breaking news
fortune 500 seminar
-
ఫార్చ్యూన్–500లో ఏడు భారత కంపెనీలు
న్యూయార్క్: ఫార్చ్యూన్–500 తాజా జాబితాలో భారత్ నుంచి ఏడు కంపెనీలకు చోటు లభించింది. భారత్ నుంచి అత్యంత విలువైన కంపెనీగా (ఆదాయం పరంగా) ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) మరోసారి నిలిచింది. 2017లో 168వ స్థానంలో ఉన్న ఐవోసీ 65.9 మిలియన్ డాలర్ల ఆదాయం ఉన్న కంపెనీగా ఈ ఏడాది జాబితాలో 137కు చేరుకుంది. భారతదేశ సంపన్న పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీకి చెందిన ఆర్ఐఎల్ గతేడాది 203వ ర్యాంకులో ఉండగా, 62.3 బిలియన్ డాలర్ల ఆదాయంతో 53 స్థానాలను మెరుగుపరుచుకుని 148వ స్థానానికి చేరుకుంది. మొదటి స్థానంలో అమెరికాకు చెందిన వాల్మార్ట్ ఉంది. 47.5 బిలియన్ డాలర్ల ఆదాయంతో ఓఎన్జీసీ మరోసారి ఫార్చ్యూన్ జాబితాలో చోటు సంపాదించుకుంది. 197 ర్యాంకు సొంతం చేసుకుంది. 47.5 బిలియన్ డాలర్ల ఆదాయం కలిగిన ఎస్బీఐకి 216వ ర్యాంకు కేటాయించింది. టాటా మోటార్స్ గతేడాది 247వ స్థానంలో ఉంటే కాస్త మెరుగుపడి 232కు వచ్చింది. బీపీసీఎల్ 314వ స్థానంలో (గతేడాది 360వ ర్యాంకు), రాజేష్ ఎక్స్పోర్ట్స్ 405వ ర్యాంకు (గతేడాది 295వ స్థానంలో)లో ఉన్నాయి. ఈ జాబితాలో అత్యంత లాభదాయకత కలిగిన భారతీయ కంపెనీగా ఆర్ఐఎల్ అగ్ర స్థానంలో ఉండడం గమనార్హం. అంతర్జాతీయంగా అధిక లాభాలు కలిగిన కంపెనీల జాబితాలో ఆర్ఐఎల్ 99వ స్థానంలో ఉంది. చైనాకు చెందిన స్టేట్గ్రిడ్, సినోపెక్ గ్రూపు, చైనా నేషనల్ ప్రెటోలియం కార్ప్ టాప్–10లో నిలిచాయి. -
దేశంలో అగ్రగామి రాష్ట్రంగా ఏపీ.
-
దేశంలో అగ్రగామి రాష్ట్రంగా ఏపీ
విశాఖపట్నం: 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ భారత్లో ఆగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. బుధవారం విశాఖపట్నంలో జరిగిన ఫార్చూన్ ఇండియా - 500 ర్యాంకింగ్ సదస్సులో పాల్గొన్న చంద్రబాబు నూతన రాష్ట్రంలో వ్యాపార అవకాశాలపై కీలక ప్రసంగం చేశారు. కొత్త రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని తెలిపారు. రానున్న మూడేళ్లలో అన్ని నివాసాలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. గ్రామాల్లో కూడా పట్టణ మౌలిక సదుపాయాలు కల్పించి.. అభివృద్ధి చేస్తామన్నారు. పరిశ్రమల అనుమతికి సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తామన్నారు. పరిశ్రమల అనుమతికి 21 రోజుల్లో అనుమతి వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. సముద్ర తీరానికి సమాంతరంగా మరో జాతీయ రహదారిని నిర్మిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. దాదాపు 100 మందికి పైగా సీఈవోలు ఈ సదస్సులో పాల్గొన్నారు. -
దేశంలో అగ్రగామి రాష్ట్రంగా ఏపీ