breaking news
Gentle Man
-
20 ఏళ్లకే పెళ్లి, 15 రోజులకే వైధవ్యం, 30 ఏళ్లు మగాడిలా
జీవితాలు అందరివీ ఒక్కతీరుగా ఉండవు. ఈ అనంత కాల గమనంలో, ఈ రవ్వంత జీవన పయనంలో ఎవరి యుద్ధం వారిదే. పైకి కనిపించే నవ్వుల వెనుక ఎన్నో కనిపించని బడబాగ్నులుండవచ్చు మరెన్నో అంతులేని కష్టాలూ ఉండవచ్చు. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలోని ఒక చిన్న గ్రామానికి చెందిన ముత్తు మాస్టర్ స్టోరీ ఇలాంటిదే. కన్న కూతురి కోసం మూడు దశాబ్దాలు పాటు మగాడిలా బతికింది.పెచియమ్మాళ్ అలియస్ ముత్తు ఎంతోమంది సగటు అమ్మాయిల్లాగానే జీవితాన్నిప్రారంభించింది. కోటి ఆశలతో 20 ఏళ్ల వయసులో వివాహబంధంలోకి అడుగుపెట్టింది. దురదృష్టం ఏమిటంటే.. కాళ్ల పారాణి ఆరకముందే పెళ్లైన 15 రోజులకే భర్త అనూహ్యంగా కన్నుమూశాడు. ఆ తరువాత కొన్ని రోజులకే తాను గర్బవతినని తెలుసుకుంది. ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది.ఇక్కడే పెచియమ్మాళ్ చాలా విభిన్నంగా ఆలోచించింది. ఏపనిచేసినా ఆమెకు లైంగిక వేధింపులుతప్పలేదు. సమాజం సూటి పోటి మాటలూ భరించాల్సి వచ్చేది. అందుకే సంచలన నిర్ణయం తీసుకుంది. తన గుర్తింపును మార్చుకుంది. మగాడిలా మారి పోయింది. జుట్టును చిన్నగా కత్తిరించుకోవడం, ప్యాంట్ చొక్కా వేసుకుంది. ముత్తు కుమార్ అనే పేరుతో అనేక సవాళ్ల మధ్య కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టింది.ఇదీ చదవండి: స్టార్ సింగర్ రిటైర్మెంట్ వెనుక రహస్యం ఇదేనట!చెన్నై,తూత్తుకుడిలోని హోటళ్ళు, రోడ్డు పక్కన షాపులల్లో అవిశ్రాంతంగా పనిచేసింది. పెయింటర్‌గా, కూలీగా, టీ మేకర్‌గా పని చేస్తూ ఎంతో కష్టపడింది ఇవన్నీ స్త్రీగా తన ఉనికి రహస్యాన్నిజాగ్రత్తగా కాపాడుకుంటూ, పురుషుల్లో పురుషుడిలా కలిసి పోయి బాత్రూంకు వెళ్లాల్సి వచ్చినా మగాళ్ల బాత్రూంనే వాడుతూ, బస్సులలో సైతం వారి పక్కనే కూర్చుంటూ కాలం నెట్టుకొచ్చింది.ఆమె మహిళ అని ఆమెకు ఒక పాప ఉందని కొంతమంది సమీప బంధువులకు మాత్రమే నిజం తెలుసు. బయట పడిపోతాననే భయం నిరంతరం ఉండేది, కానీ ఆమె కూతురు షణ్ముగసుందరి భవిష్యత్తు కోసం దాన్ని భరించే శక్తిని కూడగట్టుకుంది. పరోటా షాపుల్లో పనిచేస్తూ ‘‘ముత్తు మాస్టర్’’గా పాపులర్ అయింది. ఆధార్, ఓటర్ కార్డు, బ్యాంక్ ఖాతాలో కూడా అదే పేరు పెట్టుకుంది. ఒంటరిగా మహిళగా, దయా దాక్షిణ్యంలేని సమాజంలో ప్రతి పైసా బిడ్డ కోసం ఆదా చేశానని చెప్పుకొచ్చిందామె. చివరికి ఆమె కలలు, ఆమె త్యాగాలు ఫలించాయి. ఆమె కుమార్తె పెరిగి పెద్దదై, విద్యను అభ్యసించి,వివాహం చేసుకుంది. అలా ముత్తు లక్ష్యం నెరవేరింది. పెచ్చియమ్మాళ్గా మళ్లీ మహిళగా జీవిస్తారా అని అడిగినప్పుడు, ఆమె సమాధానం విన్నవారు ఆశ్చర్య పోయారు ముత్తు మాస్టర్‌గానే ఉండాలని నిర్ణయించుకుంది. అవసరం నుండి పుట్టిన ఈ గుర్తింపు, ఆమె పట్టుదలకు , విజయానికి ప్రతీకగా మారింది. ఇది తన కుమార్తె భద్రతను, తనకు గౌరవాన్నిచ్చిన గుర్తంపుతోనే తన చివరి శ్వాస వరకు ఉంటానని చెప్పింది. -
22న నాని కొత్త సినిమా పాటలు
హైదరాబాద్: నాని హీరోనా... విలనా...? అంటూ ట్యాగ్ లైన్ తో ప్రేక్షకుల ముందుకు త్వరలోనే రానున్న నేచురల్ స్టార్ నాని జెంటిల్ మన్ చిత్రం పాటలు త్వరలో విడుదల కానున్నాయి. మే 22న ఆడియోను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. అయితే ఈ జెంటిల్మన్ పాత్ర ఎలా ఉంటుందనేది సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే. శ్రీదేవి మూవీస్ పతాకంపై నాని, సురభి, నివేదా థామస్ ముఖ్యతారలుగా శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ నెల 12న టీజర్‌ను, 22న పాటలను విడుదల చేయనున్నాం. అందమైన రొమాంటిక్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం' అని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి కథ డేవిడ్ నాథన్ అందించగా సంగీతం: మణిశర్మ, కెమెరా మ్యాన్ గా పీజీ విందా పనిచేశారు. -
‘బ్రెండన్’ బాదుడుకు బ్రేక్!
►ఆఖరి సిరీస్ ఆడనున్న మెకల్లమ్ ►కెరీర్లో 100వ టెస్టుకు రెడీ ►వరుసగా వంద మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్ ‘క్రికెట్ చరిత్రలో గొప్ప ఆటగాళ్ల జాబితాలో నేను ఉండకపోవచ్చు. అయితే నా దేశం తరఫున ఎంతో కొంత సాధించిన, ఎందరికో స్ఫూర్తినిచ్చినవారిగా అందరికీ గుర్తుండిపోతాను. బ్యాటింగ్‌లో నా శైలితో నాదైన ముద్ర చూపించాననే నమ్ముతున్నా’...ఆఖరి సిరీస్‌కు ముందు తన గురించి బ్రెండన్ మెకల్లమ్ చెప్పుకున్న మాట ఇది. నిజమే... క్రికెట్‌పై ‘బాజ్’ సంతకం మరచిపోలేనిది. అతని సునామీ ఇన్నింగ్స్ ప్రత్యర్థుల గుండెల్లో కల్లోలం రేపాయి. వన్డేల్లో దూకుడు, టి20ల్లో విధ్వంసం కామన్ కావచ్చు... కానీ టెస్టుల్లోనూ ఆ బ్యాట్ పదునేంటో భారత జట్టుకే అందరికంటే బాగా తెలుసు. నాలుగు డబుల్ సెంచరీలు చేస్తే అందులో మూడు భారత్‌పైనే వచ్చాయి. దాదాపు రెండేళ్ల క్రితం ధోని సేన గెలవాల్సిన మ్యాచ్‌ను అద్భుతమైన ట్రిపుల్ సెంచరీతో (302) రక్షించుకున్న ఇన్నింగ్స్ అజరామరం. గత సోమవారం వన్డేలకు విజయంతో గుడ్‌బై చెప్పిన మెకల్లమ్ ఇప్పుడు ఆఖరిసారిగా టెస్టు సిరీస్ బరిలోకి దిగుతున్నాడు. ఆస్ట్రేలియాతో శుక్రవారంనుంచి ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్ అతని అంతర్జాతీయ కెరీర్లో ఆఖరిది. వెల్లింగ్టన్లో నేటినుంచి జరిగే తొలి టెస్టు మెకల్లమ్ కెరీర్లో 100వది కావడం విశేషం. అరంగేట్రం చేసిననాటినుంచి విరామం లేకుండా వరుసగా వంద టెస్టులు ఆడిన తొలి క్రికెటర్‌గా బ్రెండన్ మరో ఘనతను తన పేరిట లిఖిస్తున్నాడు. గ్రేట్ జెంటిల్మన్... విధ్వంసకర బ్యాట్స్‌మన్‌గా మెకల్లమ్‌కు కొత్తగా పరిచయం అవసరం లేదు. 155 కిలోమీటర్ల వేగంతో వచ్చిన బంతులను కూడా స్కూప్ షాట్ ఆడుతూ 50 బంతుల్లో చేసిన టి20 సెంచరీనుంచి... టెస్టుల్లో పాకిస్తాన్‌పై మెరుపు వేగంతో డబుల్ సెంచరీ చేయడం వరకు అతని దూకుడుకు ఉదాహరణలు ఎన్నో. ఇక వన్డేల్లో మెరుపు ఆరంభాలతో మ్యాచ్ దిశ మార్చిన ఇన్నింగ్స్‌కు లెక్కే లేదు. కానీ ఇదంతా ఆటలోనే. ప్రత్యర్థిని ఒక్క మాట అన్నదీ లేదు. ఆవేశంతో నోరు జారినదీ లేదు! అసలు సిసలైన జెంటిల్మన్లా వ్యవహరించిన అతను కెప్టెన్‌గా అదే తన జట్టుకు నేర్పాడు. మెకల్లమ్ సారథ్యంలో కొత్త బ్రాండింగ్‌తో కనిపించిన కివీస్ తమ దేశ చరిత్రలో గతంలో సాధ్యం కాని వరుస విజయాలు అందుకుంది. వన్డే వరల్డ్ కప్‌లో తొలిసారి ఫైనల్ చేరడమే కాకుండా సొంతగడ్డపై వరుసగా 13 టెస్టుల పాటు పరాజయమన్నదే లేకుండా కొనసాగుతోంది. ఐపీఎల్లో అతని బ్యాటింగ్ చూసే అవకాశాలు ఉన్నా...అంతర్జాతీయ క్రికెట్‌కు సంబంధించి మరో రెండు మ్యాచ్‌లే మెకలమ్ మెరుపులకు వేదికగా నిలవనున్నాయి. గత 15-20 టెస్టులు నా జీవితంలో గొప్పగా సాగాయి. ప్రతిభ గల కొంతమందితో కలిసి అద్భుతాలు చేయగలిగాం. నేను సాధించినదాని పట్ల గర్వంగా ఉన్నా. గాయాలను అధిగమించి వరుసగా 100 టెస్టులు ఆడటం నిజంగా మధురానుభూతి. భారత్‌పై చేసిన ట్రిపుల్ సెంచరీతోనే మా జట్టు పోరాటపటిమ ప్రపంచానికి తెలిసింది. కాబట్టి అదే నా అత్యుత్తమం. వెనక్కి తిరిగి చూసుకుంటే నేను పడిన కఠోర శ్రమ, ఆ తర్వాతి విజయాలు గుర్తుకొచ్చాయి. నా జీవితానికి ఈ జ్ఞాపకాలు చాలు’ -బ్రెండన్ మెకల్లమ్


