breaking news
headmasters
-
స్కూల్ నుంచి రిటైర్మెంట్ వరకూ.. ‘ముగ్గురు మిత్రులు’
ఆ ముగ్గురూ ప్రాణ స్నేహితులనడానికి నిజమైన అర్థంగా నిలిచారు. ఒకటో తరగతితో మొదలైన వారి స్నేహం.. చదువు పూర్తయ్యి, ఉద్యోగాలలో చేరి.. పదవీ విరమణ చేసే వరకూ ఐక్యంగా కొనసాగింది. ఈ ఉదంతం తెలిసిన వారంతా తెగ ఆశ్యర్యపోతున్నారు. వారి అమూల్య స్నేహాన్ని చూసి, వారేవా అంటున్నారు. ఇది కేరళలోని ఇడుక్కి జిల్లా నెయ్యస్సేరి గ్రామానికి చెందిన కథనం. 1975లో నెయ్యస్సేరి సెయింట్ సెబాస్టియన్ హైస్కూల్లో ఒకటో తరగతిలో అడుగుపెట్టిన ముగ్గురు చిన్నారులు.. సోని మాథ్యూ, సాల్జీ ఇమ్మాన్యుయేల్, సిమీ జోస్‌లు తొలుత క్లాస్మేట్స్. కాలక్రమేణా వీరి పరిచయం విడదీయలేని బంధంగా మారి, ఐదు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణానికి నాంది పలికింది. వీరి విద్యాభ్యాసంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు వీరు ముగ్గురూ ఒకే పాఠశాలలో కలిసి చదువుకున్నారు. ఒకే బెంచిపై పాఠాలు వింటూ, పెరిగిన ఈ స్నేహితులు, పదో తరగతి తర్వాత కూడా ఒకేలాంటి లక్ష్యాలతో ముందుకు సాగారు. విద్యాభ్యాసం పూర్తయ్యాక, సమాజానికి మేలు చేసే ఉపాధ్యాయ వృత్తినే ముగ్గురూ ఎంచుకోవడం విశేషం.సోని మాథ్యూ సోని మాథ్యూ తన కెరీర్లో పదేళ్ల పాటు హైస్కూల్ టీచర్‌గా సేవలందించి, తాను చదువుకున్న నెయ్యస్సేరి పాఠశాలలోనే ఏడాది పాటు హెడ్ మాస్టర్‌గా బాధ్యతలు నిర్వహించడం విశేషం. త్వరలో ఈయన పైన్కులం సెయింట్ రీటాస్ హైస్కూల్ హెడ్ మాస్టర్‌గా పదవీ విరమణ చేయనున్నారు. తన విజ్ఞానంతో ఎందరో విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దిన తృప్తి ఆయన కళ్లలో నిరంతరం కనిపిస్తుంటుంది.సాల్జీ ఇమ్మాన్యుయేల్ విద్యా యజ్ఞంలో అలుపెరగని బాటసారి సాల్జీ ఇమ్మాన్యుయేల్ తన వృత్తి జీవితంలో కేరళలోని ముతలకోడం, చెమ్మనార్, ఇలందేశం, రాజముడి, చలస్సేరి తదితర మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలల్లో పనిచేశారు. ఎక్కడ పనిచేసినా తనదైన ముద్ర వేసిన ఆమె ప్రస్తుతం కలియార్ సెయింట్ మేరీస్ ఎల్పీ స్కూల్ హెడ్ మిస్ట్రెస్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అక్షరమే ఆయుధంగా ఆమె సాగించిన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం.సిమీ జోస్ అంకితభావానికి నిలువుటద్దంలా నిలిచిన ఈ ముగ్గురి బృందంలో మరొకరు సిమీ జోస్. వెన్మణి సెయింట్ జార్జ్ యూపీ స్కూల్, వలక్కల్ ఎల్ఎఫ్ యూపీఎస్, ఎలుముట్టం సెయింట్ మేరీస్ తదితర పాఠశాలల్లో సేవలు అందించారు. ప్రస్తుతం కొడిక్కులం సెయింట్ మేరీస్ ఎల్పీ స్కూల్ హెడ్ మిస్ట్రెస్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె, తన తోటి స్నేహితులతో కలిసి ఒకేసారి పదవీ విరమణ చేయనుండటం గమనార్హం.కొత్తమంగళం డియోసెస్ పరిధిలోని వివిధ పాఠశాలల్లో అంచలంచెలుగా ఎదుగుతూ నేడు హెడ్ మాస్టర్ హోదాల్లో ఉన్న ఈ ముగ్గురు మిత్రులు.. 2026, మార్చి నెలలో ఒకేసారి పదవీ విరమణ చేయనున్నారు. ఒకే పాఠశాలలో ఓనమాలు నేర్చుకున్న ఈ స్నేహితులు.. ఐదు దశాబ్దాల తర్వాత ఒకే సమయంలో విద్యాశాఖ నుండి వీడ్కోలు తీసుకోవడం కేరళ విద్యా వర్గాల్లో అరుదైన రికార్డుగా నిలిచింది. ఇది కూడా చదవండి: నిపా వైరస్: భారత్‌కు ‘ఆరోగ్య సంస్థ’ హెచ్చరిక -
జీతాలు చాలకపోతే భిక్షాటన చేయండి
అనంతపురం ఎడ్యుకేషన్ : జీతాలు చాలకపోతే భిక్షాటన చేయమనండి .. అంతే కానీ అడ్మిషన్ల సమయంలో, టీసీలు ఇచ్చే సమయంలో ఇలా డబ్బు వసూలు సరికాదని హెచ్ఎంలను ఉద్ధేశించి డీఈఓ అంజయ్య మండిపడ్డారు. స్థానిక సైన్స్ సెంటర్లో మంగళవారం ఎంఈఓల సమావేశం నిర్వహించా రు. అయితే విద్యాధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు సమావేశాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తున్నారని, కొన్ని పాఠశాలల్లో అడ్మిషన్ల ఫీజులు వసూలు చేస్తున్నారని, టీసీలు ఇచ్చేందుకు డబ్బులు దండుకుంటున్నారన్నారు. విద్యా వ్యాపారాన్ని అడ్డుకోలేని అధికారులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో డీఈఓ హెచ్‌ఎంలపై అసహనం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం లక్షలాది రూపాయలు జీతాలు ఇస్తున్నా చాల్లేదా.. అలా అయితే అడుక్కోండంటూ మండిపడ్డారు. విద్యాహక్కు చట్టం ప్రకారం రూపాయి కూడా వసూలు చేయకూడదనే విషయం తెలీదా అసహనం వ్యక్తం చేశారు. కొన్ని ప్రైవేట్ స్కూళ్లలో గుర్తింపు ఒకచోట ఉంటే తరగతులు మరోచోట నిర్వహిస్తున్నారని, అసలే గుర్తింపు లేకుండా తరగతులు నిర్వహిస్తున్నా పట్టించుకోవడం లేదని ఎస్ఎఫ్ఐ నాయకులు డీఈఓ దృష్టికి తెచ్చారు. దీంతో అలాంటి వాటిని వెంటనే సీజ్ చేయాలని డీఈఓ ఎంఈఓలను ఆదేశించారు. ఎన్నిమార్లు చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, సమావేశాన్ని రద్దు చేయాలంటూ ఎస్ఎఫ్ఐ నాయకులు పట్టుబట్టారు. అక్కడే బైఠాయించారు. చివరికి డీఈఓ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆంజనేయులు, జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు కుమార్ నాయుడు, రమేష్, నగర కార్యదర్శి సూర్యచంద్రయాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు నాగార్జున, నాయకులు ఆలం, రాజు, విష్ణు పాల్గొన్నారు.


