breaking news
Gautam Gambhi
-
రోహిత్ శర్మకు మరో బిగ్ షాక్.. కొత్త వన్డే కెప్టెన్ ఎవరంటే?
-
‘నిరూపిస్తే.. బహిరంగంగా ఉరేసుకుంటాను’
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఆప్, బీజేపీ పార్టీల మధ్య ప్రారంభమైన పాంప్లెట్ల వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. ఆతిషి, గంభీర్ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. పాంప్లెట్ల విషయంలో ఆప్ కావాలనే తన మీద అసత్య ఆరోపణలు చేస్తుందంటున్న గంభీర్.. కోర్టు ద్వారానే తేల్చుకుంటానని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ వివాదంపై గంభీర్ మరోసారి స్పందించారు. ఈ పాంప్లెట్ల వ్యవహారంలో తన పాత్ర ఉందని నిరూపిస్తే.. బహిరంగంగా తనను తాను ఉరి తీసుకుంటానని పేర్కొన్నారు గంభీర్. ఒక వేళ అసత్యమని తేలీతే.. రాజకీయాల నుంచి తప్పుకోవాలి. ఇది మీకు సమ్మతమేనా కేజ్రీవాల్ అంటూ ట్విటర్ వేదికగా సవాల్ చేశారు గంభీర్. అంతేకాక తన మీద ఆప్ చేస్తోన్న ఆరోపణలు ఆధారాలు చూపించాలని.. లేదంటే పరువు నష్టం దావా వేస్తానని గంభీర్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. Challenger Number 3 to @ArvindKejriwal and @aap. If he can prove that I have anything to do with this pamphlet filth, then I will hang myself in public. Otherwise @ArvindKejriwal should quit politics. Accepted? — Chowkidar Gautam Gambhir (@GautamGambhir) May 10, 2019 ఈ వివాదంపై ఆతిషి స్పందిస్తూ.. ఆత్మాభిమానం కల మహిళ ఎవరైనా తన గురించి తానే నీచంగా ప్రచారం చేసుకోగలదా అని ప్రశ్నించారు. బీజేపీ కావాలనే తన మర్యాదకు భంగం కల్గించడం కోసం ఇలాంటి నీచ ప్రచరాన్ని ప్రారంభించిందని మండిపడ్డారు. మహిళలు రాజకీయాల్లోకి రాకపోవడానికి ఇలాంటి నాయకులే ప్రధాన కారణమన్నారు. -
విరాట్ కోహ్లిపై ఫ్యాన్స్ ఆగ్రహం!
స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగే మూడు టెస్టుల సిరీస్ కోసం బీసీసీఐ సోమవారం ప్రకటించిన భారత క్రికెట్ జట్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దగా మార్పులేవీ చేయకుండా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన ఆటగాళ్లను యథాతథంగా కొనసాగిస్తూ జట్టును ప్రకటించింది బీసీసీఐ సెలక్షన్ కమిటీ. వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ, బౌలర్ షార్దుల్ ఠాకూర్‌పై మాత్రం వేటు వేసింది. అయితే, ఈ మధ్యకాలంలో వరుసగా విఫలమవుతున్న రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లను జట్టులో కొనసాగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సీనియర్ ఆటగాడు గౌతం గంభీర్‌ను పక్కనబెట్టి మరీ ఈ ఇద్దరిని జట్టులోకి తీసుకోవడం మాజీ క్రికెటర్లను విస్మయ పరిచింది. ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీలో మంచి ఫామ్‌ను ప్రదర్శిస్తున్న గంభీర్‌కు అవకాశం కల్పించకపోవడం సహజంగానే టీమిండియా అభిమానుల్ని నిరాశ పరిచింది. తనకు ఇష్టులైన రోహిత్, ధావన్‌లకు చాన్స్ ఇచ్చేందుకే విరాట్ కోహ్లి సీనియర్ ఆటగాళ్లను పట్టించుకోవడం లేదని పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గొప్ప ఆటగాడైన కోహ్లి వ్యక్తిగత ఈర్ష్యద్వేషాలను పక్కనబెట్టాలని, సొంతగడ్డపై జరుగుతున్న న్యూజిలాండ్ సిరీస్‌లో టీమిండియా రాణించాలంటే ధావన్ కన్నా గంభీర్‌ను తీసుకోవడం మంచిదని పలువురు సూచించారు. మరోవైపు తాజాగా ప్రకటించిన జట్టులో తనకు చోటు కల్పించకపోవడంపై గౌతం గంభీర్ కూడా బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను లక్ష్యంగా చేసుకొని కార్నర్ చేసినా.. తాను పిరికివాడిని కాదని, పోరాడుతానని గంభీర్ స్పష్టం చేశాడు. జట్టులో చోటు లభించనంతమాత్రాన తాను ఓడిపోయినట్టు కాదని చెప్పుకొచ్చారు. దీంతో గంభీర్ మద్దతుగా అభిమానులు కోహ్లిపై మండిపడుతూ పెద్ద ఎత్తున ట్వీట్లు చేస్తున్నారు. @GautamGambhir i am disappointed with @imVkohli for not selecting u — Avi Chopra (@AviMSD07) September 13, 2016