స్కూల్ బస్సు బోల్తా.. విద్యార్థులకు గాయాలు
స్కూల్ బస్సు బోల్తా పడి.. పదిమంది విద్యార్థులు గాయపడిన ఘటన ఖమ్మం జిల్లా చింతకానిలో జరిగింది. చింతకాని మండలం నాగులవంచ వద్ద స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న పది మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులకు సమీప ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గురైన బస్సు గ్లోబల్ స్కూల్ చెందినదిగా గుర్తించారు. ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.