ఒప్పొ నుంచి ‘ఎఫ్1 ప్లస్’ స్మార్ట్ ఫోన్
న్యూఢిల్లీ: చైనా మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ఒప్పొ తాజాగా తన ‘ఎఫ్ సిరీస్’లోనే ‘ఎఫ్1 ప్లస్’ అనే మరొక కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.26,990. ఇందులో 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 13 ఎంపీ రియర్ కెమెరా, 4జీ, 5.5 అంగుళాల తెర, 2,850 ఎంఏహెచ్ బ్యాటరీ, 2 గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమరీ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్స్ ఏప్రిల్ రెండో వారం నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఒప్పొ తాజాగా నోయిడాలో తయారీ ప్లాంటును ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీనికి రూ.100 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నది.