breaking news
Emotional Eating
-
స్వీట్స్, చిప్స్, బిర్యానీ... మీ మనసులో ఏముందో చెప్పేస్తాయి!
రోజంతా అలసిపోయిన తర్వాత లేదా ఒత్తిడిలో ఉన్నప్పుడు మీరు ఏదైనా ప్రత్యేకమైన ఆహారం కోసం ఆరాటపడుతున్నారా? అది ఐస్క్రీమ్ కావచ్చు, వేడి వేడి ఫ్రైస్ కావచ్చు లేదా ఇంట్లో వండిన పప్పు అన్నం కావచ్చు. కేవలం రుచి కోసం మాత్రమే కాకుండా, మనసులోని భావోద్వేగాలకు ఉపశమనంగా కంఫర్ట్ ఫుడ్ పనిచేస్తుందని మనస్తత్వవేత్తలు చెబుతున్నారు.తీపి వంటకాలతో ఓదార్పుచాలామంది కష్టకాలంలో చాక్లెట్లు, స్వీట్లు తినడానికి ఇష్టపడతారు. చక్కెర పదార్థాలు మెదడులో తాత్కాలికంగా ‘ఫీల్-గుడ్’ రసాయనాలను విడుదల చేస్తాయి. ఒంటరితనంగా లేదా బాధగా ఉన్నప్పుడు, ఈ తీపి పదార్థాలు మనసుకు ఉపశమనాన్ని ఇస్తాయి. ఇవి మనసుకు అశాంతి నుంచి తాత్కాలిక ఊరటను ప్రసాదిస్తాయి.జ్ఞాపకాలతో ముడిపడిన ఆహారంవేడి సూప్ లేదా తరతరాలుగా వస్తున్న ప్రత్యేక వంటకాలు మనకు భద్రతా భావాన్ని, ఆత్మీయతను అందిస్తాయి. అలాగే, స్పైసీ ఫుడ్ తినేవారిలో ఉత్సాహం కోసం లేదా బోర్ కొట్టినప్పుడు ఏదైనా కొత్తదనం కోసం ఆరాటపడే మనస్తత్వం ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఒత్తిడిలో కరకరలాడే ఆహారంచిప్స్ లేదా పాప్కార్న్ వంటి కరకరలాడే ఆహారాలు తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని కొందరు నమ్ముతారు. నమలడం అనే ప్రక్రియ శారీరక ఉద్రిక్తతను విడుదల చేయడానికి సహాయపడుతుంది. మీ మనసు ఏం కోరుకుంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ప్లేట్లో ఉన్నది కేవలం ఆహారం మాత్రమే కాదు, మీ హృదయపు అలజడి.ఇది కూడా చదవండి: కార్పొరేట్ ఒత్తిడికి బై బై.. ఆటో డ్రైవింగ్తో లైఫ్ హ్యాపీ! -
ఎమోషనల్ ఈటింగ్ డేంజరే!
కొంతమంది కోపంలో ఉన్నా, సంతోషంగా ఉన్నా, తోచకపోయినా తింటూ ఉంటారు. అది చాలా డేంజర్. అలాంటి వారి కోసం..కంపెనీ కోసమో, టైం పాస్ కోసమో తినే అలవాటును వెంటనే మానుకోవాలి. ఆకలి ఉన్నప్పుడు మాత్రమే తినే అలవాటు చేసుకుంటే జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనారోగ్యాలను నివారించవచ్చు. భోజనం చేసిన తరువాత (లంచ్) అది పూర్తిగా జీర్ణం కావడానికి మూడు నుంచి ఆరు గంటల సమయం పడుతుంది. అంటే కాయగూరలు, మాంసాహారం, ఆయిలీ ఫుడ్... ఇలా తీసుకున్న ఆహారాన్ని బట్టి సమయం ఆధారపడి ఉంటుంది. ఓవర్ ఈటింగ్ మంచిది కాదు. పొట్టను మూడు వంతుల వరకే నింపాలి. బుక్ లేదా పేపర్ చదువుతూ, టీవీ చూస్తూ, మరేదో పని చేసుకుంటూ తినే అలవాటు మానేయాలి. ప్రశాంతంగా కూర్చుని భోజనం మీదే మనసు కేంద్రీకరించి తినడాన్ని అలవాటు చేసుకోవాలి. భోజనం పూర్తయిన తరవాత ఐదు నుంచి పది నిమిషాల పాటు కూర్చుని సుమారు వంద అడుగులు నెమ్మదిగా నడవాలి. రాత్రి భోజనం మరీ పొద్దుపోయిన తరవాత చేయకూడదు. భోజనానికి పడుకోవడానికి మధ్య విరామం తప్పనిసరి.


