breaking news
Future of India
-
ఇంటర్నెట్ నుంచి ఇంటెలిజెన్స్ యుగానికి
న్యూఢిల్లీ: భారత టెక్నాలజీ భవిష్యత్తును పూర్తిగా మార్చేలా కృత్రిమ మేధస్సు (ఏఐ) పై దేశీ కార్పొరేట్ దిగ్గజాలు భారీ దృష్టి సారించాయి. భారత్ ‘ఇంటెలిజెన్స్ ఎరా’లోకి అడుగుపెట్టాల్సిందేనని స్పష్టం చేస్తూ, దేశీయ ఏఐ మౌలిక సదుపాయాల నిర్మాణం, డేటా సార్వ¿ౌమత్వం, హైపర్ ప్రోగ్రెస్ దిశగా ముందుకెళ్లాలని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, గ్లోబల్ టెక్ నేతలు పిలుపునిచ్చారు. డేటా విప్లవం తర్వాత ఇప్పుడు ఏఐ విప్లవం దిశగా భారత్ దూసుకెళ్తోందని, స్వదేశీ మౌలిక వసతులు, చౌక డేటా వినియోగంతో ‘ఇంటెలిజెన్స్ సెంచరీ’లో గ్లోబల్ లీడర్‌గా ఎదగాలనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రిలయన్స్ అధినేత అంబానీ, అదానీ గ్రూప్ ఈడీ జీత్ అదానీ, గూుగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఏఐ సదస్సులో తెలిపారు. మొబైల్, ఇంటర్నెట్ తరహాలోనే కృత్రిమ మేధను (ఏఐ) చౌకగా అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు వచ్చే ఏడేళ్లలో రూ. 10 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముకేశ్ అంబానీ వెల్లడించారు. ప్రతి పౌరుడు, వ్యాపారం, ప్రభుత్వ సరీ్వసులను ఏఐతో అనుసంధానం చేస్తామని ఆయన చెప్పారు. జామ్‌నగర్‌లో గిగావాట్ స్థాయి ఏఐ–రెడీ డేటా సెంటర్ల ఏర్పాటు, 10 గిగావాట్ల వరకు హరిత విద్యుదుత్పత్తి, అతి తక్కువ లేటెన్సీతో దేశవ్యాప్తంగా ఏఐని అందించేలా ఎడ్జ్–కంప్యూట్ వ్యవస్థను నెలకొల్పేందుకు జియో ఇంటెలిజెన్స్ ఈ మొత్తాన్ని వెచి్చంచనున్నట్లు వివరించారు. డీప్‌టెక్, తయారీ, అసంఘటిత రంగం కోసం ఏఐని అందుబాటులోకి తేవడం, ప్రపంచ స్థాయి బహుభాషా ఏఐని రూపొందించడం, అత్యధిక నైపుణ్యాలు అవసరమయ్యే ఉద్యోగాలను కల్పించడంలాంటి అయిదు మార్గదర్శక సూత్రాల ఆధారంగా జియో ఇంటెలిజెన్స్ పని చేస్తుందని చెప్పారు. ‘‘భారత్‌ను జియో ఇంటర్నెట్ యుగానికి అనుసంధానం చేసింది. ఇప్పుడు ఇంటెలిజెన్స్ యుగానికి అనుసంధానం చేస్తుంది. జియో, రిలయన్స్ కలిసి వచ్చే ఏడేళ్లలో రూ. 10 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తాయి. ఇవేవో స్పెక్యులేటివ్ లేదా వేల్యుయేషన్లపరమైన పెట్టుబడులు కావు. రాబోయే అనేక దశాబ్దాల పాటు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుస్తాయి. దేశం ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకుని నిలబడగలిగే సత్తాను సాధించేందుకు దోహదపడతాయి. డేటా తరహాలోనే ఏఐ ఖర్చుని కూడా మేము గణనీయంగా తగ్గిస్తాం. అద్దె మేధస్సుతో భారత్ ముందుకెళ్లలేదు’’ అని అంబానీ స్పష్టం చేశారు. ఏఐ వ్యూహానికి 3 కీలకాంశాలు: జీత్ అదానీ భారతదేశపు సార్వభౌమత్వాన్ని ఏఐ సరికొత్త నిర్వచనం ఇస్తుందని అదానీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జీత్ అదానీ చెప్పారు. దేశ కృత్రిమ మేథ వ్యూహానికి విద్యుత్, కంప్యూట్–క్లౌడ్, సర్వీసులనే మూడు అంశాలు ప్రదానంగా ఉంటాయన్నారు. ‘‘ఏఐని కోడింగ్ చేస్తారు. కానీ అది పని చేయాలంటే విద్యుత్ భద్రత సాధించడం అవసరం. ఈ విషయంలో పర్యావరణహితమైన విద్యుత్ కీలకంగా ఉంటుంది. క్రిటికల్ ఏఐ వర్క్‌లోడ్‌లను భారత్ స్వదేశంలోనే హోస్ట్ చేయాలి. స్టార్టప్‌లు, విద్యా, రక్షణ, ఆరోగ్య సంరక్షణ, తయారీ రంగాలకు అత్యుత్తమ కంప్యూట్ సామర్థ్యాలు అందుబాటులో ఉండాలి. ఏఐ అనేది ముందుగా దేశ ప్రజలకు సేవలందించేందుకు ఉపయోగపడాలి’’ అని ఆయన పేర్కొన్నారు. హరిత విద్యుత్ ఆధారిత ఏఐ ప్లాట్‌ఫాం ఏర్పాటునకు అదానీ గ్రూప్ 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు కట్టుబడి ఉందన్నారు. ‘‘ప్రస్తుతం ఇంటెలిజెన్స్ శతాబ్దంలో భారత్ కూడా పాలు పంచుకుంటుందా లేదా అనేది ప్రశ్న కాదు. ఏఐ సెంచరీలో మౌలిక సదుపాయాలు, మేథస్సు, ప్రమాణాలు, విలు వలపై ఎంత వరకు తన ముద్ర వేస్తుందనేదే ప్రశ్న. కానీ నిస్సందేహంగా భారత్ దీన్ని సాధించగలదు’’ అని చెప్పారు. హైపర్ పురోగతి శకం: గూగుల్ సుందర్ హైపర్ పురోగతి శకానికి కృత్రిమ మేథ నాంది పలికిందని అమెరికన్ టెక్ దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చెప్పారు. వర్ధమాన దేశాలు నిదానంగా ఉండే సంప్రదాయ వృద్ధి బాటలో కాకుండా ఎకాయెకిన వేగంగా పైకి ఎదిగేందుకు ఏఐ ఉపయోగపడుతుందని తెలిపారు. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం మొదలైన విభాగాల్లో ఏఐ వినియోగం పెరుగుతోందన్నారు. ‘‘ఏఐ వల్ల ఉద్యోగ విధుల్లో నిస్సందేహంగా గణనీయ మార్పులు వస్తాయి. కొన్ని ఆటోమేట్ అవుతాయి. మరికొన్ని ఉద్యోగాల స్వరూపం మారుతుంది. పూర్తిగా సరికొత్త కెరియర్లు వస్తాయి. ఈ నేపథ్యంలోనే ఏఐ ఆధారిత మార్పులను అందిపుచ్చుకునేలా వర్కర్ల కోసం గూగుల్ ఏఐ ప్రొఫెషనల్ సరి్టఫికెట్‌ని ప్రవేశపెట్టాం. 10 కోట్ల మందికి డిజిటల్ నైపుణ్యాల్లో శిక్షణనిచ్చాం’’ అని సుందర్ చెప్పారు. -
20 ఏళ్లలో భారత్ ఆర్థిక వ్యవస్థ...10 ట్రిలియన్ డాలర్లకు!
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థకు వచ్చే 20 ఏళ్లలో అద్వితీయమైన ప్రగతిని సాధించే సత్తా ఉందని ప్రైస్‌వాటర్ హౌస్ కూపర్స్(పీడబ్ల్యూసీ) పేర్కొంది. సోమవారమిక్కడ ఈ సంస్థ విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం.. 2034 నాటికి దేశీ ఆర్థిక వ్యవస్థ 10 ట్రిలియన్ డాలర్లకు(దాదాపు రూ.620 లక్షల కోట్లు) ఎగబాకనుంది. అంతేకాదు మళ్లీ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు కూడా వార్షికంగా 9 శాతాన్ని అందుకోనుందని నివేదిక వెల్లడించింది. పారిశ్రామిక రంగం కృషి, ప్రభుత్వం పోషించబోయే నిర్మాణాత్మక పాత్ర ఈ ప్రగతికి కీలకంగా నిలవనున్నాయని పేర్కొంది. ‘భవిష్యత్తు భారత్-విజయ ప్రస్థానం’ పేరుతో విడుదల చేసిన ఈ నివేదికలో పీడబ్ల్యూసీ ఇంకా పలు అంశాలను ప్రస్తావించింది. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం 2 ట్రిలియన్ డాలర్లకు(దాదాపు రూ.124 లక్షల కోట్లు) చేరువలో ఉంది. ‘భారత్ ఇప్పుడు అత్యంత ప్రధానమైన మార్పు అంచున నిలబడింది. మళ్లీ 9 శాతం వృద్ధి, 10 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా అవతరించాలంటే... కార్పొరేట్ ఇండియా మద్దతు, కృషి చాలా అవసరం. అదేవిధంగా ప్రభుత్వంతో నిర్మాణాత్మక భాగస్వామ్యం కూడా కీలకమే’ అని పీడబ్ల్యూసీ పేర్కొంది. కాగా, ఈ 10 ట్రిలియన్ డాలర్లలో 40 శాతం వాటా కొత్త సొల్యూషన్ల(వ్యాపారాలు, ఆలోచనలు) నుంచే సాకారం కానుందని కూడా నివేదిక తెలిపింది. ‘వచ్చే 12-18 నెలల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోనుంది. అయితే, భారత్‌లో మాత్రం మంచి వృద్ధి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రభుత్వం, ప్రైవేటు రంగం మధ్య సరైన భాగస్వామ్యం, సమన్వయంతో ఆర్థిక వృద్ధి రేటు ప్రస్తుతం అంచనా వేస్తున్న 5 శాతం కంటే చాలా అధిక స్థాయిలోనే సాధించే సత్తా భారత్‌కు ఉంది’ అని నివేదిక విడుదల సందర్భంగా పీడబ్ల్యూసీ ఇంటర్నేషనల్ చైర్మన్ డెన్నిస్ నాలీ వ్యాఖ్యానించారు. ఆర్థిక అభివృద్ధి ఫలాలను 125 కోట్లకుపైగా ఉన్న జనాభా అంతటికీ పంచడం ద్వారానే సరైన ప్రగతికి ఆస్కారం ఉంటుందని నాలీ అభిప్రాయపడ్డారు. స్వల్పకాలానికి చూస్తే జీడీపీ వృద్ధి రేటు 5.5-6 శాతం మేర ఉండొచ్చని అంచనా వేశారు. అయితే, తమ పీడబ్ల్యూసీ నివేదికలో పేర్కొన్న విధంగా కార్యచరణ ఉంటే కచ్చితంగా 9 శాతం వృద్ధి రేటు సాకారమవుతుందన్నారు. నివేదికలో ఇతర ముఖ్యాంశాలివీ... కీలకమైన విద్య, హెల్త్‌కేర్, వ్యవసాయం, రిటైల్, విద్యుత్, తయారీ, ఆర్థిక సేవలు, పట్టణీకరణ వంటి రంగాలతోపాటు డిజిటల్, ఫిజికల్ అనుసంధానానికి సంబంధించి ప్రాజెక్టుల సాకారానికి అనేక సవాళ్లు పొంచిఉన్నాయి. భారీ స్థాయిలో మానవ వనరులను(ఉద్యోగాలు) కల్పించడంతో పాటు వచ్చే రెండు దశాబ్దాల్లో మానవ వనరుల అభివృద్ధి సూచీ(హెచ్‌డీఐ)లో విప్లవాత్మక పురోగతి అవసరం. సగానికిపైగా యువ జనాభా, డిజిటల్ పరిజ్ఞానాలను వినియోగిస్తున్న మధ్యతరగతి ప్రజల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం... భారత్ ఆర్థికంగా, సామాజికంగా ప్రగతి సాధించేందుకు జీవితకాలంలో ఒక్కసారి వచ్చే అద్భుత అవకాశం. రానున్న దశాబ్దాల్లో పెరగనున్న జనాభా, మెరుగైన జీవన ప్రమాణాల కోసం ప్రతి ఏటా 1-1.2 కోట్ల ఉద్యోగాలను కల్పించాల్సి ఉంటుంది. తాజాగా సార్వత్రిక ఎన్నికల్లో వెల్లడైన ఫలితాలు(సుస్థిర ప్రభుత్వానికి మద్దతు) ఆర్థికాభివృద్ధిపై ప్రజలకున్న ఆకాంక్ష, సమాజంలో అందరికీ వృద్ధి ఫలాలు దక్కాలన్న దృఢమైన కోరికకు సంకేతం. 9 శాతం జీడీపీ వృద్ధి రేటు ద్వారా తలసరి ఆదాయం ఇప్పుడున్న దాదాపు 1,500 డాలర్ల(సుమారు రూ.93 వేలు) నుంచి 7,000 డాలర్ల(సుమారు రూ.4.3 లక్షలు) స్థాయికి ఎగబాకవచ్చు. కేవలం సంస్థలు, కంపెనీల కృషితోనే భారత వృద్ధి పుంజుకోవడం సాధ్యం కాదని.. ఇందుకు నవకల్పనలు(ఇన్నోవేషన్) చాలా కీలకమని పీడబ్ల్యూసీ ఇండియా చైర్మన్ దీపక్ కపూర్ పేర్కొన్నారు. కార్పొరేట్లు ప్రధాన పాత్ర పోషించాలన్నారు.


