breaking news
Half sarees
-
హాఫ్ శారీకే అందం తెచ్చిన ‘బుజ్జితల్లి’ (ఫొటోలు)
-
Suma Kanakala: అనార్కలీ డ్రెస్‌లో సింప్లీ సూపర్బ్ అనిపిస్తున్న సుమ (ఫోటోలు)
-
Fashion: ఉగాదికి ఓణీ... తక్కువ ఖర్చుతోనే ఇలా అందంగా!
కాలం మంచితనంతో నేసిన ఆనందాలే మన వేడుకలు. నలుగురు కలిసే చోట.. నవ్వుల విందులు వేసే చోట.. సంబరాలు నట్టింట కొలువుండే చోట .. పండగ కాంతి దేదీప్యంగా వెలగాలంటే మన చేనేతలతో మరింత కొత్తగా సింగారించుకోవాలి ఏడాది పొడవునా ఇంటింటా శుభాలు నిండాలి. తెలుగింటి మగువల సంప్రదాయ ఆహార్యం లంగావోణీ. పదహారణాల పోలికతో హృదయాల్లో కొలువుండే అందమైన రూపం. అందుకే మార్కెట్లోకి ఎన్ని డిజైనర్ డ్రెస్సులు వచ్చినా లంగా– ఓణీ ప్రాభవం ఇసుమంతైనా తగ్గలేదు. ఈ ప్రకృతి పండగ మరింత శోభాయమానంగా జరపుకోవడానికి సిద్ధంగా ఉంటున్నాయి మన చేనేతలు. హైదరాబాద్ మేడ్చల్‌లో ఉంటున్న ఫ్యాషన్ డిజైనర్ తరుణి సిరిగిరి వేడుకలలో లంగా– ఓణీ చేనేత హంగామా గురించి ఇలా అందంగా పరిచయం చేస్తున్నారు. ‘‘సాధారణంగా వేడుకల్లో లెహంగా డిజైన్స్ భారీ ఫ్లెయిర్, నెటెడ్ మెటీరియల్‌తో చూస్తుంటాం. కానీ, ఇది వేసవి కాలం. ఈ సీజన్‌కి తగ్గట్టు మన అలంకరణ కూడా ఉంటే రోజంతా సౌకర్యంగా ఉండటంతో సందర్భాన్ని మరింతగా ఆనందిస్తాం. పచ్చని సింగారం కంచిపట్టు సంప్రదాయ వేడుక ఏదైనా కంచిపట్టు లేకుండా పూర్తవదు అనేది మనందరికీ తెలిసిందే. సాధారణంగా లంగాబ్లౌజ్ ఒక రంగు కాంబినేషన్ తీసుకొని దుపట్టా కాంట్రాస్ట్ కలర్ వాడతారు. ఇక్కడ పచ్చదనం మరింతగా హైలైట్ అవడానికి బ్లౌజ్, దుపట్టా రెండూ ఒకే రంగులో ఉన్నవి ఉపయోగించాను. ఇష్టమైన ఇకత్ ప్లెయిన్ ఇకత్ ఫ్యాబ్రిక్‌ను లెహంగాకు తీసుకున్నప్పుడు బార్డర్ లేకపోతే ఎలా అని ఆలోచిస్తారు. అందుకే, అంచుభాగాన్ని ఎంబ్రాయిడరీ చేసి, ఈ లెహెంగాను డిజైన్ చేశాను. అలాగే, బ్లౌజ్ ప్యాటర్న్ కూడా అదేరంగు ఇకత్తో డిజైన్ చేసి, కాంట్రాస్ట్ ఓణీని వాడాను. ఇది ఏ సంప్రదాయ వేడకకైనా అమ్మాయిలకు ఎవర్గ్రీన్ కాన్సెప్ట్ అవుతుంది- తరుణి సిరిగిరి, ఫ్యాషన్ డిజైనర్, హైదరాబాద్ భామకు గొల్లభామ తెలంగాణకే ప్రత్యేకమైన గొల్లభామ చేనేతకు అంతర్జాతీయంగానూ పేరుంది. కాటన్ మెటీరియల్ అనగానే పెదవి విరిచేవారికి కూడా సరైన ఎంపిక అవుతుంది. గొల్లభామ కాటన్ మెటీరియల్‌తో డిజైన్ చేసిన లెహెంగా, దీని మీదకు కలంకారీ దుపట్టాను ఉపయోగించాను. తక్కువ ఖర్చుతో హ్యాండ్లూమ్స్ని పార్టీవేర్‌గానూ ఉపయోగించవచ్చు అనడానికి ఇదో ఉదాహరణ. సింపుల్ అనిపించే ఫ్యాబ్రిక్స్‌ని కూడా భిన్నమైన లుక్ వచ్చేలా హైలైట్ చేసుకోవచ్చు. గ్రాండ్‌గా గద్వాల్ పట్టు వివాహ వేడుకల్లో అమ్మాయి అలంకరణ గ్రాండ్‌గా కనిపించాలంటే పట్టు లంగా ఓణీ సరైన ఎంపిక అవుతుంది. పెద్ద జరీ అంచు ఉన్న మెటీరియల్‌ను ఇందుకు ఎంచుకోవాలి. అలాగే ఓణీ కూడా జరీ బార్డర్‌తో ఉన్నది ఎంచుకుంటే కళగా కనిపిస్తారు. పెద్ద అంచు ఉన్న గద్వాల్ పట్టుతో డిజైన్ చేసిన లంగా ఓణీ కాంబినేషన్ ఇది. – ఎన్.ఆర్ -
సంప్రదాయ రంగులు... మోడ్రన్ హంగులు..!
పండగ షాపింగ్! పండగ రోజుల్లో మీకోసం మీరు సరైన దుస్తులను ఎంపిక చేసుకోవడమే కాదు..మీ అమ్మ, తోబుట్టువులు, స్నేహితులకు అద్భుతమైన కానుకలు ఇచ్చి వారిని ఆశ్చర్యపరుద్దాం అనుకుంటారు. మగవారు కూడా తమ భార్య, కూతురు, చెల్లెళ్ల కోసం షాపింగ్ చేసేస్తుంటారు. అయితే, పండగ రోజుల్లో షాపింగ్ అనగానే చాలా మంది సంప్రదాయ డిజైన్స్ వైపే మొగ్గు చూపుతారు. ఇందుకు చీరలు, అనార్కలీలు, సంప్రదాయ గౌన్లను ఎంపిక చేస్తుంటారు. ‘వీటిలోనే కొంత మోడ్రన్ టచ్ ఉన్నవి ఎంచుకుంటే మీ ఎంపిక అత్యుత్తమమని, అలాగే మీరు ధరించిన ఔట్ఫిట్స్ బెస్ట్ అని బోలెడు ప్రశంసలు కొట్టేయవచ్చు’ అంటున్నారు ఈ తరం డిజైనర్లు. మీ కోసం, మీ ఆత్మీయుల కోసం షాపింగ్ చేసే ముందు ఇవి గుర్తు పెట్టుకోండి... హ్యాపీ... హాఫ్‌శారీస్ పండగ కళను రెట్టింపు చేసేవి డిజైనర్ హాఫ్ శారీసే. మీ చుట్టూ వాతావరణాన్ని కలర్ఫుల్గా మార్చేయాలన్నా హాఫ్‌శారీస్ బెస్ట్ ఆప్షన్. అమ్మాయిలే కాదు అమ్మలు కూడా ఈ రోజుల్లో హాఫ్శారీస్ను ధరిస్తున్నారు కాబట్టి నిరభ్యంతరంగా వీటిని ఎంచుకోవచ్చు. బ్లౌజ్లకు మిర్రర్ వర్క్ ఉన్నవి ఎంచుకుంటే మరింత కాంతిమంతంగా కనిపిస్తారు. అత్యుత్తమమైన చీర చాలా స్టోర్స్‌లలో నేటి కాలానికి తగినట్టు భిన్నమైన అంచులు, ప్రింట్లతో ఆకట్టుకుంటున్నాయి. వీటిలో సంప్రదాయానికి ప్రాముఖ్యమిస్తూనే, ప్రింట్లు, అంచులలో కొంత ఆధునికత జోడించినవి ఎంచుకోండి. మీరు ఎంపిక చేసినవి మీకు మాత్రమే కాదు ఆ కానుక అందుకునేవారి కంటికీ నప్పాలి. సాధారణంగా పండగకు ఎరుపు, పచ్చ, పసుపు, నీలం... రంగులు అట్రాక్ట్ చేస్తాయి. వీటిలోనే అంచులు, ప్రింట్లు, మోటిఫ్స్.. ఈ కాలానికి తగినట్టుగా ఉండేవి ఎంపిక చేయండి. అలాగే, ఆ చీర కట్టుకునేవారు ఎంత ఆకర్షణీయంగా కనపడతారో ఊహించుకుని తీసుకుంటే మీ సెలక్షన్‌కి నూటికి 90 మార్కులు వచ్చేసినట్టే. అనార్కలీ సూట్ ఒకటి రెండూ కాదు అనార్కలీలో వందల డిజైన్లు వచ్చాయి. చిన్న చిన్న పట్టణాలలోని పేరున్న అన్ని బట్టల షాపులలోనూ ఎన్నో మోడల్స్ కనువిందు చేస్తున్నాయి. వీటిలో రంగులు, ప్రింట్లు కాంట్రాస్ట్ ఉండేలా చూసుకుంటూనే, ఎంబ్రాయిడరీవి సెలక్ట్ చేయండి. ముఖ్యంగా నెక్‌లైన్స్, స్లీవ్స్ దగ్గర వర్క్, కట్స్ బాగున్నవి ఎంచుకోండి. ఆధునిక కుర్తీలు ఎన్నో కట్స్, స్టైల్స్‌తో కుర్తీలు షాప్‌లలో బారులు తీరి ఉన్నాయి. టీనేజ్ అమ్మాయిలకు, మధ్య వయసు గలవారికి స్పోర్ట్స్ తరహా అంటే చాలా హుందాగా, సౌకర్యంగా అనిపించే కుర్తీలను ఎంపికచేస్తే వారి ఆత్మవిశ్వాసాన్ని ఇంకాస్త పెంచినట్టుగా ఉంటుంది. ఈ తరహావి ఎంపిక చేయడం రోజుల్లో చాలా సులువు. కొంత సంప్రదాయం మిక్స్ అవ్వాలంటే మాత్రం ఎంబ్రాయిడరీ, జరీ పనితనం ఉన్న కుర్తీలను ఎంచుకోవాలి. - ఎన్.ఆర్. ఈ పండగకి మీ వార్డ్రోబ్... సంప్రదాయాన్ని మిస్ అవకుండానే ఆధునికంగా కనిపించడానికి నేడు ఎన్నో దారులు ఉన్నాయి. ఆధునికం, సంప్రదాయం కలగలిసేలా మీ వార్డ్రోబ్ను మార్చేయండి. భారతీయ ఫ్యాబ్రిక్, డిజైన్స్ ఇప్పుడు ప్రపంచ ఫ్యాషన్‌గా మారిపోయాయి. గ్లోబల్ ట్రెండ్స్‌ను పరిశీలిస్తే మీకీ విషయం సులువుగా అర్థమైపోతుంది. స్టోర్స్ షో కేస్లు చూస్తే సంప్రదాయ గౌన్లకు మోడ్రన్ టచ్ ఇచ్చినవే అధికంగా కనిపిస్తాయి. జరీ, ఖరీదైన ఫ్యాబ్రిక్, రంగులను బట్టి ఎంపిక చేసుకుంటే సరి. అయితే, వీటిలోనే మోడ్రన్ ప్రింట్లు, మోటిఫ్స్ ఉన్నవి ఎంచుకుంటే పండగకు నప్పే విధంగానూ ఉంటాయి. ఆ తర్వాత రోజుల్లో సందర్భానుసారం ధరించడానికి అనువుగానూ ఉంటాయి. మేకప్‌లో రంగులు... మీ ఆత్మీయులకు మేకప్ కిట్ ప్రెజెంట్ చేయాలనుకుంటే.. పింక్, ఆకుపచ్చ, నిమ్మ, నీలం, ఎరుపు, పీచ్ కలర్స్ లేతవి ఎంచుకోవాలి. లేత వంగపండు, పింక్ షేడ్స్‌తో ఎన్నో ప్రయోగాలు చేయవచ్చు. అలంకరణ * రోజులా కాకుండా హెయిర్‌స్టైల్‌ని మార్చేయండి. తల అంతా దువ్వి, కొప్పులా కట్టి, ఫఫ్ పెట్టేయండి. లేదంటే ఫిష్స్టైల్ ట్రై చేయండి. * ప్లెయిన్ శారీ కట్టుకున్నప్పటికీ ఎంబ్రాయిడరీ, అద్దం పనితనం ఉన్న బ్లౌజ్‌లను ఎంచుకోండి. అందంగా వెలిగిపోతారు. * పెద్ద అంచు చీరలు కట్టినప్పుడు స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లు ధరిస్తే అల్ట్రామోడ్రన్ అనిపిస్తారు. * దుస్తులు మంచి బ్రైట్ కలర్స్, డిఫరెంట్ షేడ్స్ ఉన్నవి ఎంచుకోండి. * వాటర్‌ఫ్రూఫ్ మేకప్ మేలైనది. * టెంపుల్ డిజైన్స్‌కి ఫస్ట్ ప్లేస్ ఇవ్వండి. చెవులకు పెద్ద పెద్ద బుట్టలు, మెడలో హారాలు, ... మిమ్మల్ని మరింత ఆకర్షణీయంగా మార్చేస్తాయి.