breaking news
Handsome hero
-
ఏమున్నాడు రా బాబు.. మహేశ్ అందానికి సీక్రెట్ ఏంటి?
టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరంటే సూపర్‌స్టార్ మహేశ్ బాబు అనే ఠక్కున చెప్పేస్తారు. అమ్మాయిల కలల రాకుమారుడిగా మహేశ్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నాలుగు పదుల వయసులోనూ పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తారు మహేశ్. వయసు పెరిగే కొద్దీ ఆయన అందం మరింత పెరుగుతుందా అనే సందేహం ఎవరికైనా వస్తుంది. ఏమున్నాడు రా బాబు, అచ్చం హాలీవుడ్ కటౌట్ అంటూ మహేశ్ లుక్స్‌కి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతుంటారు. అమ్మాయిల మనసు కొల్లగొట్టడంలో మహేశ్ తర్వాతే ఎవరైనా. మరి మహేశ్ ఏం తింటాడు? 50కి దగ్గరవుతున్నా ఇంత హ్యాండ్స్‌మ్‌గా, ఛార్మింగ్ లుక్ ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నాడు? ఆయన అందం వెనుకున్న సీక్రెట్స్ ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. సూపర్ స్టార్ మహేశ్ బాబు అందం గురించి అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా అసూయపడుతుంటారు. ప్రతి సినిమాకి సరికొత్త లుక్‌లో కనిపిస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంటాడు మన సూపర్‌స్టార్. దీంతో ఆయన గ్లామర్ వెనుకున్న సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని హీరో,హీరోయిన్లు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా మహేశ్ బాబు తన ఫ్యామిలీతో లండన్ ట్రిప్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ దిగిన పలు ఫోటోలను మహేశ్ భార్య నమ్రత సోషల్ మీడియా వేదికగా పంచుకోగా, మహేశ్ యంగ్ లుక్‌కి నెటిజన్లు ఫిదా అయ్యారు. దీంతో ఆయన ఫిట్నెస్, డైట్ విషయం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. గతంలో సర్కారు వారి పాట సినిమా ప్రమోషన్స్ టైంలో మహేశ్ సినిమా విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు. తన డైట్ గురించి ప్రస్తావిస్తూ.. “చాలా వరకు అన్నీ తింటాను, కానీ లిమిట్స్ లో తింటాను.పెరుగు, డైరీ ప్రోడక్ట్స్, పిజ్జాలు, బర్గర్, బ్రెడ్, జంక్ ఫుడ్ లాంటివి అస్సలు తినను. పిల్లలతో ఉన్నప్పుడు సరదాగా స్వీట్స్ లాంటివి కొన్ని తింటాను వాళ్ళ కోసం. ఆల్మండ్ మిల్క్ తో చేసిన పదార్థాలు తింటాను. ఇలా స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయ్యి సుమారు పదేళ్లవుతుంది. మొదట్లో కాస్త కష్టంగా అనిపించినా ఆ తర్వాత అలవాటైపోయింది అంటూ మహేశ్ స్వయంగా తెలిపాడు. మనం తినే తిండి ఎంత ముఖ్యమో, సంతోషంగా ఉండటం కూడా అంతే ముఖ్యమని, బహుశా అదే తన ఎనర్జీకి కారణమై ఉంటుందని వివరించాడు. జీవితంలో ఒత్తిడి లేకుండా చూసుకుంటాను. ఏ విషయాన్ని అయినా పెద్దగా ఆలోచించను. అదే నా ఎనర్జీ సీక్రెట్’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మరో సీక్రెట్ ఏంటంటే.. ప్రతిరోజూ మహేశ్ మూన్ ధ్యానం చేస్తారట. అంటే ప్రతిరోజూ చంద్రుని నీడలో ధ్యానం చేస్తారట. దీని వల్ల మనసు ప్రశాంతంగా ఉండటంతో పాటు పాజిటివ్ ఎనర్జీ వస్తుందట. సుధీర్ఘ కాలం నుంచి మహేశ్ ఈ మూన్ ధ్యానం చేయడం వల్ల ఇంత ఛార్మింగ్‌గా కనిపిస్తారని ఆయనతో పనిచేసిన ఫైట్ మాస్టర్స్ రామ్ –లక్ష్మణ్‌లు గతంలో ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. ఇక ఫిజికల్ ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ద వహించే మహేశ్ బాబు షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా క్రమం తప్పకుండా జిమ్ చేస్తాడట. ఇక మహేశ్ బాబు అందం వెనుక ఓ డెర్మటాలజిస్ట్ కూడా ఉన్నారు. కర్ణాటకకు చెందిన రష్మి శెట్టి అనే డాక్టర్ గత కొన్నాళ్లుగా మహేశ్‌కు పర్సనల్ డెర్మలాటజిస్ట్గా వ్యవహరిస్తున్నారు. -
ప్రపంచ అందగాళ్లలో హృతిక్ ఫస్ట్
‘ఆసియన్ సెక్సియస్ట్ మేన్, మేన్ ఆఫ్ ది ప్లానెట్’ వంటి టైటిల్స్ దక్కించుకున్న బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తాజాగా మరో అరుదైన టైటిల్ సొంతం చేసుకున్నారు. ఓ అంతర్జాతీయ వెబ్సైట్ ఇచ్చిన ‘వరల్డ్ టాప్ టెన్ హ్యాండ్సమ్ హీరో’ల ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో నిలిచారు ఈ ఆరడుగుల అందగాడు. అది కూడా ప్రముఖ హాలీవుడ్ నటులు రాబర్ట్ ప్యాటిన్సన్, క్రిస్ ఇవాన్స్‌లను వెనక్కి నెట్టి మరీ తొలి స్థానంలో నిలవడం విశేషం. మరో బాలీవుడ్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచారు. ఇంతవరకూ ఏ భారతీయుడూ సాధించని ఘనతను హృతిక్ సాధించాడంటూ ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తున్నాయి. పలువురు బాలీవుడ్ ప్రముఖులు హృతిక్‌ని అభినందిస్తున్నారు. ఇక ఆయన ఫ్యాన్స్ ఆనందాలకు అవధుల్లేవు. మా హీరోనే అందగాడు అంటూ పండగ చేసుకుంటున్నారు. ప్రపంచ టాప్‌టెన్ హ్యాండ్సమ్ హీరోల్లో వరుసగా హృతిక్ రోషన్, రాబర్ట్ ప్యాటిన్సన్, గాడ్ఫ్రే గావో, క్రిస్ ఇవాన్స్, సల్మాన్ ఖాన్, డేవిడ్ బోరియానాజ్, నోవా మిల్స్, హెన్రీ కవిల్, టామ్ హిడిల్స్టన్, సామ్ హ్యూగన్ నిలిచారు.