breaking news
Former President of India
-
ప్రతిభా పాటిల్‌కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక
మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. జ్వరం, ఛాతీలో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న పాటిల్ మహారాష్ట్రలోని పూణెలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. 89 ఏళ్ల మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ బుధవారం భారతి ఆసుపత్రిలో చేరారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సీనియర్ వైద్యులొకరు మీడియాతో మాట్లాడుతూ ‘మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ బుధవారం రాత్రి ఆసుపత్రిలో చేరారు. ఆమె జ్వరం, ఛాతీలో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. చికిత్స కొనసాగుతోంది. వైద్యులు ఆమెను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు’ అని తెలిపారు. ప్రతిభా పాటిల్ భారతదేశానికి మొదటి మహిళా రాష్ట్రపతి. ఆమె 2007 నుంచి 2012 వరకు అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్నారు. -
కలాం.. నీకు సలాం
విజయవాడతో అబ్దుల్ కలాంకు అనుబంధం ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్న జిల్లావాసులు అంతరిక్షంలో అద్భుత ప్రయోగాలు చేశావు.. భారత కీర్తిపతాకను రెపరెపలాడించావు.. కలలు కనండి.. ఆ కలల్ని సాకారం చేసుకోండని పిలుపునిచ్చావు వేనవేల విద్యార్థులకు రోల్ మోడల్‌గా నిలిచావు దేశ ప్రథమ పౌరుడిగా పనిచేసిన దార్శనికుడివి నీవు సాధారణ జీవనం గడిపిన మహామనీషివి నీవు.. విజయవాడ: భారత మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె.అబ్దుల్ కలాం ఇక లేరన్న వార్తను జిల్లావాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనకు విజయవాడతోనూ అనుబంధం ఉంది. విద్య, వైద్య రంగాలకు చెందిన ప్రముఖులతో సంబంధాలున్నాయి. ఆయన రాష్ట్రపతి కాక పూర్వం, పదవీ విరమణ అనంతరం నగరానికి వచ్చిన సందర్భాలున్నాయి. ఆయన ప్రతి పర్యటనకూ ఓ ప్రత్యేకత ఉండేది. కలాం చివరిసారిగా ఈ ఏడాది మార్చి 15న విజయవాడ వచ్చారు. తాడిగడపలోని ఎల్.వి.ప్రసాద్ కంటి ఆస్పత్రిలో లేసిక్ సెంటర్‌ను ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత కంటి వైద్యసేవలు అందించే పథకాన్ని ఆయన ప్రారంభించారు. 1998లో పిన్నమనేని సీతాదేవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇచ్చే అవార్డును స్వీకరించేందుకు సిద్ధార్థ అకాడమీలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ సందర్భంగా ఆయన్ను ఘనంగా సన్మానించి డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు, డాక్టర్ సుధ అవార్డును అందజేశారు. రాష్ట్రపతి కాకముందు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వెళుతూ విజయవాడలోని స్టేట్ గెస్ట్‌హౌస్‌లో రాత్రి బసచేశారు. గన్నవరం సమీప చినఅవుటపల్లిలోని పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజీకి 2008 ఏప్రిల్ 2న వచ్చారు. అక్కడ ఈ-క్లాస్ (ఎలక్ట్రానిక్) క్లాసులు ప్రారంభించారు. మొక్కలు నాటి విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ఆకాశమే హద్దుగా ఎదగాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కలాం మృతిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. మహోన్నత వ్యక్తిత్వం గల కలాంను అందరూ అనుసరించదగిన వ్యక్తి అని తెలిపారు.