breaking news
heavy penalties
-
పెట్రోలియం లైసెన్సు ఉల్లంఘనలకు భారీ జరిమానా
న్యూఢిల్లీ: పెట్రోలియం లైసెన్స్ నిబంధనలకు సంబంధించి సాధారణ ఉల్లంఘనలను క్రిమినల్ పరిధి నుంచి తప్పించి భారీ జరిమానాలు విధించేలా కేంద్రం కొత్త ప్రతిపాదనలను తెరపైకి తెచ్చింది. అయితే, ప్రజా భద్రత, కీలకమైన మౌలిక సదుపాయాలకు భంగం కలిగించే తీవ్రమైన నేరాలు, అనధికారిక పెట్రోలియం కార్యకలాపాలు మాత్రం క్రిమినల్ నేరాల కిందే కొనసాగనున్నాయి. పెట్రోలియం చట్టం 1934ని మార్చేందుకు ఉద్దేశించిన సవరణల ముసాయిదాలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ ఈ మేరకు ప్రతిపాదనలు చేసింది.ప్రతిపాదిత సవరణలను ప్రచురించిన తేదీ నుంచి 30 రోజుల్లోగా ప్రజలు, పరిశ్రమ వర్గాలు తమ అభిప్రాయాలు, సూచనలను తెలియజేయాల్సి ఉంటుంది. వీటి ప్రకారం లైసెన్స్ నిబంధనల ఉల్లంఘన విషయంలో క్రిమినల్ ప్రాసిక్యూషన్ కాకుండా అడ్మిని్రస్టేటివ్ వ్యవస్థ కింద చర్యలు ఉంటాయి. తొలిసారిగా ఉల్లంఘిస్తే నిర్దిష్ట అధికారి రూ. 2.5 కోట్ల వరకు సివిల్ పెనాల్టీ విధించవచ్చు. పదే పదే ఉల్లంఘిస్తే ఇది రూ. 5 కోట్ల వరకు పెరుగుతుంది. తీవ్రతను బట్టి ఆంక్షలు విధించేందుకు లేదా లైసెన్సును రద్దు చేసేందుకు కూడా అధికారి సిఫార్సు చేయొచ్చు.లైసెన్సు లేకుండా అనధికారికంగా పెట్రోలియం కార్యకలాపాలు నిర్వహిస్తే మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 25 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. మోసపూరితంగా లైసెన్సు తీసుకుంటే ఐదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా ఉంటాయి. కీలక పెట్రోలియం మౌలిక సదుపాయాలు దెబ్బతినేందుకు కారణమైతే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ. 25 కోట్ల వరకు జరిమానా విధిస్తారు. 1970 నుంచి ఈ చట్టాన్ని మార్చలేదు. -
తాగి బండి నడిపితే.. 25వేల జరిమానా!!
మద్యం తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణం అయ్యేవాళ్ల మీద కొరడా ఝళిపించాలని కేంద్రం నిర్ణయించింది. ఇకమీదట ఎవరైనా తాగి వాహనం నడుపుతూ మొదటిసారి పట్టుబడితే రూ. 25వేల జరిమానా లేదా మూడు నెలల జైలుశిక్ష లేదా రెండూ, వాటితో పాటు ఆరు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ విధించే అవకాశం ఉంటుంది. అదే రెండోసారి అయితే 50వేల రూపాయల జరిమానా, ఏడాది వరకు జైలుశిక్ష, లేదా రెండూ, వాటితో పాటు ఏడాదిపాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ విధిస్తారు. మూడోసారి కూడా అలా పట్టుబడ్డారో.. ఇక లైసెన్సును శాశ్వతంగా రద్దుచేయడంతో పాటు వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకుంటారు. మోటారువాహనాల చట్టంలో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు కొత్తగా మార్పుచేర్పులు చేస్తోంది. స్కూలు బస్సు డ్రైవర్లు తాగి పట్టుబడితే వారికి రూ. 50వేల జరిమానా, మూడేళ్ల వరకు జైలుశిక్ష విధిస్తారు. దాంతోపాటు తక్షణం వాళ్ల లైసెన్సు రద్దుచేస్తారు. ట్రాఫిక్ ఉల్లంఘనుల మీద కఠినచర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ప్రమాదాల్లో ఎవరైనా చిన్నపిల్లల మృతికి కారణమైతే వాళ్లకు రూ. 3లక్షల జరిమానా, కనీసం ఏడేళ్ల జైలుశిక్ష విధించాలని తలపెట్టింది. వాహనాన్ని సురక్షితం కాని పరిస్థితుల్లో ఉపయోగిస్తుంటే లక్ష రూపాయల వరకు జరిమానా, ఏడాది వరకు జైలుశిక్ష లేదా రెండూ విధించొచ్చట. ట్రాఫిక్ సిగ్నళ్లను మూడుసార్లు ఉల్లంఘిస్తే.. రూ. 15వేల జరిమానా, లైసెన్సు నెలరోజుల పాటు సస్పెన్షన్, తప్పనిసరి శిక్షణ ఉండాలట.


