కలాం.. నీకు సలాం | abj abul kalam passed awy | Sakshi
Sakshi News home page

కలాం.. నీకు సలాం

Jul 28 2015 1:03 AM | Updated on Oct 9 2018 7:52 PM

కలాం..  నీకు సలాం - Sakshi

కలాం.. నీకు సలాం

అంతరిక్షంలో అద్భుత ప్రయోగాలు చేశావు.. భారత కీర్తిపతాకను రెపరెపలాడించావు.. కలలు కనండి..

విజయవాడతో అబ్దుల్ కలాంకు అనుబంధం
ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్న జిల్లావాసులు

 
అంతరిక్షంలో అద్భుత ప్రయోగాలు చేశావు.. భారత కీర్తిపతాకను రెపరెపలాడించావు.. కలలు కనండి.. ఆ కలల్ని సాకారం చేసుకోండని పిలుపునిచ్చావు వేనవేల విద్యార్థులకు రోల్ మోడల్‌గా నిలిచావు దేశ ప్రథమ పౌరుడిగా పనిచేసిన దార్శనికుడివి నీవు సాధారణ జీవనం గడిపిన మహామనీషివి నీవు..
 
విజయవాడ: భారత మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె.అబ్దుల్ కలాం ఇక లేరన్న వార్తను జిల్లావాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనకు విజయవాడతోనూ అనుబంధం ఉంది. విద్య, వైద్య రంగాలకు చెందిన ప్రముఖులతో సంబంధాలున్నాయి. ఆయన రాష్ట్రపతి కాక పూర్వం, పదవీ విరమణ అనంతరం నగరానికి వచ్చిన సందర్భాలున్నాయి. ఆయన ప్రతి పర్యటనకూ ఓ ప్రత్యేకత ఉండేది. కలాం చివరిసారిగా ఈ ఏడాది మార్చి 15న విజయవాడ వచ్చారు. తాడిగడపలోని ఎల్.వి.ప్రసాద్ కంటి ఆస్పత్రిలో  లేసిక్ సెంటర్‌ను ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత కంటి వైద్యసేవలు అందించే పథకాన్ని ఆయన ప్రారంభించారు. 1998లో పిన్నమనేని సీతాదేవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇచ్చే అవార్డును స్వీకరించేందుకు సిద్ధార్థ అకాడమీలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ సందర్భంగా ఆయన్ను ఘనంగా సన్మానించి డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు, డాక్టర్ సుధ  అవార్డును అందజేశారు.

రాష్ట్రపతి కాకముందు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వెళుతూ విజయవాడలోని స్టేట్ గెస్ట్‌హౌస్‌లో రాత్రి బసచేశారు. గన్నవరం సమీప  చినఅవుటపల్లిలోని  పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజీకి 2008 ఏప్రిల్ 2న వచ్చారు. అక్కడ ఈ-క్లాస్ (ఎలక్ట్రానిక్) క్లాసులు ప్రారంభించారు. మొక్కలు నాటి విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ఆకాశమే హద్దుగా ఎదగాలని పిలుపునిచ్చారు.  
 రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కలాం మృతిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. మహోన్నత వ్యక్తిత్వం గల కలాంను అందరూ అనుసరించదగిన వ్యక్తి అని తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement