breaking news
foriegn leaders
-
ఉన్నట్టుండి భారత్ వచ్చిన సౌదీ మంత్రి
న్యూఢిల్లీ: సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రి అదెల్ అల్ జుబేర్ ఉన్నట్టుండి భారత్‌లో ప్రత్యక్షమయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ జరిపిన సైనిక దాడులతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా మంత్రి అప్రకటిత పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.చెప్పాపెట్టకుండా భారత్ వచ్చిన అదెల్ అల్ జుబేర్ గురువారం న్యూఢిల్లీలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ను కలిశారు. సౌదీ అరేబియా వాతావరణ రాయబారి కూడా అయిన అదెల్ అల్ జుబేర్ తనను కలిసినట్లు జైశంకర్ నుండి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "ఈ ఉదయం సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రి అదెల్ అల్ జుబేర్‌తో మంచి సమావేశం జరిగింది" అని ఆయన అన్నారు. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని తొమ్మిది చోట్ల ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని బుధవారం భారత్ జరిపిన సైనిక దాడులను ప్రస్తావిస్తూ ఉగ్రవాదాన్ని గట్టిగా ఎదుర్కోవడంపై భారత్ దృక్పథాలను సౌదీ మంత్రితో పంచుకున్నట్లు జైశంకర్ పేర్కొన్నారు.భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తో ద్వైపాక్షిక జాయింట్ కమిషన్ సమావేశానికి సహ అధ్యక్షత వహించేందుకు ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి బుధవారం అర్ధరాత్రి న్యూఢిల్లీకి చేరుకున్న కొద్ది గంటల్లోనే జైశంకర్ తో సౌదీ మంత్రి భేటీ కావడం గమనార్హం.A good meeting with @AdelAljubeir, Minister of State for Foreign Affairs of Saudi Arabia this morning. Shared India’s perspectives on firmly countering terrorism. 🇮🇳 🇸🇦 pic.twitter.com/GGTfItZ3If— Dr. S. Jaishankar (@DrSJaishankar) May 8, 2025 -
Mahakumbh: జన ప్రవాహమే కాదు.. ఇవి కూడా..
మహాకుంభమేళా.. ప్రపంచం యావత్తూ తరలివచ్చి, కనులారా వీక్షిస్తున్న మహాద్భుత ఉత్సవం. ప్రతీ 144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళా శివరాత్రి పర్వదినం అంటే ఫిబ్రవరి 26తో ముగియనుంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ త్రివేణీ సంగమం వేదికగా ఈ మహోత్సవం జరుగుతోంది. కోట్లాదిమంది భక్తులు దేశవిదేశాల నుంచి తరలివచ్చి పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ కుంభమేళా భారత్‌కు పలు కొత్త రికార్డులను కూడా అందించింది. మహాకుంభమేళా ముగుస్తున్న తరుణంలో ఈ ఉత్సవంలో మహోన్నతంగా నిలిచిన కొన్ని అంశాలివే..విదేశీయుల భాగస్వామ్యంమహాకుంభమేళా(Mahakumbh Mela)కు భారీగా జనం తరలివచ్చారు. 183 దేశాలకు చెందిన ప్రతినిధులు కూడా త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారని యూపీ ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటివరకూ కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించినవారి సంఖ్య 60 కోట్లను దాటింది. ఒక్క మౌని అమావాస్య నాడు ఏకంగా 10 కోట్లకుపైగా భక్తులు పవిత్ర స్నానం చేయడం విశేషం.ఆధునిక సాంకేతికతమహాకుంభమేళా డిజిటల్ మహా కుంభ్(Digital Maha Kumbh) దిశగా సాగింది. ఆధ్యాత్మికత, ఆధునిక సాంకేతికతల సమ్మేళనంగా ఈ ఉత్సవం నిలిచింది. మహాకుంభమేళాలో 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో డిజిటల్ మోనిటరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో ఏఐ, వీఆర్, ఏఆర్, లిడార్, ఎల్ఈడీ డిస్ప్లే, హోలోగ్రామ్ల వంటి అత్యాధునిక సాంకేతికతలు వినియోగించారు. భక్తులకు కట్టుదిట్టమైన భద్రతను అందించేందుకు అత్యాధునిక సాంకేతిక పరికరాలను వినియోగించారు.ఆకాశంలో అరుదైన దృశ్యంమహా కుంభమేళా ఫిబ్రవరి 26న ముగియనుంది. ఆ రోజున మహాశివరాత్రి(Mahashivratri) పర్వదినం కావడం విశేషం. ఆనాడు కుంభమేళాలో చివరి రాజ స్నానం ఆచరిస్తారు. మహా కుంభమేళా ముగింపు రోజున ఆకాశంలో అరుదైన దృశ్యం కనిపించనుంది. సౌర వ్యవస్థలోని ఏడు గ్రహాలు ఒకేసారి కనిపించనున్నాయి. మహా కుంభమేళా ముగింపు రోజున బుధుడు, శుక్రుడు, శని, బృహస్పతి, యురేనస్, నెప్ట్యూన్ మొదలైన ఏడు గ్రహాలు సూర్యునికి ఒక వైపున ఒకే వరుసలో కనిపించనున్నాయి. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం సౌర వ్యవస్థలో ఇటువంటి అరుదైన దృశ్యం అత్యంత అరుదుగా కనిపిస్తుంది.ఆర్థిక భాగస్వామ్యంఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహాకుంభమేళాను ఎంతో ఘనంగా నిర్వహించేందుకు ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసి, అందుకు అనుగుణంగా ముందుకు సాగింది. యూపీ సర్కారు కుంభమేళా బడ్జెట్‌కు రూ. 6,382 కోట్లు కేటాయించింది. దీనిలో రూ. 5,600 కోట్లు ఈవెంట్ల నిర్వహణ , మౌలిక సదుపాయాల అభివృద్ధికి వెచ్చించింది. మహాకుంభమేళా పూర్తయ్యేనాటికి యూపీ ప్రభుత్వానికి రెండు లక్షల కోట్ల మేరకు ఆదాయం సమకూరుతుందనే అంచనాలున్నాయి. మహా కుంభమేళా కారణంగా స్థానికంగా ఉన్న చిన్న, పెద్ద వ్యాపారులు ఎంతో ప్రయోజనం పొందుతున్నారు. ఇది కూడా చదవండి: Mahakumbh: మహాశివరాత్రికి చివరి పవిత్ర స్నానం.. సన్నాహాలివే.. -
ప్రధాని నరేంద్ర మోదీ@ 65
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ 65 సంవత్సరంలో అడుగుపెట్టారు. ఈసందర్భంగా ఆయనకు ప్రపంచ దేశాలనుంచి దిగ్గజాలు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలని పేర్కొంటూ రష్యా ప్రధాని మెద్వదేవ్, చైనా ప్రధాని జీ జిన్ పింగ్, జర్మనీ చాన్సలర్ ఎంజెలా మెర్కెల్ తెలిపారు. ఈ సందర్భంగా తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారందరికి తిరిగి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. రాష్ట్రపతి భవన్ కూడా ప్రధానికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది. అలాగే, ప్రధాని తన జన్మదినం రోజే 1965నాటి ఇండియా-పాక్ యుద్ధానికి సంబంధించిన స్మారక మ్యూజియం శౌర్యాంజలిని సందర్శించారు. ఈ సందర్భంగా నాటి వీర జవానులను గుర్తుకు తెచ్చుకొని వారికి ప్రత్యేక అంజలి ఘటించారు. నేడు ఈ మ్యూజియంలో గోల్డెన్ జూబ్లీ వేడుకలు ప్రారంభమయ్యాయి. Dear Rashtrapati ji, deeply humbled by your good wishes. Thank you very much. One learns so much from your wisdom & insight @RashtrapatiBhvn — Narendra Modi (@narendramodi) September 17, 2015 My gratitude to Chancellor Angela Merkel for her kind wishes. — Narendra Modi (@narendramodi) September 17, 2015 Thank you President Xi Jinping for your wishes. — Narendra Modi (@narendramodi) September 17, 2015 Dear @MedvedevRussiaE, thank you for your wishes. — Narendra Modi (@narendramodi) September 17, 2015