breaking news
guwahati iit
-
బంకమట్టి రేణువులతో కరోనా పరీక్ష
న్యూఢిల్లీ: కరోనా వైరస్ సోకిందో లేదో గుర్తించడానికి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)–గౌహతి పరిశోధకులు చౌకైన, తేలికైన విధానాన్ని అభివృద్ధి చేశారు. వైరస్ నిర్ధారణకు ఇదొక ప్రత్యామ్నాయం అవుతుందని చెబుతున్నారు. ఇందుకోసం వారు బంకమట్టి రేణువులు ఉపయోగించారు. కరోనా వైరస్ కలిగిన ఉప్పునీటి ద్రావకంలో ఈ రేణువులు వేగంగా మార్పులకు గురవుతున్నట్లు తేల్చారు. రేణువుల్లోని క్లే–ఎలక్ట్రోలైట్ సిస్టమ్ అవక్షేపణ రేటు మారుతున్నట్లు గుర్తించారు. ఈ మార్పులను బట్టి వైరస్ సోకిందో లేదో సులభంగా గుర్తుపట్టవచ్చని పేర్కొన్నారు. మార్పులేవీ లేకపోతే వైరస్ సోకనట్లే. బాధితుల నుంచి నమూనాలు సేకరించి, ఈ పరీక్ష నిర్వహిస్తే ఫలితంగా త్వరగా తేలిపోతుంది. సార్స్–కోవ్–2ను గుర్తించడానికి ప్రస్తుతం పాలిమెరేజ్ చైన్ రియాక్షన్(పీసీఆర్) టెస్టు చేస్తున్నారు. దీనికి చాలా సమయం పడుతోంది. అంతేకుండా భారీ యంత్ర పరికరాలు అవసరం. యాంటిజెన్ టెస్టు కూడా అందుబాటులో ఉన్నప్పటికీ ఈ పరీక్షలో కచ్చితత్వం తక్కువే. యాంటీబాడీ టెస్టింగ్‌కు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయని ఐఐటీ–గౌహతి ప్రొఫెసర్ టి.వి.భరత్ చెప్పారు. ప్రయోగశాలలు, నిపుణులు, వనరులు లేనిచోట ఇలాంటి పరీక్షలు చేయలేం కాబట్టి బంకమట్టి రేణువులతో వైరస్‌ను గుర్తించడం చక్కటి ప్రత్యామ్నాయం అవుతుందని పేర్కొన్నారు. దీంతో కచ్చితమైన ఫలితం లభిస్తుందని వెల్లడించారు. ఈ పరీక్ష కోసం పరిశోధకులు బెంటోనైట్ అనే బంకమట్టి ఉపయోగించారు. ఇందులో విశిష్టమైన రసాయన నిర్మాణం ఉంటుంది. కాలుష్య కారకాలు, భారీ లోహాలను సైతం సులభంగా పీల్చుకోగలదు. బంకమట్టి రేణువులు వైరస్‌లను గ్రహిస్తాయి. అందుకే వైరస్ల ఉనికిని గుర్తించడానికి బంకమట్టి ఉపయోగించే విధానాలు ఇప్పటికే అమల్లో ఉన్నాయి. -
ఐసిస్‌తో లింకులు.. గువాహటి ఐఐటీ విద్యార్థి అరెస్ట్
గువాహటి: అంతర్జాతీయ ఉగ్ర సంస్థ ఐసిస్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలపై గువాహటి–ఐఐటీకి చెందిన తౌసిఫ్ అలీ ఫరూకీ అనే విద్యారి్థని అస్సాం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీటెక్ బయోసైన్స్ నాలుగో సంవత్సరం చదువుకుంటున్న ఇతడిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నివారణ)చట్టం ఉపా కింద కేసు నమోదు చేశారు. విచారణ జరిపిన అనంతరం ఐసిస్‌తో సంబంధాలున్నట్లు పక్కా ఆధారాలు దొరకడంతో శనివారం అరెస్ట్ చేసినట్లు అస్సాం పోలీస్ టాస్‌్కఫోర్స్ ఐజీ పార్థసారధి మహంతా చెప్పారు. కోర్టు అతడిని 10 రోజుల పోలీసు కస్టడీకి అనుమతి ఇచ్చిందన్నారు. ఢిల్లీలోని బాట్లా ప్రాంతానికి చెందిన అతడు ఐసిస్‌లో చేరేందుకు వెళ్తుండగా కామ్రూప్ జిల్లా హజో వద్ద అదుపులోకి తీసుకున్నామన్నారు. మూడు రోజుల క్రితం బంగ్లాదేశ్ నుంచి వచి్చన ఐసిస్ భారత్ చీఫ్ హారిస్ ఫరూకీ, అతడి అనుచరుడు అనురాగ్ సింగ్ అలియాస్ రేహాన్‌లను ధుబ్రి జిల్లాలో అదుపులోకి తీసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ ఐజీ వివరించారు. అయితే, గువాహటి ఐఐటీకి చెందిన ఇద్దరు విద్యార్థులకు ఐసిస్‌తో సంబంధాలున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తనకు సమాచారం ఇచి్చనట్లు హోం శాఖ బాధ్యతలు కూడా చూసుకుంటున్న సీఎం హిమాంత బిశ్వ శర్మ చెప్పారు. ఇద్దరిలో ఒక్కరు మాత్రమే దొరికారని, తప్పించుకుపోయిన మరో విద్యార్థిని కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఉగ్రవాదం వైపు ప్రేరేపితులైన వీరి గురించి తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు సీఎం చెప్పారు. -
కరెంటు అక్కర్లేని ఏసీ.. నిమిషాల్లో కూల్ అయ్యే బెడ్ షీట్లు
సాక్షి, అమరావతి: మానవ విజ్ఞానం క్షణానికో సరికొత్త ఆవిష్కరణతో ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉంటోంది. ప్రస్తుతం విద్యుత్ యుగం నడుస్తోంది. మోటార్లు, స్కూటర్లు, ఏసీలు, మొబైళ్లు.. ఇలా ఒక్కటేమిటి ఎన్నో రకాల విద్యుత్‌తో పనిచేసే పరికరాలు మనుషులకు అందుబాటులో ఉన్నాయి. బొగ్గుతోనే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. అయితే ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ కాలుష్యంపై ఆందోళన మొదలై కర్బన ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఫలితంగా పునరుత్పాదక ఇంధన వనరులపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అయితే సౌర, పవన, జల విద్యుత్ ఉత్పత్తి కూడా ఖర్చుతో కూడుకున్నదే కావడంతో అసలు విద్యుత్ అవసరమే లేకుండా పనులు జరిగిపోతే ఎలా ఉంటుందనే ఆలోచన కొన్ని దేశాల్లో శాస్త్రవేత్తలను కొత్త ప్రయోగాలకు పురిగొల్పింది. దేశ, విదేశాల్లో వెలుగుచూస్తున్న అలాంటి సరికొత్త ఆవిష్కరణల్లో కొన్ని ఇవి. కూలింగ్ దుప్పట్లు మంచంపై వేసే దుప్పటి సరైనది కాకపోతే ఉక్కపోతకు గురికావాల్సి వస్తుంది. వెంటనే ఏసీ వేసుకోవాలనిపిస్తుంది. కానీ కరెంట్ లేకుండానే, ఏసీ వేయకుండానే మనల్ని అచ్చం ఏసీలా కూల్ చేసే బెడ్ షీట్లు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ బెడ్‌షీట్‌ను చాలా తక్కువ ధరకు ఆన్లైన్, ఆఫ్లైన్లలో కొనుగోలు చేయవచ్చు. దీని ధర దాదాపు రూ.1,500. కొన్ని ఆన్లైన్ ఈ కామర్స్ వెబ్‌సైట్స్‌లో రూ. 699కే లభిస్తోంది. ఇది జెల్ టెక్నాలజీ ద్వారా పని చేస్తుంది. దీనిని ఉపయోగించిన నిమిషాల్లోనే మనకు చల్లదనాన్ని అందిస్తుంది. మురికిగా అయితే, దానిని పొడి గుడ్డతో సులువుగా శుభ్రం చేయవచ్చు. ఏసీ లేకుండానే ఇల్లు కూల్ విద్యుత్ బిల్లులకు భయపడి ఏసీలకు దూరంగా ఉండే సామాన్యుల కోసం గువహటి ఐఐటీ శాస్త్రవేత్తలు ఒక మార్గాన్ని కనిపెట్టారు. రేడియేటివ్ కూలర్ పూతను అభివృద్ధి చేశారు. దీనిని ఇంటి పైకప్పులకు వేస్తే కరెంటు అవసరం లేకుండా ఇంటి మొత్తానికీ చల్లదనం అందిస్తుందని వారు చెబుతున్నారు. ఇలాంటి విధానాలను ‘పాసివ్ రేడియేటివ్ కూలింగ్’ అని పిలుస్తున్నారు. పరిసరాల్లోని వేడిని గ్రహించి దానిని పరారుణ రేడియోధార్మికత రూపంలో వాతావరణంలోకి విడుదల చేసే సాంకేతికత ఇందులో ఉంటుంది. ఈ రేడియేటివ్ కూలర్ పూత కారణంగా ఇంట్లో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గుతాయట. కరెంటు అక్కర్లేని ఏసీ ఎయిర్ కండిషనర్ (ఏసీ)ని ప్రస్తుతం నాలుగు గోడల మధ్య వినియోగిస్తున్నాం. బహిరంగ ప్రదేశాల్లో వినియోగించేందుకు టవర్ కూలర్లు ఉన్నప్పటికీ వాటికి చాలా విద్యుత్ అవసరం. ఆరుబయట విద్యుత్ అవసరం లేకుండా ఏసీ పెట్టుకుని పరిసరాలను చల్లగా మార్చవచ్చంటోంది ఇజ్రాయెల్‌కు చెందిన కెన్షో కంపెనీ. ఈ కంపెనీ లిక్విడ్ నైట్రోజన్ ఆధారంగా పనిచేసే ఏసీని అభివృద్ధి చేసింది. ఏసీలోని ప్రామాణిక ట్యాంకుల్లో ద్రవ నత్రజని –196 డిగ్రీల వద్ద ఫ్రీజ్ అయ్యి ఉంటుంది. ఇది గ్యాస్‌గా మారే క్రమంలో బలమైన ఒత్తిడిని కలగచేస్తుంది. ఆ ఒత్తిడితో ఈ ఏసీ పనిచేస్తుంది. దీంతో ఆ పరిసర ప్రాంతం పూర్తిగా చల్లబడుతుంది. ఈ ఏసీలకు ఇప్పటికే 40 దేశాల నుంచి ఆర్డర్లు వచ్చాయట. -
గువాహటి ఐఐటీలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య
గువాహటి: అసోంలోని గువాహటి ఐఐటీలో తెలుగు విద్యార్థి ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిని పరమేశ్వరరావుగా గుర్తించారు. వసతిగృహంలో ఉరేసుకుని అతడు ప్రాణాలు తీసుకున్నాడు. మృతుడు విశాఖ జిల్లా వాసిగా గుర్తించారు. పరమేశ్వరరావు బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. అతడు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియరాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గువాహటి మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయన్న నిస్పృహతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడని అనుమానిస్తున్నారు.