breaking news
ex-showroom rate
-
ఆటోల ధరలు ఖరారు.. ఎక్కువకు విక్రయించకుండా చర్యలు
సాక్షి, సిటీబ్యూరో: ఆటో రిక్షా ధరలను రవాణాశాఖ ఖరారు చేసింది. ఎల్పీజీ ఆటో రిక్షా ధరను రూ.2.70 లక్షలుగా, సీఎన్జీ ఆటో రిక్షా ధరను రూ.2.80 లక్షలుగా నిర్ణయించింది. నిర్ణయించిన ధరల కంటే ఎక్కువకు విక్రయించకుండా అధికారులు చర్యలు చేపట్టారు. గతంలో ఫైనాన్షియర్లు, కన్సల్టెంట్లు కుమ్మక్కై అడ్డగోలుగా ధరలు పెంచినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈసారి అలాంటి బ్లాక్ మార్కెటింగ్‌కు అవకాశం లేకుండా నియంత్రించింది.ఓఆర్ఆర్ పరిధిలో నడిపేందుకు వీలుగా సుమారు 65 వేల ఆటో పర్మిట్లకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. వీటిలో 20 వేల ఎలక్ట్రిక్ ఆటోలు కాగా, మరో 20వేల ఎల్పీజీ, సీఎన్జీ ఆటోలకు సైతం అనుమతినిచ్చారు. ఇప్పటికే సీఎన్జీ లేదా ఎల్పీజీతో నడుస్తున్న సుమారు 25 వేల ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చుకొనేందుకు అవకాశం కల్పించారు. 20 వేల ఆటోలకు ప్రొసీడింగ్‌లు.. అర్హులైన ఆటోడ్రైవర్లు దరఖాస్తు చేసుకొనేందుకు షోరూమ్‌లలోనే ప్రత్యేక వెసులుబాటు కల్పించారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న డ్రైవర్ల వివరాలను పరిశీలించి కొత్త ఆటోలు కొనుగోలు చేసేందుకు ప్రొసీడింగ్‌లు (అనుమతులను) ఇచ్చారు. ఇప్పటి వరకు సుమారు 20 వేల ఆటోరిక్షాలకు అనుమతులను ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. రంగంలోకి కన్సల్టెంట్లు... ఎల్పీజీ, సీఎన్జీ ఆటోలకు ప్రొసీడింగ్ల ప్రక్రియ ముగింపు దశకు చేరడంతో ఫైనాన్షియర్లు, కన్సల్టెంట్లు రంగంలోకి దిగారు. అక్రమార్జనకు తెరలేపారు. షోరూమ్‌లలో ధరలను ఖరారు చేసినట్లుగా ఫైనాన్షియర్ల అక్రమాలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఆటోరిక్షా విక్రయాల్లో ఫైనాన్షియర్లు, కన్సల్టెంట్ల మోసాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. -
రూ.లక్షకే చేతక్ స్కూటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీలో ఉన్న బజాజ్ చేతక్ తాజాగా 2901 మోడల్‌ను ప్రవేశపెట్టింది. హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో ధర రూ.99,998 ఉంది. కంపెనీ ఆఫర్ చేస్తున్న మోడళ్లలో ఇదే తక్కువ ధర కలిగింది. చేతక్ అర్బేన్ ధర రూ.1,23,319 కాగా, చేతక్ ప్రీమియం రూ.1,47,243 ఉంది. 2901 మోడల్ స్కూటర్ ఒకసారి చార్జింగ్‌తో 123 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. 2.88 కిలోవాట్ అవర్ బ్యాటరీ పొందుపరిచారు. టాప్ స్పీడ్ గంటకు 63 కిలోమీటర్లు. స్టీల్ బాడీతో తయారైంది. చార్జింగ్కు 6 గంటలు తీసుకుంటుంది. రూ.3 వేలు చెల్లించి టెక్‌ప్యాక్ సబ్‌్రస్కిప్షన్ తీసుకుంటే హిల్ హోల్డ్ అసిస్ట్, రివర్స్ మోడ్, యాప్ కనెక్టివిటీ, కాల్ మేనేజ్మెంట్, మ్యూజిక్ కంట్రోల్, జియో–ఫెన్సింగ్ ఫీచర్లు అదనంగా చేరతాయి. -
మోటారు వాహనాల చట్ట సవరణ అమలులోకి.. పెరగనున్న లైఫ్ టాక్స్
సాక్షి, హైదరాబాద్: ఇక నుంచి వాహనాల ఎక్స్‌షోరూమ్ ధరల మీదనే జీవిత పన్ను విధిస్తారు. ఇంతకాలం వాహనం కొనుగోలుపై షోరూమ్ నిర్వాహకులు ఇచ్చే డిస్కౌంట్ పోను, మిగతా మొత్తం మీద మాత్రమే పన్ను విధించేవారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసిన మోటారు వాహనాల చట్ట సవరణ ఇప్పుడు అమలులోకి వచ్చింది. చట్ట సవరణ బిల్లుకు గత నెల చివరలో గవర్నర్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చట్టం అమలుకు వీలుగా ప్రభుత్వం గెజిట్ విడదుల చేసి, అమలు ప్రారంభించింది. మార్చికి ముందు కారుకొన్నా.. ఏప్రిల్‌లో రిజిస్ట్రేషన్ చేస్తే కొత్త విధానమే.. చట్ట సవరణ నేపథ్యంలో అమలుపై రవాణాశాఖ స్పష్టతనిచ్చింది. కారు ఏప్రిల్‌కు ముందు కొన్నా, రిజిస్ట్రేషన్ ఇప్పుడు జరిగితే, కొత్త విధానమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ కొత్త విధానం అమలులోకి రావటానికి ముందు గత నెలలో కార్లు కొన్నవాళ్లు చాలామంది ఇంకా రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే కారు కొన్నందున తమకు కొత్త విధానం వర్తించదన్న ధీమాతో ఉన్నారు. కానీ, కారు ఎప్పుడు కొన్నా.. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే కొత్త విధానమే వర్తిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. పెరగనున్న పన్ను.. ధర ఎక్కువ కార్లపైనే ఈ కొత్త విధానం ప్రభావం ఉండనుంది. కారు కొన్నప్పుడు ఎక్స్‌షోరూం ధరపైన షోరూం నిర్వాహకులు డిస్కౌంట్ ఇవ్వటం సహజమే. ధర ఎక్కువగా ఉండే కార్లపై ఈ మొత్తం ఎక్కువగా ఉంటుంది. ఈ డిస్కౌంట్‌ను సాకుగా చూపి చాలామంది కొంతమేర పన్ను ఎగవేస్తున్నారు. ఇప్పుడు దానికి అవకాశం లేదు. రూ.5 లక్షల ధర ఉన్న కార్లపై 13 శాతం, రూ.5 లక్షలు దాటి రూ.10 లక్షల లోపు ఉండే కార్లపై 14 శాతం, రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉండే కార్లపై 17 శాతం, రూ.20 లక్షలకంటే ఎక్కువ ధర ఉండే కార్లపై 18 శాతం చొప్పున జీవిత పన్నును సవరిస్తూ గతేడాది రవాణాశాఖ ఉత్తర్వు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజా సవరణ ప్రకారం.. డిస్కౌంట్ మొత్తం మినహాయించక ముందు ఉండే ఎక్స్‌షోరూం ధరలపై పైన పేర్కొన్న నిర్ధారిత శాతంలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వ్యక్తుల పేరు మీద కాకుండా సంస్థలు, కంపెనీల పేరుతో ఉండే కార్లపై అదనంగా రెండు శాతం, రెండో కారు తీసుకునేవారు అదనంగా 2 శాతం చెల్లించాల్సి ఉంటుంది. -
‘ఎక్స్ట్రా’ షోరూంలకు తాళం
♦ కొరడా ఝుళిపిస్తున్న రవాణా శాఖ ♦ అదనపు చార్జీలకు ముకుతాడు సాక్షి, హైదరాబాద్: డీలర్లు కంపెనీ పేర్కొన్న ఎక్స్‌షోరూం రేటు కన్నా ఎక్కువ ధరలకు వాహనాలు విక్రయిస్తుండటాన్ని రవాణా శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. వాహన షోరూంలు నిబంధనలకు విరుద్ధంగా హ్యాండ్లింగ్ చార్జీ పేర రూ.8 వేలు, ఫెసిలిటేషన్ చార్జీ కింద 1,900, లాజిస్టిక్ పేరు తో రూ.800 అదనంగా వసూలు చేస్తున్నాయి. అవేంటని షోరూం నిర్వాహకులను అడిగితే... కంపెనీ నుంచి షోరూం వరకు కారు తేవటానికి అయ్యే ఖర్చని అంటున్నారు. దీనిపై కొనుగోలుదారులకు అవగాహన లేక డీలర్లు వారి జేబుకు చిల్లు పెడుతున్నారు. ఈ వ్యవహారంపై ఇంతకాలం కళ్లుమూసుకున్న రవాణా అధికారులు ఇప్పు డు డీలర్లపై కొరడా ఝుళిపిస్తున్నారు. హైదరాబాద్‌లోని 4 షోరూంలపై ఇలాంటి ఫిర్యాదులు అందడంతో అధికారులు వాటికి తాళాలు వేసి వాహనాల అమ్మకంపై ఆంక్షలు విధిం చారు. పక్షం రోజుల పాటు కార్యకలాపాలు సాగకుండా చర్యలు తీ సుకున్నారు. కార్లు గానీ ద్విచక్రవాహనాలు గానీ ఏ ధరకు అమ్మాలో తయారీ కంపెనీ ఖరారు చేసిన ధరకే డీలర్లు విక్రయించాలి. ఈ విష యం నిబంధనల్లో స్పష్టంగా ఉంది. కానీ చాలామంది డీలర్లు కంపెనీలు రకరకాల పేర్లతో ఎక్కువ రుసుములను బిల్లుల్లో చేరుస్తున్నారు. ఇటీవల ఢిల్లీ హైకోర్టు సహా మరికొన్ని న్యాయస్థానాలు ఈ వసూళ్లపై స్పందించడంతో రాష్ట్ర రవాణాశాఖ అధికారులు కళ్లుతెరిచారు. కంపెనీలతో చర్చించి అసలు ధరలెలా ఉండాలో తెలుసుకుని ప్రత్యక్ష చర్యలకు దిగారు.