breaking news
fishing boats
-
కన్నీళ్లే..ఆయుధాలై
కడలిలో తమిళ తంబీల ఆగడాలు ఇక చెల్లవంటున్నారు జిల్లా మత్స్యకారులు. నడిసంద్రంలో సమరానికి సై అంటున్నారు. మా ప్రాంతంలోకి వచ్చి మత్స్య సంపదను దోచుకుపోవడమే కాకుండా రూ.లక్షలు విలువజేసే వలలు ధ్వంసం చేస్తుంటే చూస్తూ ఊరుకోం.. ఇటువైపు కన్నెత్తి చూస్తే ఎదురుదాడులు తప్పవని హెచ్చరికలు చేస్తున్నారు. ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల మత్స్యకారులు సమావేశమై సోనాబోట్ల అంతుచూడాలని నిర్ణయించుకున్నారు. చేపల వేటతో పాటు నిబంధనలు ధిక్కరించే తమిళ జాలర్లను కూడా వేటాడేస్తామంటూ కదనరంగంలోకి దిగారు. ఇప్పటికే రెండు సోనాబోట్లను స్వాదీనం చేసుకున్నారు.ఒంగోలు, టాస్‌్కఫోర్స్: ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి నెల్లూరు, తిరుపతి జిల్లా తడ వరకూ సుమారు 281 కిలోమీటర్లు తీరప్రాంతం విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో మత్స్యకారులు ప్రాణాలు పణంగా పెట్టి చిన్న బోట్లతో వేట సాగిస్తున్నారు. మత్స్య సంపదను తెచ్చుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. వీరిపై మెకనైజ్డ్ (సోనా) బోట్లతో తమిళ జాలర్లు సమూహంలా వచ్చి మారణాయుధాలతో దాడులకు తెగబడుతున్నారు. రూ.లక్షల విలువైన వలలను ధ్వంసం చేస్తున్నారు. మత్స్య సంపదను దోచుకెళ్లిపోతున్నారు. తమిళనాడుకు చెందిన కడలూరు జాలర్లతో మన మత్స్యకారుల సమరం నిత్యకృత్యంగా మారింది. చేపల కోసం వేట చేయడం ఒక ఎత్తైతే, సముద్రంలో తమిళ జాలర్ల నుంచి కాపాడుకోవడం మరో ఎత్తుగా మారింది. చిన్న ఇంజిన్ ఉన్న బోట్లతో సముద్రంలో తీరం నుంచి 8 కి.మీ. లోపలే వేట సాగించుకోవచ్చు. ఇంకా లోపలికి వెళ్లి వేట సాగించుకోవచ్చు. ఇక ఇతర రాష్ట్రాలకు చెందిన జాలర్లు ఒడ్డు నుంచి 23 కి.మీ. అవతలి జలాల్లో మాత్రమే చేపల వేట చేసుకోవాల్సి ఉంటుంది. ఒడ్డు నుంచి సముద్రంలో 8 కి.మీ. వరకు మెకనైజ్డ్ బోట్లతో చేపల వేట చేయకూడదనే నిబంధనలు ఉన్నాయి. తమిళనాడులో వేల సంఖ్యలో ఈ రకం బోట్లు ఉన్నాయి. వీటిలో కనీసం 5 నుంచి 10 మంది వరకు మత్స్యకారులు ఉంటారు. అధునాతన వలలు, మారణాయుధాలతో మన ప్రాంతం వైపు వచ్చి దాడులు చేస్తున్నారు. వీరి నుంచి రక్షించాలని అధికారులను, పాలకులను కోరుతూ వస్తున్నారు. అయినా ఎలాంటి ఫలితం కనిపించలేదు..స్వీయ వేట నిషేధం..మత్స్యకారులు ఎన్నోసార్లు జిల్లా అధికారులకు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకపోవటంతో చివరకు మత్స్యకారులు తమ సమస్యను తామే పరిష్కరించుకోవటానికి నడుం బిగించారు. చిన్నబోటుతో చేపల వేటకు వెళితే సముద్రంలో 60 నుంచి 80 వరకు సోనాబోట్లు చేపల వేట సాగిస్తూ మత్స్య సంపద కొల్లగొట్టడంతో పాటు లక్షలాది రూపాయల వలలు ధ్వంసం చేసేవని, దీంతో ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సోనాబోట్ల కట్టడికి మన జిల్లాతోపాటు, పక్కనే ఉన్న నెల్లూరు జిల్లాకు చెందిన మత్స్యకార కాపులు ఈ నెల 11వ తేదీన సమావేశమయ్యారు.మూడు రోజుల పాటు వేట నిషేధం అని ప్రకటించారు. 12వ తేదీ రాత్రి గతంలో తాము వేటాడి నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె హార్బర్లో ఉంచిన కడలూరుకు చెందిన సోనాబోటును తీసుకుని సుమారు 80 మంది జాలర్లు కర్రలు, కేట్బాల్స్, టపాసులు తీసుకుని తీరంలో సోనాబోట్ల వేట ప్రారంభించారు. ఆంధ్రా మత్స్యకారులు తమపై దాడికి వస్తున్నారని సమాచారం రావటంతో జాగ్రత్త పడ్డ కడలూరు జాలర్లు పారిపోయారు.నిషేధకాలం పూర్తయిన తరువాత నాలుగు రోజుల పాటు మత్స్యకారులు చేపల వేట కొనసాగించగా ఈనెల 18వ తేదీ గురువారం రాత్రి సోనాబోట్లు తీరానికి దగ్గరగా వచ్చి లక్షలాది రూపాయలు వలలు తెంచుకుని చేపల వేట సాగించారు. ఈసారి కడలూరు బోట్లను వదిలేది లేదని నిశ్చయించుకున్నారు. తిరిగి 19వ తేదీ చేపల వేట నిషేధం అని మత్స్యకార గ్రామాల్లో రెండవసారి దండోరా వేయించారు.ఏడాదిన్నరగా నిరీక్షణ..కూటమి ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో మత్స్యకారుల సమస్యను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి దృష్టికి తీసుకుని వెళ్లారని, సీఎం చంద్రబాబు కూడా స్పందించి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారన్న విషయం అప్పట్లో సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. అయినా సంవత్సరం దాటినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. గతంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మత్స్యకారుల విజ్ఞప్తితో అద్దెకు స్పీడ్‌బోటు తీసుకుని కొద్దిరోజుల పాటు సోనాబోట్లను అడ్డుకునే ప్రయత్నం చేసింది. కానీ కూటమి ప్రభుత్వంలో మాత్రం మత్స్యకారుల బాధలు పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో విసుగు చెందిన మత్స్యకారులు సమస్యను వారే పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నారు. సోనాబోట్లపై ఎదురుదాడి..గురువారం రాత్రి తమిళ జాలర్లు దాడులు చేయడమే కాకుండా మన ప్రాంత మత్స్యకారులను అవమానించే రీతిలో వ్యవహరించారు. దీంతో వారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం రాత్రి నెల్లూరు జిల్లా కొడవలూరు సమీపంలోని కొనపూడి సముద్రతీరంలో సోనాబోట్లతో చేపల వేట సాగిస్తున్న సమాచారం అందింది. వెంటనే రెండు జిల్లాల మత్స్యకారులు అక్కడకు బయలు దేరారు. వారిని అడ్డుకున్నారు. బోటును స్వాధీనం చేసుకుని విజయం సాధించారు. ఆ బోట్లలో మారణాయుధాలతో పాటు, 15 మంది వరకూ తమిళ మత్స్యకారులు ఉన్నట్టు తెలిసింది. ఇదిలా ఉండగా గత నెలలో సైతం తమిళజాలర్లను తరిమికొట్టి ఒక సోనాబోటును స్వా«దీనం చేసుకుని జువ్వలదిన్నె హార్బర్లో ఉంచారు. సుమారు నెల రోజులు దాటినా ఇంత వరకు తమిళనాడు మత్స్యకారులు ఎవరూ ఈ బోటు కోసం వచ్చిన దాఖలాలు లేవని తెలిసింది. తాజాగా మరో బోటును కూడా స్వా«దీనం చేసుకుని దాన్ని కూడా జువ్వలదిన్నెకు తరలించినట్టు సమాచారం. ఇకపై ఎవరు సహకరించినా, సహకరించకపోయినా వెనక్కి తగ్గేదే లేదని ఇకపై తమిళనాడు సోనాబోట్లకు చుక్కలు చూపిస్తామని మత్స్యకారులు హెచ్చరిస్తున్నారు. -
ఫిషింగ్ బోట్లలో వందల కిలోల డ్రగ్స్.. పట్టుకున్న నేవీ
ముంబయి: అరేబియా సముద్ర జలాల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. సముద్రంలో రెండు ఫిషింగ్ బోట్లలో ఏకంగా 500 కిలోల డ్రగ్స్‌ను అక్రమరవాణా చేస్తుండగా పట్టుకున్నట్లు ఇండియన్ నేవీ తెలిపింది. ఈ మేరకు ఎక్స్(ట్విటర్)లో శుక్రవారం నేవీ ఒక పోస్టు చేసింది.‘శ్రీలంకకు చెందిన రెండు ఫిషింగ్ బోట్లలో అక్రమరవాణా చేస్తున్న 500 కిలోల డ్రగ్స్‌ను ఇండియన్ నేవీ సీజ్ చేసింది. శ్రీలంక నేవీ,ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ ఎప్పికప్పుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించిన ఇండియన్ నేవీ డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్న బోట్లను అడ్డుకుంది.డ్రగ్స్ ఉన్న బోట్లను గుర్తించడానికి విస్తృత ఏరియల్ సెర్చ్ నిర్వహించాం. డ్రగ్స్ రవాణా చేస్తున్న రెండు బోట్లను, అందులో ఉన్న సిబ్బందిని శ్రీలంకకు అప్పగించాం’అని ఇండియన్ నేవీ ట్వీట్లో తెలిపింది. ఈ ఆపరేషన్ డ్రగ్స్ రవాణాను అరికట్టడంలో భారత్,శ్రీలంక మధ్య ఉన్న పటిష్ట సంబంధాలను తెలియజేస్తోందని పేర్కొంది. Narcotics Seizure - Combined Operation b/n #IndianNavy & @srilanka_navy.Based on information received from #SrilankaNavy regarding probable narcotics smuggling by Sri Lankan flagged fishing vessels, the @indiannavy swiftly responded through a coordinated operation to localise &… pic.twitter.com/dkpzNQonTF— SpokespersonNavy (@indiannavy) November 29, 2024 -
భారత్‌కు మాల్దీవుల అభ్యర్థన.. ఎందుకో తెలుసా?
మాల్దీవుల-భారత్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా భారత్ తాను ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో కూడా మాల్దీవులకు రూ.600 కోట్ల ఆర్థిక సాయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఆ మరోసటి రోజే.. తాజాగా మాల్దీవుల నుంచి భారత్‌కు ఒక అభ్యర్థన వచ్చింది. తమ దేశ సముద్ర ప్రాదేశిక జలాల్లో మూడు మత్స్యకారుల నౌకల్లో ఇండియన్ కోస్ట్‌గార్డు సిబ్బంది ప్రవేశించటంపై భారత్ నుంచి స్పష్టత ఇవ్వాలని కోరింది. శుక్రవారం రాత్రి తమ దేశ మిలిటరీ.. గురువారం విదేశి మిలిటరీ సిబ్బంది మాల్దీవుల మత్స్యకారుల నౌకల్లోకి ప్రవేశించినట్లు సమాచారం అందుకుందని.. అందులో భారత్‌కు చెందిన కోస్ట్ గార్డు సిబ్బంది ఉన్నట్లు గుర్తించినట్లు భారత్‌కు నివేదించింది. అదేవిధంగా మరో రెండు నౌకల్లో కూడా ఇండియన్ కోస్ట్‌గార్డు సిబ్బంది ప్రవేశించారని పేర్కొంది. అయితే వారు ఏం చేశారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. మాల్దీవీయన్ ఎక్స్క్లూసివ్ ఎకానమిక్ జోన్లో ప్రయాణిస్తున్న మాల్దీవుల మత్స్యకారుల నౌకల్లోకి ఇండియన్ కోస్ట్ సిబ్బంది ప్రవేశించటంపై భారత్ అధికారికంగా నివేదిక అందించాలని ఈ మేరకు మాల్దీవుల విదేశీ వ్యవహారాల మంత్రి భారత్‌కు అధికారిక విజ్ఞప్తి చేసింది. సంబంధిత అధికారులతో సమన్వయం లేకుండా అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఈ ఘటనపై స్పష్టత ఇవ్వాలని ఆ దేశ స్థానిక భాషలోనే భారత్‌ను అభ్యర్థించడం గమనార్హం. ఇక.. మాల్దీవుల- భారత్ మధ్య నెలకొన్నదౌత్యపరమైన ప్రతిష్టంభన నేపథ్యంలో ఇది మొదటి దౌత్యపరమైన అభ్యర్థనగా తెలుస్తోంది. ఇక కీలకమైన హిందూ మహాసముద్రంలో భారత్, చైనా తమ వ్యూహాత్మ ప్రాధాన్యపై దృష్టిపెట్టిన విషయం తెలిసిందే. మాల్దీవుల మంత్రులు.. లక్షద్వీప్ విషయంలో ప్రధానిమోదీపై అనుచిత వ్యాఖ్యలు చేయటంతో చైనా అనుకూల వ్యక్తిగా పేరున్న మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జతో భారత్ దౌత్యపరమైన సంబంధాలు క్షీణిస్తూ వచ్చాయి. చదవండి: US Strikes: యూఎస్ ప్రతీకార దాడులు.. ఆరుగురు ఉగ్రవాదులు మృతి! -
10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
చేపల వేటపై 2 నెలలు నిషేధం.. మత్స్యకారులకు అండగా ఏపీ ప్రభుత్వం
చీరాల టౌన్: రెండున్నర నెలల పాటు సముద్ర తీర ప్రాంతాల్లో హైలెస్సా.. హైలెస్సా అనే మాటలు వినపడవు. తీరం ఒడ్డున మత్స్యకారుల సందడి కనిపించదు. సముద్రంలో మత్య్సకారుల బోట్లు కనిపించవు. సముద్రం బోసిగా దర్శనమివ్వబోతోంది. ప్రభుత్వం వేటపై నిషేధాజ్ఞలు జారీ చేసింది. కానీ వేట తప్ప మరో పని తెలియని మత్స్యకారుల పరిస్థితి ఈ సంధికాలంలో సుడిగండంలో ఉన్న మత్య్సకారులకు అండగా సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నిలవనున్నారు. మే 15 కల్లా గంగపుత్రులకు మత్య్సకార భరోసా కింద ఒక్కో మత్య్సకార కుటుంబానికి ఆర్థిక తోడ్పాటు అందించేలా రూ.10 వేలు ఇవ్వను న్నారు. ఈనెల 15 నుంచి జూన్ 15 తేదీ వరకు సముద్రంలో చేపల వేట నిలుపుదల చేస్తున్నట్లు మత్స్యశాఖ అధికారులు ప్రకటించారు. ప్రతిఏటా ఈ సమయంలో చేపలు పునరుత్పత్తి సమ యం సందర్భంగా సముద్రంలో మరబోట్లు, యాంత్రీకరణ తెప్పలకు నిషేధ సమయంలో పూర్తిగా వేటను నిలుపుదల చేయాలని ఆదేశాలిచ్చారు. నిషేధ సమయంలో మత్స్యకారులకు వైఎస్సార్ సీపీ సర్కారు ఒక్కో కుటుంబానికి ఆర్థిక సాయం అందించనుంది. బాపట్ల జిల్లా పరిధిలోని ఆరు నియోజకవర్గాలు ఉండగా రేపల్లె, బాపట్ల, చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లోని ఏడు మండలాల్లో 9600 మత్య్సకార కుటుంబాలు ఉన్నాయి. బాపట్ల జిల్లాలో 50 వేల మత్య్సకారులు ఉండగా 25000 మంది మత్య్సకారులు వేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఒక్కో బోటుకు ఆరుగురు మత్య్సకారులు ఉంటారు. బాపట్ల జిల్లాలో ఉన్న ఏడు తీరప్రాంత మండలాల్లో 76 కిలో మీటర్లు ఉన్న సముద్రతీర ప్రాంతంలో 50,000 మంది మత్య్సకార జనాభా, 9600 మత్య్సకార కుటుంబాలు ఉన్నాయి. జిల్లాలో మోటారు, మెకనైజ్డ్ బోట్లు 2924 పైచిలుకు బోట్లు ఉన్నాయి. జిల్లాలోని రేపల్లె, నిజాంపట్నం, బాపట్ల, చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాల్లో సముద్ర తీరప్రాంతం ఉంది. సముద్రతీర ప్రాంతం జిల్లాలోని రేపల్లెలోని లంకెనవాలిపల్లి దిబ్బ నుంచి చినగంజాం మండలం ఏటిమొగ వరకు తీరప్రాంతం విస్తరించి ఉంది. ఈ మండలాల్లోని మత్య్సకారులు సముద్రంలో వేట చేసి మత్స సంపదను విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. జూన్ 14 వరకు సముద్రంలో వేట నిషేధం విధించడంతో మత్య్సకారుల వేట సామగ్రిని, బోట్లను ఒడ్డుకు తీసుకువచ్చి నిలుపుదల చేశారు. కుటుంబ పోషణకు అండగా మత్య్సకార భరోసా.. సాధారణంగా వాడరేవు మత్స్యకారులు కృష్ణా జిల్లా మచిలీపట్నం, నెల్లూరు జిల్లా రామాయపట్నం వరకు వేటకు వెళ్లి గురకా, పాములు, బొంత, కూనాము, వంజరం, పండుగప్పలు లాంటి చేపలను పట్టుకొస్తుంటారు. నిషేధ కాలం రెండున్నర నెలలు ఉండటంతో మత్య్సకారులు ఇబ్బందులు ఇబ్బందులకు తొలగించేందుకు ప్రభుత్వం మత్య్సకార భరోసా అందిస్తూ అండగా నిలుస్తోంది. బోట్లతో వేట సాగిస్తే చర్యలు సముద్రంలో చేపల సంతానోత్పత్తి పెరిగే కారణంగా శనివారం నుంచి జూన్ 14 వరకు వేట నిషేఽ దం అమలు చేస్తున్నాం. సంప్రదాయ తెప్పలు వేట సాగించుకోవచ్చనని, మెకనైజ్డ్ ఇంజిన్ బోట్లతో సముద్రంలో వేట సాగిస్తే చర్యలు తీసుకుంటాం. మత్య్సకారులు కేంద్రం ప్రభుత్వ ఆదేశాలు విధిగా పాటించాలి. మత్య్సకార భరో సా కింద బోట్లు పరిశీలన చేసి దరఖా స్తులను ఆన్లైన్ నిక్షిప్తం చేస్తాం. విచారణ చేసి మే 1న భరోసా తుది జాబితా ప్రకటిస్తాం. మేలో సీఎం జగన్ మత్య్సకారులకు భరోసా సాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. – ఎ.సురేష్, మత్య్సశాఖ జిల్లా అధికారి, బాపట్ల -
సముద్రం మధ్యలో నిలిచిన చెన్నై వేట బోట్లు
సాక్షి, కోడూరు: చెన్నైకి చెందిన రెండు వేట బోట్లు సాంకేతిక సమస్య కారణంగా సముద్రం మధ్యలో నిలిచిపోయి మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరిన ఘటన హంసలదీవి సాగరతీరంలో చోటుచేసుకుంది. పాలకాయతిప్ప మెరైన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నైకు చెందిన నలుగురు మత్స్యకారులు, కాకినాడకు చెందిన ముగ్గురు మత్స్యకారులు వారం క్రితం రెండు బోట్లలో సముద్రంలో వేటకు బయలుదేరారు. ఈ నెల 24వ తేదీ (శనివారం) సాయంత్రం పాలకాయతిప్ప సముద్రతీరానికి వచ్చే సరికి రెండు బోట్లు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఆగిపోయాయి. దీంతో కంగారుపడిన మత్స్యకారులు ఆ రాత్రంతా బోట్లలోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఆదివారం సముద్రం పాటు సమయంలో మత్స్యకారులు బోట్లలో ఉన్న కొన్ని పరికరాల సహాయంతో ఒడ్డుకు చేరారు. ఈ విషయాన్ని మత్స్యకారులు ఎవరికి చెప్పకుండా బోట్లలో ఏర్పడిన సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేసేందుకు విజయవాడకు వెళ్లారు. సోమవారం ఉదయం స్థానిక మత్స్యకారులు సముద్రంలో బోట్లు నిలిచి ఉండడాన్ని గమనించి విషయాన్ని పాలకాయతిప్ప మెరైన్ పోలీసులకు అందించారు. ప్రత్యేక పడవలో వెళ్లిన పోలీసులు మెరైన్ పోలీసులు సోమవారం ఉదయం ప్రత్యేక పడవలో నిలిచిన బోట్లకు వెళ్లారు. బోట్లలో ఉన్న మత్స్యకారుల వివరాలు సేకరించి, వారి గుర్తింపు కార్డులను తనిఖీ చేశారు. నలుగురు మాత్రమే బోట్లలో ఉండగా మిలిగిన వారు సామగ్రి కోసం విజయవాడ వెళ్లినట్లు మత్స్యకారులు పోలీసులకు తెలిపారు. వారి వద్ద మత్స్యకార గుర్తింపు కార్డులు ఉన్నట్లు మెరైన్ సీఐ పవన్‌కిషోర్ చెప్పారు. సముద్రంలో చోరబాటుదారులను గుర్తిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. తనిఖీకి వెళ్లిన వారిలో ఎస్ఐ జిలానీ, రైటర్ రెహమాన్ జానీ, ఇంటెలిజెన్స్ సిబ్బంది ఉన్నారు. -
రెండు భారత పడవలు పట్టుకున్న పాక్
న్యూఢిల్లీ: ముంబై ముట్టడి తరహా దాడికి యత్నించి విఫలమైన పాకిస్థాన్ మరో కుతంత్రానికి పాల్పడింది. రెండు భారతీయ మత్స్యకార పడవలను పాకిస్థాన్ పట్టుకుంది. జెలీల్, జలరామ్ పేరు గల ఈ పడవల్లో12 మంది జాలర్లు ఉన్నారు. అంతర్జాతీయ సముద్ర సరిహద్దులో శనివారం రాత్రి ఈ పడవలను పట్టుకున్నట్టు సమాచారం. పట్టుకున్న 12 మందిని ఎక్కడకు తీసుకెళ్లారనేది తెలియరాలేదు. అరేబియా సముద్రం తీరం నుంచి గుజరాత్ లో చొరబడేందుకు డిసెంబర్ 31న పాకిస్థాన్ బోటు విఫలయత్నం చేసిన సంగతి తెలిసిందే. పాక్‌కు చెందిన ఆ పడవలోని సిబ్బంది తమను తాము పేల్చేసుకున్నారు.