పరిరక్షణకు పాటుపడ్డాం’’అని జెన్‌జెడ్ నేపాల్ మరో ప్రకటనలో పేర్కొంది. ‘‘సహేతుకమైన, ప్రజాస్వామ్యయుత ఉద్యమపంథాలో సాగుతున్న మమ్మల్ని విధ్వంసకపర్వంలో భాగస్వాములుగా చిత్రించకండి. అధికారమే పరమావధిగా కుట్రలు చేసే రాజకీయ శక్తులు, అవకాశవాదులే ఈ వినాశనానికి సృష్టికర్తలు. మా ఉద్యమానికి తప్పుడు మరకలు అంటించే కుట్రలు జరుగుతున్నాయి. మంచి కోసం పోరాడుతున్న మమ్మల్ని దేశవినాశకారులుగా చిత్రించే కుట్రలు జరుగుతున్నాయి’’అని జెన్‌జెడ్ ఆరోపించింది. ‘‘మా వైపు నుంచి ఎలాంటి తప్పు జరగలేదు. కూల్చడం మా పనికాదు. దేశ పునర్నిర్మాణమే మా ధ్యేయం. దేశవ్యతిరేక యుద్ధం మేం చేయట్లేము. చెడుకు వ్యతిరేకంగా సాగుతున్న సంఘర్షణలో మాత్రమే విజయం సాధించాలని కోరుకుంటున్నాం. నఖూ జైలును మేం బద్దలుకొట్టలేదు. మాజీ ఉప ప్రధానమంత్రి రవి లమీచ్ఛానేను మేం జైలు నుంచి విడిపించలేదు ’’అని హమీ నేపాల్ ఒక ప్రకటనలో పేర్కొంది. -
కన్నడనాట వారసుల పోరు.. తండ్రులు, తాతల పేర్లు చెప్పుకొని..
కర్ణాటక ఎన్నికలంటే వంశపారంపర్య రాజకీయాలే కళ్లముందు కదలాడుతాయి. జేడీ(ఎస్) కుటుంబానికి కుటుంబం ఎన్నికల్లో పోటీ చేసి పదవులు దక్కించుకోవడం, కాంగ్రెస్‌తో పాటు బీజేపీ కూడా వారసులకి టికెట్లు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. రెండో తరం, మూడో తరం కూడా తండ్రులు, తాతల పేర్లు చెప్పుకొని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తండ్రి కోసం కొడుకు, కొడుకు కోసం తండ్రి చేసిన త్యాగాలు, తల్లిపైనున్న అసంతృప్తిని మోయడానికి సిద్ధమైన కొడుకు, భార్య టికెట్ కోసం ఏకంగా కుటుంబంపైనే తిరుగుబాటు సిద్ధమైన వారితో రాజకీయం రసకందాయంలో పడింది. తండ్రి కోసం యతీంద్ర త్యాగం ► మహాభారతంలో భీముడు, ఘటోత్కచుడు బంధం ఎలాగుంటుందో కర్ణాటక రాజకీయాల్లో కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య, ఆయన కుమారుడు యతీంద్ర మధ్య సంబంధం అలాగే ఉంటుందని చెప్పుకుంటారు. యతీంద్ర తండ్రికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి తన భవి ష్యత్‌ను కూడా పణంగా పెట్టారు. ఈ సారి ఎన్నికల్లో వరుణ అసెంబ్లీ సీటుని తన తండ్రి కోసం త్యాగం చేశారు. గత ఎన్నికల్లో 45 వేల ఓట్ల భారీ మెజార్టీతో వరుణ నుంచి నెగ్గిన యతీంద్ర కాంగ్రెస్ పార్టీ గెలిస్తే సిద్దరామయ్య సీఎం అవడం కోసం ఈ సీటుని వదులుకున్నారు. కాంగ్రెస్‌లో సిద్దరామయ్య, డికె. శివకుమార్ ఇద్దరూ సీఎం పదవి ఆశిస్తూ ఉండడంతో సిద్దరామయ్యని ఓడిస్తారన్న ప్రచారం జరుగుతోంది..వరుణ నియోజక వర్గం నుంచి పోటీపడితే సిద్దరామయ్యకి తిరుగుండదని యుతీంద్ర పోటీ నుంచి తప్పుకున్నారు. ప్రియాంక్ ఖర్గే.. లిట్మస్ టెస్ట్ ► కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కుమారుడైన ప్రియాంక్ ఖర్గే చిత్తపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. తండ్రి కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాక సొంత రాష్ట్రంలో జరుగు తున్న తొలి ఎన్నికల కావడంతో ఈ స్థానం నుంచి గెలిచి తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఎన్నికల్లో ప్రియాంక్ 4 వేల కంటే తక్కువ ఓట్లతో నెగ్గారు. పోలీసు రిక్రూట్మెంట్ కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చి బసవరాజ్ బొమ్మై ప్రభు త్వాన్ని ఇరకాటం పెట్టడంలో విజయం సాధించారు. ఈసారి కాంగ్రెస్‌కు 140 సీట్లు ఖాయమని ప్రియాంక్ అంటుంటే, ‘ప్రియాంక్ ఖర్గే కనబడుట లేదు’ అంటూ ఆయన నియోజకవర్గంలో బీజేపీ పోస్టర్లు ఏర్పాటు చేసింది! కుమారునికి యడ్డీ అండ ► వంశ పారంపర్య రాజకీయాలపై కాంగ్రెస్‌ను మొదట్నుంచి చీల్చి చెండాడుతున్న బీజేపీ కూడా కర్ణాటకలో బీఎస్ యడియూరప్ప ఒత్తిడికి తలొగ్గక తప్పలేదు. యడ్డీ 1983 నుంచి రికార్డు స్థాయిలో ఏడుసార్లు నెగ్గిన శివమొగ్గలో షికారిపుర నుంచి ఈ సారి విజయేంద్ర పోటీ పడుతున్నారు. ఎన్నికల వ్యవహారాలను తన భుజస్కంధాలపై మోస్తున్న యడియూరప్ప తన కుమారుడు విజయేంద్ర కోసం తాను స్వయంగా ఎన్నికల బరి నుంచి తప్పుకోవడంతో విజయేంద్రకు టికెట్ దక్కింది. బీజేపీ యువమోర్చా ప్రధాన కార్యదర్శిగా, కర్ణాటక రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నప్పటికీ విజయేంద్రకి గతంలో రెండు సార్లు టికెట్ రాక నిరాశ చెందారు. ముచ్చటగా మూడో సారి ప్రయత్నం ఫలించడంతో ఇక ఎన్నికల్లో గెలుపుపై ఆయన దృష్టి సారించారు. జేడీ(ఎస్)లో హాసన్ ప్రకంపనలు ► కుటుంబ పార్టీగా ముద్ర పడిన జేడీ(ఎస్)లో ఈ సారి ఎన్నికలు కుటుంబంలో చీలికకు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. హెచ్.డీ. దేవెగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణ తన భార్య భవానీ రాజకీయ ఎంట్రీకి ఇదే తగిన సమయమని భావిస్తున్నారు. హాసన్ నియోజకవర్గం నుంచి ఆమెకి టిక్కెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. మరోవైపు హెచ్.డి. కుమారస్వామి హాసన్ స్థానాన్ని తన వదినకు ఇవ్వలేమని హెచ్‌పి. స్వరూప్కే ఇస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే హెచ్డి రేవణ్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కుమారులు ప్రజ్వల్ రేవణ్ణ హాసన్ నుంచి ఎంపీగా ఉంటే, మరో కుమారుడు సూరజ్ రేవణ్ణ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇప్పుడు భవానీకి కూడా టిక్కెట్ ఇస్తే వారి కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఎనిమిదో వ్యక్తి అవుతారు. ఇది ఎన్నికల్లో తీవ్ర ప్రభావం కనిపించే అవకాశం ఉంది. ఒకవేళ టిక్కెట్ దక్కకపోతే తాను, తన భార్య స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తామని హెచ్డి రేవణ్ణ బెదిరింపులకు దిగడం పార్టీలో కలకలానికి దారి తీస్తోంది. అమ్మ కొడుకు ► హెచ్.డి. కుమారస్వామి కుమారుడు నిఖిల్ పోటీపడుతున్న రామనగర్ నియోజకవర్గంపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఇన్నాళ్లూ కుమారస్వామి భార్య అనిత కుమారస్వామి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె తన కొడుకు కోసం ఆ స్థానం నుంచి తప్పుకున్నారు. ఇటీవల నిఖిల్ రామనగర్‌లో పర్యటనకు వెళ్లినప్పుడు ఆయనకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంతో తల్లి వైఫల్యాలు ఇప్పుడు కుమారుడి భవిష్యత్‌ను ఎటు తీసుకువెళతాయా అన్న సందేహాలున్నాయి. మౌలిక సదు పాయాలు, తాగు నీటి సౌకర్యం కూడా లేకపోవ డంతో స్థానికులు నిఖిల్‌ను నిలదీస్తున్నారు. మరి ఈ స్థానం నుంచి నిఖిల్ నెగ్గుతారా లేదా అన్నది సందేహంగానే మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Gujarat Assembly Election 2022: వారసులపైనే ఆశలు!
వారసత్వ రాజకీయాలు.. దేశాన్ని పట్టిపీడిస్తున్న జాడ్యమని కేవలం ప్రజాస్వామ్యవాదులే కాదు, సాక్షాత్తూ రాజకీయ పార్టీలు సైతం నిందిస్తుంటాయి. ఆచరణలో మాత్రం అన్ని పార్టీలదీ అదే వరుస. సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలని చెప్పే పార్టీలు చివరకు గెలుపు గుర్రాల పేరుతో వారసులకే పట్టం కడుతున్నాయి. రాజకీయాల్లో వారసత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించే అధికార బీజేపీ గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో అదే బాటలో సాగుతోంది. గుజరాత్ ఎన్నికల్లో చాలాచోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల పుత్రరత్నాలే అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు. రాష్ట్రంలో 182 అసెంబ్లీ స్థానాలుండగా, దాదాపు 20 స్థానాల్లో వారసులకే పార్టీలు టికెట్లిచ్చాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ 13 మందికి, బీజేపీ ఏడుగురికి టికెట్లు ఇవ్వడం గమనార్హం. ప్రోత్సాహం ఇందుకే.. ఆర్థికంగా బలవంతులు కావడం, ఎన్నికల్లో ప్రత్యర్థులను ఢీకొట్టే సామర్థ్యం ఉండడం, కొన్ని సందర్భాల్లో ప్రత్యామ్నాయంగా మరో అభ్యర్థి లేకపోవడం వంటి కారణాలతో పార్టీలు వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పదిసార్లు విజయం సాధించిన గిరిజన నేత మోహన్ సిన్హ్ రాథ్వా ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరారు. బీజేపీ అధిష్టానం ఆయన కుమారుడు రాజేంద్ర సిన్హ్ రాథ్వాకు ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గమైన చోటా ఉదయ్‌పూర్ టిక్కెట్ కేటాయించింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా రైల్వే శాఖ మాజీ సహాయ మంత్రి నరాన్బాయి రాథ్వా కుమారుడు సంగ్రామ్ సిన్హ్ రాథ్వా పోటీ చేస్తుండడం గమనార్హం. సనంద్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కరణ్ సిన్హ్ పటేల్ కుమారుడు కానూ పటేల్ పోటీకి దిగుతున్నారు. థాస్రా నియోజకవర్గంలో బీజేపీ టిక్కెట్‌ను కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే రామ్ సిన్హ్ పర్మార్ కుమారుడు యోగేంద్ర పర్మార్ దక్కించుకున్నారు. వారసత్వం.. మా హక్కు అన్ని పార్టీల్లో కొన్ని కుటుంబాలు రాజకీయాలను తమకు దక్కిన వారసత్వంగా భావిస్తున్నాయని రాజకీయ విశ్లేషకుడు రవీంద్ర త్రివేది చెప్పారు. తమ నియోజకవర్గాలపై పట్టు నిలుపుకుంటున్నాయని పేర్కొన్నారు. చాలాచోట్ల ప్రత్యామ్నాయం లేకపోవడంతో పార్టీలు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో వారసత్వాన్ని అంగీకరించాల్సి వస్తోందని వెల్లడించారు. బలమైన నేతలు ఉన్న నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు మరొకరు సాహసించడం లేదని చెప్పారు. ఫలితంగా అక్కడ వారసులే పాగా వేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఒకవేళ నేతలను పక్కనపెట్టాల్సి వస్తే ఎన్నికల్లో పోటీ చేయడానికి వారి కుమారులు, కుమార్తెలు, భార్యలే పార్టీలకు దిక్కవుతున్నారని తెలియజేశారు. మాజీ సీఎం కుమారుడికి మళ్లీ చాన్స్ దనిలీమ్దా స్థానంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మనూబాయి పర్మార్ కుమారుడు శైలేశ్ పర్మార్‌కు ఆ పార్టీ నుంచి టికెట్ లభించింది. బయాద్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి శంకర్‌సిన్హ్ వాఘేలా కుమారుడు, మాజీ ఎమ్మెల్యే మహేంద్రసిన్హ్ వాఘేలా మరోసారి పోటీ చేస్తున్నారు. 2019లో బీజేపీలో చేరిన మహేంద్రసిన్హ్ వాఘేలా గత నెలలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గుజరాత్ మాజీ సీఎం అమర్‌సిన్హ్ చౌదరీ కుమారుడైన తుషార్ చౌదరీ బార్దోలీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కాంగ్రెస్ అబద్ధాలకోరు పార్టీ
సాక్షి ప్రతినిధి, చెన్నై/పుదుచ్చేరి: ‘విభజించు, అబద్ధమాడు, పాలించు’ అనేదే కాంగ్రెస్ పార్టీ విధానమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. ఉత్తరాది, దక్షిణాది అంటూ ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. దేశంలో కాంగ్రెస్ సంస్కృతి అయిన ఫ్యూడల్, వారసత్వ రాజకీయాలు ముగిసిపోయాయని అన్నారు. దేశమంతటా ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారని చెప్పారు. అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్ పార్టీలో బంగారు, వెండి, రజత పతక విజేతలున్నారని ఎద్దేవా చేశారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పుదుచ్చేరిలో గురువారం బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్ అసమర్థ పాలన నుంచి పుదుచ్చేరి స్వేచ్ఛ పొందిందని చెప్పారు. ముఖ్యమంత్రిగా వి.నారాయణస్వామి ‘హైకమాండ్’ ప్రభుత్వానికి నేతృత్వం వహించారని, ఢిల్లీలోని కొందరు కాంగ్రెస్ పెద్దల ప్రయోజనాల కోసమే పని చేశారని ధ్వజమెత్తారు. నారాయణస్వామి కాంగ్రెస్ పెద్దల చెప్పులు మోయడంలో సిద్ధహస్తుడని మండిపడ్డారు. పుదుచ్చేరిని అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని ఎన్డీయే కోరుకుంటున్నట్లు తెలిపారు. తాము అధికారంలోకి వస్తే పుదుచ్చేరిని వ్యాపార, విద్యా, ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తామన్నారు. పుదుచ్చేరిలో ‘మార్పు’ గాలులు విభజించు, పాలించు అనేది వలస పాలకుల సిద్ధాంతమైతే.. విభజించు, అబద్ధాలు చెప్పు, పాలించు అనేది కాంగ్రెస్ విధానమని నరేంద్ర మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు ప్రాంతాలకు మధ్య, వర్గాలకు మధ్య తగువు పెడుతున్నారని పరోక్షంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాది రాజకీయాలు, దక్షిణాది రాజకీయాలు వేర్వేరుగా ఉంటాయని రాహుల్ గాంధీ మంగళవారం కేరళలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కేంద్రంలో మత్స్యశాఖ లేదన్న రాహుల్ వ్యాఖ్యలను ప్రధాని మోదీ ఖండించారు. ఆయన అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. 2019లో మత్స్య శాఖను ఏర్పాటు చేశామని, బడ్జెట్లో ఆ శాఖకు భారీగా నిధులు కేటాయిస్తున్నామని గుర్తుచేశారు. పుదుచ్చేరి ప్రజలు 2016లో ఎన్నో ఆశలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారని, వారి ఆశలన్నీ అడియాసలయ్యాయన్నారు. పుదుచ్చేరిలో ‘మార్పు’ గాలులు వీస్తున్నాయని చెప్పారు. అన్నదాత బాగుంటే.. కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తూ తమిళుల కలలను సాకారం చేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. దేశ పారిశ్రామిక ప్రగతిలో తమిళనాడు ప్రథమ స్థానంలో నిలిచిందని ప్రశంసించారు. ఆయన గురువారం పుదుచ్చేరితోపాటు తమిళనాడులోని కోయంబత్తూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ‘మోదీ గో బ్యాక్’ పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేత, నీట్ పరీక్షలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 10 శాతం రిజర్వేషన్‌ను నిరాకరించిన కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కోయంబత్తూరులో నల్లజెండాలతో ప్రజలు ర్యాలీ నిర్వహించారు. ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తారోకో చేపట్టారు. నల్ల బెలూన్లను గాలిలోకి వదిలి ‘మోదీ గో బ్యాక్’ అంటూ నినదించారు. ఇద్దరు యువతులు సహా 77 మందిని విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. లాస్‌పేటలో నల్లబెలూన్లు ఎగురవేసిన తమిళగ వాళ్వురిమై కట్చి కార్యకర్తలను అరెస్ట్ చేశారు. -
వారసత్వానికి మోదీ పాతర!
సందర్భం ఇప్పుడు నరేంద్ర మోదీ అంటే ఓట్లను రాబట్టే సామర్థ్యం అనే బ్రహ్మాస్త్రాన్ని కలిగి ఉన్న మాస్ మహరాజా. మరోలా చెప్పాలంటే ఉత్సవ విగ్రహాలను నిలబెట్టినా సరే గెలిపించుకువచ్చే ప్రభావ శక్తి ఇప్పుడు ప్రధాని సొంతం. ఇప్పుడు భారత రాజకీయాల్లో సరికొత్త విరాణ్మూర్తి నరేంద్ర మోదీ. ఇక్కడ ప్రశ్న 2019 ఎన్నికల్లో గెలుపునకు పరిమితం కాదు.. తన సరికొత్త కీర్తితో మోదీ ఏం చేయనున్నారన్నదే ప్రశ్న. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ‘టెక్టానిక్ షిప్ట్’ అనే పదబంధంతో వర్ణించారు. భూ ఉపరి తలంలోని ఫలకాలు ఒకదాంట్లోకి మరొకటి చొచ్చుకు పోవడమే టెక్టానిక్ షిఫ్ట్. అత్యవసర పరిస్థితి అనంతరం జనతా పార్టీ ప్రభంజనం నాటి నుంచి మరెవరికీ సాధ్యం కానంత ఘన విజయం మోదీ సాధించారు. కాంగ్రెస్ పార్టీ పది కంటే తక్కువ స్థానాలకు పరిమితమైపోయింది. ఇక ఉత్తరాఖండ్‌ను ఊడ్చేసిన బీజేపీ ఇంతవరకు ఉనికే లేని మణిపూర్‌లో నిజమైన రాజకీయ శక్తిగా మారింది. అయితే, భారత ప్రాదేశిక రాజకీయాలనే కాకుండా దేశ సామాజిక, మానసిక, భావజాల రంగాలను కూడా పునర్నిర్మిస్తున్న ఈ అధికార మార్పిడిని టెక్టానిక్ మార్పు తో పోల్చడం మరీ తేలికగా ఉందని నా అభి ప్రాయం. ఈ మార్పునకు చెందిన అతిపెద్ద తొలి సంకేతం ఏదంటే ఇందిరాగాంధీ తర్వాత అత్యంత జనాకర్షణ గల భార తీయ నేతగా నరేంద్ర మోదీ ఆవిర్భవించారు. అది కూడా వారసత్వంపై కాకుండా తన సొంత ప్రయత్నంతో దీన్ని సాధించారు. రెండోది.. ఇందిరా గాంధీ అనంతరం ఏ భారతీయ నేతా సాధించని అజమాయిషీని అధికార పార్టీపై మోదీ దఖలుపర్చుకున్నారు. మోదీతోపాటు ఎన్ని కల రణరం గంలో సంపూర్ణ విజయాలను సాధిస్తున్న ఫీల్డ్ మార్షల్ అమిత్ షా కూడా 1960లనాటి కామరాజ్ నాడార్ తర్వాత జాతీయ స్థాయి పార్టీకి అత్యంత శక్తిమంతమైన అధినేతగా ముందు కొచ్చారు. స్వాతంత్య్రానంతరం దేశ ప్రధాన కేంద్రానికి వెలు పల నుంచి వచ్చి అంతటి జాతీయ ఉన్నతిని పొందిన తొలి నేత కూడా మోదీనే. బయటి ప్రాంతం నుంచి వచ్చి దేశవ్యాప్త ప్రాచుర్యం పొందిన మరో నేత మహాత్మా గాంధీ మాత్రమే అని నేనంటే తప్పుగా భావించే ప్రమా దం ఉంది కానీ, గాంధీ కూడా గుజరాత్ నుంచే వచ్చాడ న్నది మినహా ఇరువురికీ పోలికలు పెట్టలేం. మోదీతో విభే దించేవారు సైతం అతని సమగ్ర వ్యక్తిత్వాన్ని శంకించ లేరు. అందుకే పెద్దనోట్ల రద్దుతో తీవ్రంగా ఇబ్బంది పడినా ప్రజలు మోదీని క్షమించారంటే ఇదే కారణం. ఆర్థిక సంస్కరణ, సామాజిక సందేశం వంటి అంశాల్లో ప్రధానిగా మోదీ తొలిదశ పాలన రికార్డు అతు కుల బొంతలాగే ఉందని మోదీకి అత్యంత విశ్వాస పాత్రు లైన సమర్థకులు కూడా గుర్తిస్తున్నారు. కానీ గుజరాత్లో ఆయన పాలనా చరిత్రను మనం తెలుసుకోవాలని, మోదీ రెండోదశ పాలనకోసం వేచి ఉండాలని వీరంటున్నారు. సీఎంగా తొలి పాలనాకాలంలో మోదీ తన విభజన రాజ కీయాలతో తీవ్ర ఘర్షణాత్మక వైఖరిని పాటించేవారు. రెండో దశ పాలనలో ఆర్థిక, మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించి జాతీయ రాజకీయాధికార సాధనకు ఒక బలమైన పునాదినే నిర్మించుకున్నారు. ఇప్పుడు మోదీ అంటే ఓట్లను రాబట్టే సామర్థ్యం అనే బ్రహ్మాస్త్రాన్ని కలిగి ఉన్న మాస్ మహరాజా. మరోలా చెప్పాలంటే ఉత్సవ విగ్రహాలను నిలబెట్టినా సరే గెలిపించుకు వచ్చే సామర్థ్యం ఇప్పుడు మోదీ సొంతం. తన అధికారాన్ని మోదీ ఇకపై ఎలా ఉపయోగిస్తార న్నదే ఇప్పుడు ప్రశ్న. 2007లో గుజరాత్లో చేసినట్లే.. ఎన్నికల్లో అడ్డు వచ్చే ఎవరినైనా నిర్మూలించడం నుంచి తప్పుకుని ఇకపై ప్రధాని ఆర్థిక మార్పుపై దృష్టి పెడ తారా? నిజంగానే అలాంటి అవకాశం ఇప్పుడు మోదీకి దక్కింది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే దాని తొలి కుటుంబంలాగా ఓట్లు సాధించే రోజులు పోయాయి. 2004లో సాధించిన అనూహ్య విజయం.. అలాంటి రోజులు వచ్చాయన్న భ్రమలను మళ్లీ రెకెత్తించింది కానీ, ఇప్పుడు ఆ ఆశ కూడా పోయింది. రెండోది. రాహుల్ గాంధీ ప్రజానేత కారు. మహా అంటే ఆయన పార్టీని కలిసి కట్టుగా ఉంచగలరు. కానీ నిజమైన అధికారం కలిగిన సీఈఓలతో కూడిన కంపెనీగా పార్టీని నిర్వహించకపోతే కాంగ్రెస్‌కు ఇక భవిష్యత్తు లేనట్లే. పైగా అధికారం హక్కు భుక్తం అనే భావనకు ఇప్పుడు యువ భారతం పూర్తి వ్యతిరేకం. రాహుల్ తన వారసత్వ రికార్డుతో వారిని మెప్పించడానికి ప్రయత్నించడం వ్యర్థం. ఇకనుంచి రాహుల్ తన గురించి తాను మాట్లాడితే మంచిది. ఇక ఉత్తర ప్రదేశ్‌లో కుల ప్రాతిపదిక రాజకీయ పార్టీలు తమను తాము పునర్నిర్మించుకోవాలి లేక సన్యా సమైనా పుచ్చుకోవాలి. కులాలుగా చీలిపోయిన దేశ ప్రధాన కేంద్రంలో మూడు దశాబ్దాలుగా బీజేపీ హిందు త్వ అనే విశ్వాసంతో మెజారిటీని కూడగట్టే వ్యూహంతో పని చేసింది. హిందువులు ఉన్నత, నిమ్న, మధ్యతరగతి కులాలుగా వేరుపడటం కాకుండా కలిసి కట్టుగా ఓటేసి నంత కాలం ఇక బీజేపీని ఓడించటం అసాధ్యం. గతంలో రామమందిరం ఉద్యమం ద్వారా ఎల్కే అడ్వాణీ ఈ విషయంలో కొంత సఫలమయ్యారు కాని అది కొన్నాళ్లే ప్రభావం చూపింది. ఇప్పుడు మెజారిటీ భారత జాతీయ వాదం ద్వారా మోదీ, అమిత్ షాలు కొత్త ప్రభంజనం సృష్టించారు. ముఖ్యమైన వాస్తవం ఏదంటే ముస్లిం ఓటర్లు భవి ష్యత్తు గురించి చింతిస్తున్నారు. మోదీ–షా వ్యూహం ముస్లిం ఓటును వేరు చేసింది. అదిప్పుడు అసంగతమైన విషయమని నిరూపించారు. ‘లౌకిక పార్టీ’లు తమ రాజ కీయాలను ఇకపై పూర్తిగా తిరగ రాసుకోవాల్సిందే. - శేఖర్ గుప్తా twitter@shekargupta