breaking news
future course of action
-
రేపటిని సొంతం చేసుకోవడానికి...
‘విద్య సమాజ భవిష్యత్తుకు పాస్‌పోర్ట్ లాంటిది. రేపు అనేది, ఈ రోజే దానికోసం సిద్ధపడే వాళ్లకే సొంతం’ అంటాడు అమెరికన్ పౌర హక్కుల ఉద్యమకారుడు మాల్కం ఎక్స్. ప్రపంచంలో మున్ముందు సంభవించగల సాంకేతిక మార్పులకు, ఉద్యోగ మార్కెట్ అవలంబించే కొత్త రిక్రూట్మెంట్ విధానాలకు అనుగుణంగా విద్యా నిపుణులు రూపొందించిన ‘ఫ్యూచర్ రెడీ కోర్సులు’ విద్యార్థులను రేపటిని సొంతం చేసుకోవడానికి సిద్ధం చేస్తాయి.మెరుగైన ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునేందుకు డేటా సైన్స్, కృత్రిమ మేధ (ఏఐ), సైబర్ సెక్యూరిటీ వంటి ఫ్యూచర్ రెడీ కోర్సులు విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనూ అందుబాటులో ఉండటం గమనించాల్సిన సంగతి. ‘ఇరవై ఒకటో శతాబ్దంలో నిరక్షరాస్యులు అంటే చదవడం, రాయడం రానివారు కాదు; నేర్చుకోవడం, నేర్చు కున్నదాన్ని వదిలేయడం, మళ్లీ కొత్తగా నేర్చుకోవడం తెలియని వారే’ అంటాడు అమెరికన్ రచయిత, ఫ్యూచరిస్ట్ ఆల్విన్ టాఫ్లర్. ప్రస్తుతం డేటా సైన్స్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ ఇత్యాది కోర్సులు, టాఫ్లర్ చెప్పినట్టుగా విద్యార్థుల వ్యక్తిగత ప్రతిభకు తగిన గుర్తింపునూ, సరిపడా ఆదాయాన్నీ తెచ్చిపెడతాయి. అందుకే ఈ కోర్సు లకే యువకులు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తున్నారు. మునుపటితో పోల్చితే పూర్తి అధునాతనమైన ఈ కోర్సుల్లో ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత. కోట్ల కొద్దీ ఉన్న పాత సమాచారాన్ని అర్థంచేసుకొని, భవిష్యత్తులో ఏం జరగబోతుందో ముందే ఊహించే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. మనం యూట్యూబ్ లేదా నెట్‌ఫ్లిక్స్‌లో ఒక వీడియో చూడగానే ‘మీకు ఇది కూడా నచ్చుతుంది’ అంటూ కింద కొన్ని ఆప్షన్స్ వస్తుంటాయి. ఇది డేటా సైన్స్ మహిమే. మనుషుల్లాగే సొంతంగా ఆలోచించి నిర్ణ యాలు తీసుకునే తెలివితేటలు యంత్రాలకు వచ్చేశాయి. డ్రైవర్ లేకుండా దానంతటదే రోడ్లపై నడిచే ‘టెస్లా’ కార్లు, మనతో మనిషిలా మాట్లాడే ‘చాట్‌జీపీటీ’... కంప్యూటర్లకు కళ్ళు, చెవులు, మెదడు వచ్చేశాయి. ఇది ఏఐ పుణ్యమే!మారిన మార్కెట్ స్వరూపం మన డబ్బును, వ్యక్తిగత సమాచారాన్ని రక్షించే ఒక అదృశ్య సైన్యం మనకు అందుబాటులో ఉంది. మన బ్యాంక్ అకౌంట్ హ్యాక్ కాకుండా వచ్చే ఓటీపీలు, ఫోన్ లాక్ చేసే బయోమెట్రిక్ సిస్టమ్స్ ఇలా చాలా విషయాల్లో ఈ అదృశ్య సైన్యం పర్యవేక్షిస్తూ అభయ హస్తం చూపుతుంది. ఇదే సైబర్ సెక్యూరిటీ. ఇట్లాంటి ఫ్యూచర్– ప్రూఫ్ కోర్సుల ఫలితంగానే కాలేజీలు కేవలం డిగ్రీలు ఇచ్చే ఫ్యాక్టరీ లుగా కాకుండా, విద్యార్థులను ఆధునిక సవాళ్లను ఎదుర్కొనే సమ ర్థులుగా రూపొందించే నైపుణ్య కేంద్రాలుగా నిలబడుతున్నాయి.ఈ కోర్సులను పూర్తి చేసి ఫేస్బుక్, అమెజాన్, యాపిల్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలకు ఎంపికైతే, ఫ్రెషర్ స్థాయిలోనే నెలకు 1.5 లక్షల నుండి 2 లక్షల పైనే ప్రారంభ వేతనం లభిస్తోంది. ఈ ‘ఫాంగ్’ సంస్థలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞా నాన్ని ఉపయోగించి, సంప్రదాయ వస్తుసేవల రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేశాయి. వినియోగదారులు వస్తువులను కొనుగోలు చేసే విధానం నుండి సేవలను పొందే విధానం వరకు ఈ సంస్థలు సృష్టించిన డిజిటల్ ఎకోసిస్టమ్ మార్కెట్ స్వరూపాన్నే మార్చేసింది. ఒక్కమాటలో, ఈ ఫ్యూచర్ రెడీ కోర్సులు ‘నేర్చుకోండి, సంపాదించండి, ఎదగండి’ నినాదానికి ఆచరణాత్మక రూపాలు. – ప్రొ. బెల్లి యాదయ్య, ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నకిరేకల్ -
జగన్ తో సంప్రదించాక ఉద్యమ కార్యాచరణ
-
జగన్ తో సంప్రదించాక ఉద్యమ కార్యాచరణ
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణ కోసం నిర్వహించిన వైఎస్సార్ సీపీ ముఖ్యనేతల సమావేశం ముగిసింది. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సంప్రదించాక పోరాట కార్యాచరణ ప్రకటించనున్నారు. ఇందుకోసం పార్టీ నాయకులు మేకపాటి రాజమోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి.. వైఎస్ జగన్ ను కలవనున్నారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన నిరాహారదీక్షను బలవంతంగా విరవింపజేసిన నేపథ్యంలో గుంటూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నాయకులు సమావేశమయ్యారు. ప్రత్యేక హోదా పోరాటాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై చర్చించారు. వైఎస్సార్ సీపీ ముఖ్యనేతలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయకర్తలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
ఉద్యమ కార్యాచరణపై నేతల భేటీ
-
ఉద్యమ కార్యాచరణపై నేతల భేటీ
ప్రత్యేక హోదా కోసం జరిగే ఉద్యమ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు గుంటూరులో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఉద్యమ కార్యాచరణతో పాటు.. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి కూడా చర్చించారు. సమావేశంలో ఎంపీలు మేకపాటి రాజమోహనరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ముఖ్యనేతలు విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, పార్థసారథి, అంబటి రాంబాబు, కొడాలి నాని, వంగవీటి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఇంకా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయకర్తలు కూడా పాల్గొన్నారు. గుంటూరులో అందుబాటులో ఉన్న ప్రధాన నాయకులందరినీ ఈ సమావేశానికి పిలిచారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అరెస్టు చేయడం పట్ల నిరసన వ్యక్తం చేయాలని పార్టీ నిర్ణయించుకుంది. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు, ఒత్తిడి పెంచేందుకు వీలుగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఈనెల 22న ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజధాని శంకుస్థాపనకు వస్తున్న సందర్భంగా అప్పుడే ప్రకటన చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ఏయే రూపాల్లో ఉద్యమం ఉండాలో చర్చిస్తున్నారు. మరికొద్ది సేపట్లో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఒకటి రెండు రోజుల తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కూడా చర్చించి ఉద్యమ తీరుతెన్నులను నిర్ణయిస్తారు. ఇప్పటికే ఉద్యమం తారస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఏయే రూపాల్లో నిరసన వ్యక్తం చేయాలో నిర్ణయం తీసుకుంటారు.


