breaking news
Girls beat up
-
బాలికలదే హవా
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో మరోసారి బాలికలే పైచేయి సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు. ఈసారి సీబీఎస్ఈ పదవతరగతి ఫలితాల్లో రికార్డు స్థాయిలో 91.46 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది ఫలితాలతో పోల్చుకుంటే ఈసారి ఉత్తీర్ణతా శాతం స్వల్పంగా పెరిగి, 0.36 శాతం మంది అధికంగా ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది 90 శాతంపైగా మార్కులు సాధించిన విద్యార్థులు 3 శాతం తగ్గగా, 95 శాతానికి పైగా మార్కులు సాధించిన వారు 1 శాతం తగ్గారు. (ఫలితాలు వచ్చిన రోజు ఇదీ పరిస్థితి!) సీబీఎస్ఈ బోర్డు ఎటువంటి మెరిట్ లిస్ట్‌ను ప్రకటించలేదు. మొత్తం 1.5 లక్షల మంది విద్యార్థులు కంపార్ట్మెంట్లో పాస య్యారు. మొత్తం మీద 1.84 లక్షల మంది విద్యార్థులు 90 శాతానికి పైగా మార్కులు సాధించగా, 41,000 మంది విద్యార్థులు 95 శాతానికి పైగా మార్కులు సాధించారు. గత సంవత్సరం 80.97 శాతం ఉండగా, ఈ సంవత్సరం ఉత్తీర్ణత 85.86 శాతంగా ఉంది. 99.23 శాతం ఉత్తీర్ణతతో కేంద్రీయ విద్యాలయాలు అగ్రస్థానంలో నిలవగా, 98.66 ఉత్తీర్ణతా శాతంతో జవహర్ నవోదయ విద్యాలయాలు తరువాత స్థానంలో నిలిచాయి. (సీబీఎస్ఈ ఫలితాలు.. సమానంగా కవలల మార్కులు) -
నడిరోడ్డులో అమ్మాయిలు చితక్కొట్టారు
భువనేశ్వర్: ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో అమ్మాయిలు ఈవ్‌టీజర్‌కు బడితెపూజ చేశారు. అమ్మాయిలు వెదురుకర్రలతో అతణ్ని చితకబాది, మోకాలిపై నుంచోపెట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. భువనేశ్వర్‌లోని ఉత్కల్ యూనివర్శిటీలో ఎంబీఏ చదువుతున్న విద్యార్థినిపై వినోద్ కుమార్ సాహూ అనే ఓ ప్రైవేట్ ట్యూటర్ అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. వాణి విహార్ వద్ద ఉన్న వర్శిటీ క్యాంపస్ వుమెన్స్ హాస్టల్‌కు ఆమె వెళ్తుండగా బస్ స్టాప్ వద్ద ఈ ఘటన జరిగింది. ఆ విద్యార్థిని స్నేహితులను పిలవగా వెంటనే అక్కడకు వచ్చారు. ఆమె స్నేహితులకు విషయం చెప్పింది. ఇది గమనించిన సాహు అక్కడ నుంచి జారుకున్నాడు. అయితే అమ్మాయిలు అతని కోసం గాలించి వీఎస్ఎస్ నగర్ గేట్ వద్ద పట్టుకున్నారు. రోడ్డుపై అతణ్ని చితకబాది పోలీసులకు అప్పగించారు.