breaking news
foke arts
-
న్యూయార్క్‌లో ఘనంగా నైటా తెలంగాణ ఫోక్ ఫెస్టివల్, డ్యాన్స్ ఫీస్ట్
అమెరికాలో మరోసారి తెలంగాణ పల్లె జానపదం మెరిసింది. నైటా (న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం. New York Telangana Telugu Association (NYTTA) దసరా వేడుకల సందర్భంగా న్యూయార్క్ లో మన సంస్కృతీ, సంప్రదాయాలు, పండగల థీమ్‌తో కార్యక్రమాలు ఈ వీకెండ్ లో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హాజరైన తెలుగు కుటుంబాలు ఈ ఉత్సవాలను ఆద్యంతం ఎంజాయ్ చేశారు.ధూమ్ ధామ్ వ్యవస్థాపకులు రసమయి బాలకిషన్ తో పాటు రేలా రే రేలా గంగ, లావణ్య, దండేపల్లి శ్రీనివాస్ లు తెలంగాణ ఫోక్ సాంగ్స్, ఆటపాటలతో కార్యక్రమాన్ని ఉర్రూతలూగించారు. వీరితో పాటు అమెరికాలో స్థిరపడిన తెలుగు టాలెంట్ అమ్మాయిలు, అబ్బాయిలు తమ కల్చరల్ ప్రోగ్రామ్స్ తో ఆకట్టుకున్నారు. లౌకికా రెడ్డి, కావ్యా చౌదరి, ఐశ్వర్యల ప్రత్యేక ప్రదర్శనలతో అలరించారు.న్యూయార్క్ కాంగ్రెస్ మెన్, హౌజ్ ఆఫ్ రిప్రజెంటెటివ్స్ మెంబర్ టామ్ సూజి ఈ ఫెస్ట్ కు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. తెలంగాణ వేడుకలు అద్భుతంగా ఉన్నాయని మెచ్చుకున్నారు. పెద్ద సంఖ్యలో స్థిరపడిన తెలుగువారు అమెరికా అభివృద్దిలో అంతర్భాగమయ్యారని సూజి అన్నారు.అమెరికాలో స్థిరపడినా సొంత ప్రాంత పండగల సంప్రదాయాలను కొనసాగిస్తూ, కొత్త తరాలకు పరిచయం చేయటం కోసమే దసరా వేడుకలను నిర్వహించామని, విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు నైటా ప్రెసిడెంట్ వాణి ఏనుగు.ఎన్ఆర్ఐ ప్రముఖులు పైళ్ల మళ్లారెడ్డితో పాటు న్యూయార్క్, న్యూజెర్సీ పరిసరాల్లో స్థిరపడిన తెలుగు కుటుంబాలు ఈ వేడుకలకు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. శ్రీలక్ష్మి కులకర్ణి వ్యాఖ్యాతగా వ్యవహరించగా, నైటా ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు ఆఫ్ డైరెక్టర్స్, అడ్వయిజరీ కమిటీ సభ్యులు పూర్తి సమన్వయంతో వేడుకలను విజయవంతం చేశారు. -
జానపద కళలను ప్రోత్సహిద్దాం
కర్నూలు (కల్చరల్): పల్లె సీమల సంస్కృతికి ప్రతీకగా నిలిచే జానపద కళలను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉందని ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు తెలిపారు. స్థానిక కృష్ణానగర్‌లోని శ్రీలక్ష్మి ఫంక్షన్‌హాలులో ఎస్వీ సుబ్బారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన 16వ రాష్ట్ర స్థాయి జానపద నృత్య పోటీలను ఆయన ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ గత 16 ఏళ్లుగా ఎస్వీ ఫౌండేషన్ సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తూ కళాకారులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. సీమ కళాకారులు రాష్ట్రస్థాయిలో, జాతీయ స్థాయిలో బాగా రాణిస్తున్నారన్నారు. ఎస్వీ ఫౌండేషన్ విద్యార్థులలో చక్కని కళాభిరుచులను పెంపొందించే దిశగా కషి చేస్తోందన్నారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్వీ ఫౌండేషన్ నిర్వహించిన సాంస్కృతిక పోటీలలో విజేతలైన కళాకారులు చాలా మంది రాష్ట్రస్థాయిలో ఉత్తమ కలాకారులుగా పేరు, ప్రఖ్యాతులు సంపాదించడం హర్షణీయమన్నారు. కర్నూలు ఏపీఎస్పీ 2వ బెటాలియన్ కమాండెంట్ గోగినేని విజయకుమార్ మాట్లాడుతూ కర్నూలు జిల్లా జానపద కళలకు నిలయమని పేర్కొన్నారు. విద్యార్థి దశ నుండి పిల్లల్లో చక్కని కళాసక్తులు కల్గిస్తూ ఎస్వీ ఫౌండేషన్ వారిలో ఉత్తమ మానవీయ విలువలు పెంపొందిస్తుందన్నారు. శ్రీలక్ష్మి ఫంక్షన్‌హాలులో చిన్నారులు ప్రదర్శించిన జానపద నృత్యాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మెప్మా పీడీ రామాంజనేయులు, ఎస్వీ సుబ్బారెడ్డి ఫౌండేషన్ కార్యధక్షులు రాయపాటి శ్రీనివాస్, వివిధ జిల్లాల నుండి వచ్చిన కాళాకారులు పాల్గొన్నారు.