breaking news
family members darna
-
ప్రభుత్వం పటిష్ట భద్రత కల్పించాలి
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో 2017 నాటి ఉన్నావ్ అత్యాచారం కేసులో దోషిగా తేలిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగార్‌కు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను ఢిల్లీ హైకోర్టు రద్దు చేయడాన్ని బాధితురాలు వ్యతిరేకించారు. కోర్టు తీర్పును నిరసిస్తూ ఆదివారం ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేపట్టారు. బాధితురాలి కుటుంబ సభ్యులు, సామాజిక కార్యకర్తలు సైతం పాల్గొన్నారు. తమకు బెదిరింపులు వస్తున్నాయని, పటిష్ట భద్రత కలి్పంచాలని బాధితురాలు ప్రభుత్వాన్ని కోరారు. తన భర్తను ఉద్యోగం నుంచి తొలగించారని, ఇప్పుడు ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి ఆదుకోవాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి విన్నవించారు. అత్యాచారం కేసులో దోషిగా తేలిన వ్యక్తికి శిక్ష తగ్గించడం ఏమిటని నిరసనకారులు ప్రశ్నించారు. ఢిల్లీ హైకోర్టు తీర్పు అసంతృప్తి కలిగించిందని అన్నారు. సుప్రీంకోర్టుపై తమకు విశ్వాసం ఉందని, తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు బాధితురాలి తల్లి పేర్కొన్నారు. తమ బంధువులపై దాడి చేశారని, తప్పుడు కేసులు పెట్టారని, జైలుపాలు చేశారని తెలిపారు. వారిని విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా, బాధితురాలి ధర్నాకు అఖిలభారత ప్రగతిశీల మహిళా సంఘం, అఖిలభారత విద్యార్థి సంఘం మద్దతు ప్రకటించాయి. -
మహిళ మృతితో ఆస్పత్రి ఎదుట ఆందోళన
ధవళేశ్వరం: ప్రసవానంతరం ఓ మహిళ మృతి చెందడంతో ఆస్పత్రి ఎదుట స్థానికులు ఆందోళన చేపట్టారు. రాజకీయ పార్టీల నేతలతో జరిగిన చర్చల్లో నష్టపరిహారం చెల్లించేందుకు ఆస్పత్రి యాజమాన్యం అంగీకరించడంతో ఆందోళన విరమించారు. స్థానిక ఎర్రకొండ ప్రాంతానికి చెందిన గూటాల హేమలత(22) ప్రసవం కోసం శుక్రవారం ధవళేశ్వరం సీఈఎం ఆస్పత్రిలో చేరింది. ఆమె శనివారం సాయంత్రం మగపిల్లవాడిని ప్రసవించింది. కొంతసేపటి తరువాత పల్స్ డౌన్ అయ్యిందని, ఆమెను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సీఈఎం ఆస్పత్రి వైద్యులు హేమలతను అంబులెన్స్‌లో పంపారు. అప్పటికే హేమలత మృతి చెంది సుమారు గంట అయ్యి ఉంటుందని అక్కడి వైద్యులు చెప్పడంతో బంధువులు మృతదేహంతో ధవళేశ్వరం సీఈఎం ఆస్పత్రి ఎదుట శనివారం రాత్రి ఆందోళన చేపట్టారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి నక్కా రాజబాబు, నియోజకవర్గ కో–ఆర్డినేటర్ గిరజాల బాబు, సీపీఎం నాయకులు కర్రి రామకృష్ణ, ఎన్.భీమేశ్వరరావు, ఎస్ఎస్ మూర్తి, సీపీఐ నాయకులు కిర్ల కృష్ణ, టీడీపీ నాయకులు ఇళ్ల రాంబాబు, దుర్గారావు, బత్తిన ఏడుకొండలు, నాళ్ళ రమేష్, డీఎస్పీ నారాయణరావు, సీఐ కృపానందం తదితరులు పలు దఫాలు ఆస్పత్రి యాజమాన్యంతో చర్చలు జరిపారు. ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే తన భార్య మృతి చెందిందని రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబానికి రూ.2లక్షలు ఇవ్వడానికి ఆసుపత్రి యాజమాన్యం అంగీకరించడంతో ఆదివారం మధ్యాహ్నం ఆందోళనను విరమించారు. -
మహిళ మృతితో ఆస్పత్రి ఎదుట ఆందోళన
ధవళేశ్వరం: ప్రసవానంతరం ఓ మహిళ మృతి చెందడంతో ఆస్పత్రి ఎదుట స్థానికులు ఆందోళన చేపట్టారు. రాజకీయ పార్టీల నేతలతో జరిగిన చర్చల్లో నష్టపరిహారం చెల్లించేందుకు ఆస్పత్రి యాజమాన్యం అంగీకరించడంతో ఆందోళన విరమించారు. స్థానిక ఎర్రకొండ ప్రాంతానికి చెందిన గూటాల హేమలత(22) ప్రసవం కోసం శుక్రవారం ధవళేశ్వరం సీఈఎం ఆస్పత్రిలో చేరింది. ఆమె శనివారం సాయంత్రం మగపిల్లవాడిని ప్రసవించింది. కొంతసేపటి తరువాత పల్స్ డౌన్ అయ్యిందని, ఆమెను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సీఈఎం ఆస్పత్రి వైద్యులు హేమలతను అంబులెన్స్‌లో పంపారు. అప్పటికే హేమలత మృతి చెంది సుమారు గంట అయ్యి ఉంటుందని అక్కడి వైద్యులు చెప్పడంతో బంధువులు మృతదేహంతో ధవళేశ్వరం సీఈఎం ఆస్పత్రి ఎదుట శనివారం రాత్రి ఆందోళన చేపట్టారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి నక్కా రాజబాబు, నియోజకవర్గ కో–ఆర్డినేటర్ గిరజాల బాబు, సీపీఎం నాయకులు కర్రి రామకృష్ణ, ఎన్.భీమేశ్వరరావు, ఎస్ఎస్ మూర్తి, సీపీఐ నాయకులు కిర్ల కృష్ణ, టీడీపీ నాయకులు ఇళ్ల రాంబాబు, దుర్గారావు, బత్తిన ఏడుకొండలు, నాళ్ళ రమేష్, డీఎస్పీ నారాయణరావు, సీఐ కృపానందం తదితరులు పలు దఫాలు ఆస్పత్రి యాజమాన్యంతో చర్చలు జరిపారు. ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే తన భార్య మృతి చెందిందని రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబానికి రూ.2లక్షలు ఇవ్వడానికి ఆసుపత్రి యాజమాన్యం అంగీకరించడంతో ఆదివారం మధ్యాహ్నం ఆందోళనను విరమించారు.


