breaking news
employee dies
-
ఉన్నతాధికారుల ఒత్తిళ్లతో సచివాలయ ఉద్యోగి మృతి
కడప కార్పొరేషన్: ఉన్నతాధికారుల ఒత్తిళ్లకు సచివాలయంలో పనిచేసే హెల్త్ సెక్రటరీ బలయ్యారు. వైఎస్సార్ జిల్లా కడప నగరం 27/2 గౌస్ నగర్ సచివాలయంలో పనిచేస్తున్న జి.విజయకుమారి (42) అకస్మాత్తుగా మృతి చెందారు. వివరాల్లోకి వెళితే... ఈ నెల 17న మధ్యాహ్నం పాత కడప యూపీహెచ్‌సీలో విజయకుమారి విధి నిర్వహణలో ఉన్నప్పుడు... ఉన్నతాధికారులు ఫోన్ చేసి సర్వేలు ఎందుకు చేయలేదు.., పై నుంచి చాలా ఒత్తిడి ఉంది.., తప్పకుండా ఆ సర్వేలు చేయాల్సిందేనని.. ఫోన్లో గట్టిగా మాట్లాడినట్లు సమాచారం. పండుగ సమయంలో విధి నిర్వహణలో ఉన్నా ఉన్నతాధికారులు గట్టిగా మాట్లాడడంతో ఆమె ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది.అప్పటికే ఆమెకు శ్వాస సమస్య ఉండడంతో ఇంటికి వచ్చాక తలనొప్పిగా ఉందని, మోషన్స్ అవుతున్నాయని కుమార్తెతో చెప్పినట్లు తెలిసింది. ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఊపిరి ఆడడం లేదని చెప్తూ కళ్లు మూసుకుని అలాగే ఒరిగిపోయిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆమెకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. తమ తల్లి మరణించడానికి అధికారుల ఒత్తిళ్లే కారణమని వారు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘ నాయకులు ఆమె నివాసానికి చేరుకుని విజయకుమారి మృతదేహానికి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారుల ఒత్తిడి భరించలేక గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఒక సచివాలయానికి 8 మంది కార్యదర్శులు, 20 మంది వలంటీర్లు ఉండేవారని, ఇప్పుడు ఐదారు మంది మాత్రమే ఉన్నారని, వలంటీర్లు చేసే పని వారిపైనే పడిందన్నారు. దీనివల్ల తీవ్ర ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తోందని తెలిపారు. విజయకుమారి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
గుండెపోటుతో సచివాలయ ఉద్యోగి మృతి
ఆరిలోవ (విశాఖ): విశాఖలోని ఆరిలోవ ప్రాంతంలో విధుల్లో ఉన్న సచివాలయ ఉద్యోగి గుండెపోటుతో మంగళవారం ఆకస్మికంగా మృతి చెందారు. సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. జీవీఎంసీ 13వ వార్డు పరిధి ఆరిలోవ కాలనీలోని 9వ నంబర్ సచివాలయంలో సుంకర ఉదయ్‌కుమార్(40) టౌన్ ప్లానింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. సింహాచలం ప్రాంతానికి చెందిన ఆయన మంగళవారం ఉదయం విధులకు హాజరయ్యారు. ప్రత్యక్ష విధులతో పాటు తూర్పు జోన్ జెడ్సీ శివప్రసాద్ నిర్వహించిన కాన్ఫరెన్స్ కాల్లో పాల్గొన్నారు.సంక్రాంతి మూడు రోజుల అనంతరం ఈ నెల 17న అందరూ తప్పనిసరిగా విధులకు హాజరుకావాలని కలెక్టర్ సూచించినట్టు జెడ్సీ శివప్రసాద్ తెలిపారు. అప్పగించిన పని తప్పకుడా చేయాల్సిందేనని, సరిగా పనిచేయనివారి గురించి క్లస్టర్ల వారీగా రిపోర్టు తీసుకొని చర్యలు చేపడతామని హెచ్చరిచారు. ఆ ఫోన్ కాల్ కాన్ఫరెన్స్ ముగిసిన వెంటనే ఆరిలోవ ప్రాంతంలో జెడ్సీ శివప్రసాద్ పర్యటనకు వస్తారని తెలిసి తోటి సిబ్బందితో కలసి ఆయన ముడసర్లోవ పార్కు సమీపంలో నిరీక్షిస్తున్న ఉదయ్‌కుమార్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.తోటి సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు గండెపోటుతో మృతి చెందినట్టు నిర్ధారించారు. దీంతో సిబ్బంది కన్నీటిపర్యంతమయ్యారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్దకు చేరుకుని బోరున విలపించారు. సంక్రాంతి జరుపుకోవాల్సిన ఇంట్లో విషాదం నింపావంటూ కుటుంబ సభ్యులు రోదన వర్ణనాతీతం.పని ఒత్తిడే కారణంఉదయ్కుమార్ గుండెపోటుతో మృతి చెందడానికి చంద్రబాబు ప్రభుత్వం పెడుతున ఒత్తిడే కారణమని తోటి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఊపిరి తీసుకోలేనంతగా పని ఒత్తిడి పెంచారని వాపోయారు. బీపీఎల్, ఎల్ఆర్ఎస్, మాస్టర్ ప్లాన్ రోడ్లు, టౌన్ ప్లానింగ్ స్కీం వంటి పనులతో నిత్యం ఒత్తిడి ఉంటోందని చెప్పారు. దీంతోపాటు సచివాలయం సర్వేలు, ఎన్నికల వర్క్, సెలవు రోజుల్లో కూడా ఉదయం నుంచి రాత్రి వరకు అధికారుల ఫోన్ కాన్ఫరెన్స్‌లు, అన్నీ పనులకూ ఒకేసారి టార్గెట్ ఇచ్చి సమయానికి పూర్తిచేయాలని, లేదంటే మెమోలు ఇవ్వడం చేస్తున్నారని తోటి సిబ్బంది వాపోయారు. -
ఆయుష్షు పోయింది
► గుండె జబ్బుతో మృతి చెందిన చిరుద్యోగి ► చికిత్సకెళ్లి హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వస్తుండగా ఘటన ► ప్రతి క్షణం మానసిక వేదన అనుభవించిన తీరు ► ఐదు నెలలుగా ‘ఆయుష్’లో జీతాల్లేని వైనం ► ఉద్యోగులను వెంటాడుతున్న ఆర్థిక సమస్యలు పెద్దపెద్ద సార్లు ఒక నెల జీతం ఆలస్యమైతే విలవిల్లాడిపోతారు. అలాంటిది ఐదు నెలలుగా వేతనాల్లేవు.. పైగా ఉద్యోగ భద్రత లేదు. దానికి అనారోగ్యమూ తోడైంది. నిత్యం ఆర్థిక ఇబ్బందులు. వృద్ధాప్యంలోని తల్లిదండ్రులకు పెద్ద దిక్కుగా ఉన్న ఆమె మానసిక వేదన అంతా ఇంతా కాదు. ఇదే సమయంలో గుండెజబ్బు రావడంతో ఆపరేషన్ కోసం బంధువులు సాయం చేశారు. ఆ తర్వాత మందులు, ఇతరత్రా వాటికి నానా అవస్థలు పడాల్సి వచ్చింది. ఎలాగోలా అప్పు చేసి చికిత్స కోసం హైదరాబాద్‌కు వెళ్లిన ఆమె.. స్వగ్రామానికి తిరిగొస్తుండగా మార్గంమధ్యలో మృత్యు ఒడికి చేరింది. ఆమె మరణం చెబుతున్న గుణ‘పాఠం’ ఒక్కటే. జీతంతో ముడిపడిన నిరుపేద జీవితాలకు నెలనెలా సక్రమంగా వేతనాలివ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించి అండగా నిలవాలని. ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరవకుంటే ఉద్యోగుల ‘ఆయుష్షు’ తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఆత్మకూరు మండలం పి.యాలేరుకు చెందిన నిర్మలది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు రజినమ్మ, తిప్పారెడ్డి దంపతులకు ఒక్కతే కుమార్తె. ఆమె సంపాదనతోనే కుటుంబం గడపాల్సిన దుస్థితి. పెళ్లి చేసుకుని వెళ్లిపోతే వృద్ధాప్యంలోని అమ్మానాన్నకు దిక్కెవరని భావించిన నిర్మల పెళ్లి కూడా చేసుకోలేదు. ఇల్లరికం కోసం అడిగితే వీరి పేదరికాన్ని చూసి ఎవరూ ముందుకు రాలేదు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్(ఎన్ఆర్హెచ్ఎం)లో ఏడేళ్ల క్రితం ఎస్ఎన్ఓ(స్వీపర్ కం నర్సింగ్ ఆర్డర్లీ)గా కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగం రావడంతో ఇక జీవితానికి ఢోకా ఉండదని భావించింది. కుందుర్పి ప్రభుత్వ హోమియో వైద్యశాలలో పని చేస్తుండేది. ఉద్యోగం వచ్చిన మాటే గానీ.. ఉద్యోగం వచ్చిందన్న మాటే గానీ సకాలంలో వేతనాలు అందక ఆర్థికపరమైన ఇబ్బందులు ఎక్కువయ్యాయి. దీనికి తోడు ఏటా ఉద్యోగానికి రెన్యూవల్ కష్టాలు వెంటాడేది. ఇదే సమయంలో తల్లిదండ్రులిద్దరూ అనారోగ్యం పాలయ్యారు. మెరుగైన వైద్యం చేయించే స్థోమత లేకపోయింది. అయినా కష్టాలను దిగమింగి ఉన్న కాడికి చూపించేది. ఈ క్రమంలో నిర్మల కూడా అనారోగ్యం పాలైంది. తీవ్ర మానసిక ఒత్తిడికి గురవడంతో గుండెజబ్బు వచ్చింది. దాతల ఔదార్యంతో... ఆపరేషన్ చేయించుకునేందుకు ఆర్థిక ఇబ్బందులు రావడంతో బంధువులు, తెలిసిన వాళ్లు సాయం చేశారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకుంది. రెండ్రోజుల కిందట ఆరోగ్యం బాగాలేక, బస్సులో వెళ్లే పరిస్థితి లేకపోయింది. బంధువులతో కలసి హైదరాబాద్‌కు ఓ ప్రైవేట్ వాహనంలో వెళ్లింది. ఈ సమయంలో అక్కడ వీరు వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తు ఏమీ కాలేదు. వాహనం దెబ్బతింది. అనంతరం ఆస్పత్రికి వెళ్లి వైద్యులకు చూపించగా ఆరోగ్యం బాగానే ఉందని చెప్పడంతో శుక్రవారం రాత్రి మరో వాహనంలో తిరుగుపయనమైంది. శనివారం తెల్లవారుజామున పంపనూరు వద్దకు రాగానే నీళ్లు కావాలని అడగ్గా, తోడుగా ఉన్న మేనత్త వాహనం ఆపి నీళ్లిచ్చింది. ఆ తర్వాత కాసేపటికే నిర్మల కన్నుమూసింది. కొన్నాళ్లూగా మానసిక ఒత్తిడికి గురవడంతోనే జబ్బు చేసిందని, ఈ క్రమంలోనే ఇంతటి ఘోరం జరిగిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికంగా కూడా సుమారు రూ.1.20 లక్షల వరకు అప్పు చేసిందని, దాన్ని ఎలా తీర్చాలి, తల్లిదండ్రులను ఎలా పోషించాలని తరచూ ఆలోచించేదని తెలిపారు. నిర్మల(41) మృతి విషయం తెలియగానే ‘ఆయుష్’ సబ్ కంట్రోలింగ్ ఆఫీసర్ పాటిల్ ప్రభాకర్, ఆయుష్ డిపార్ట్మెంట్ ఆఫ్ యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ ఈశ్వరయ్య, ఉపాధ్యక్షుడు మహేశ్, జాయింట్ సెక్రటరీ సునీల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రషీద్ తదితరులు పి.యాలేరుకు వెళ్లి ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. భరోసా లేని జీవితాలు ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఎవరికైనా కొండంత ధైర్యం వస్తుంది. కానీ ‘ఆయుష్’ ఉద్యోగుల పరిస్థితి మాత్రం ఇందుకు బిన్నం. కొన్నాళ్లుగా ‘ఆయుష్’లో జరుగుతున్న పరిణామాలతో ఆ శాఖలోని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగ భద్రత లేకపోవడంతో భవిష్యత్‌ను తలచుకుని కుమిలిపోతున్నారు. ఈ క్రమంలో వారికి భరోసా ఇచ్చే వారే కరువయ్యారు. జిల్లాలో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్(ఎన్ఆర్హెచ్ఎం) కింద 2008లో మొదటి విడత కింద 22 ఆయుష్ డిస్పెన్సరీలు, 2009లో రెండో విడత కింద 21 డిస్పెన్సరీలను ఏర్పాటు చేశారు. ఇందులో 22 ఆయుర్వేద, 13 హోమియో, 6 యునానీ, రెండు న్యాచురోపతి డిస్పెన్సరీలున్నాయి. ఇవన్నీ వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే నడుస్తున్నాయి. ఆయుష్ వైద్యశాలల్లో మెడికల్ ఆఫీసర్, కాంపౌండర్, స్వీపర్ పోస్టులు ఉంటాయి. ఎన్ఆర్హెచ్ఎం కింద ఉన్న వైద్యశాలల్లో 125 మంది ఉద్యోగులు కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్నారు. గతంలో ఏడాదికి ఒకసారి రెన్యూవల్ జరిగేది. అయితే కొన్ని నెలలుగా మూడు నెలలకు ఒకసారి మాత్రమే రెన్యూవల్ చేస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 30 నాటికి గడువు ముగిసినా రెన్యూవల్ కాలేదు. దీంతో ఉద్యోగులు ఆందోళన చెందారు. ఆ తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ వరకు రెన్యూవల్ చేశారు. అయితే ప్రస్తుతం ఉద్యోగులు రెన్యూవల్‌కు నోచుకోలేదు. ఐదు నెలలుగా వీరితో వెట్టిచాకిరి చేయించుకుంటున్న ప్రభుత్వం, కనీసం జీతం కూడా ఇవ్వడం లేదు. దీంతో చాలా మంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ సమస్యలపై గత నెల 27న అనంతపురంలోని రెండో రోడ్డులో ఉన్న ఆయుర్వేద ఆస్పత్రి వద్ద యూనియన్ నాయకులతో పాటు ఉద్యోగులు ధర్నా చేశారు. అయినా చలనం లేదు. క్షేత్రస్థాయిలో ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉన్నా ఉన్నతాధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. -
ఆనందంతో గుండె ఆగి.. కార్మికుడి మృతి
ఏపీఎస్ ఆర్టీసీ కార్మికులకు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్న విషయం తెలిసి.. ఆనందంతో గుండె ఆగి ఓ కార్మికుడు మరణించాడు. ఈ ఘటన వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో జరిగింది. ఆర్టీసీ కార్మికులకు.. మంత్రివర్గ ఉపసంఘానికి మధ్య జరిగిన చర్చలు సఫలం అయ్యాయని, 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వడం, గత మూడునెలల బకాయిలను దసరా, దీపావళి సమయంలో ఇస్తామనడం, పాత బకాయిలను రిటైర్మెంట్ సమయంలో అందిస్తామని ప్రకటించడంతో పులివెందులకు చెందిన నారాయణ అనే కార్మికుడు ఆనందం పట్టలేకపోయారు. అక్కడికక్కడే గుండె ఆగి మరణించారు.


