breaking news
Emegency Landing
-
ఢిల్లీ: విశాఖ ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
న్యూఢిల్లీ: విశాఖపట్నం నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వస్తున్న ఇండిగో విమానంలో కలకలం చెలరేగింది. దీంతో ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. శనివారం ఉదయం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ విమానం అత్యవసరంగా ల్యాండ్ కావడంతో రన్వే వద్ద కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. అయితే పైలట్లు, అధికారుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది.అసలేం జరిగింది?విశాఖపట్నం నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు సమాచారం. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాలని పైలట్లు ఏటీసీ (ఐటీసీ)ని కోరారు. ఈ క్రమంలో శనివారం ఉదయం 10:53 గంటలకు అగ్నిమాపక విభాగానికి అత్యవసర సందేశం అందింది. విమానం ల్యాండ్ అయ్యే సమయానికి అగ్నిమాపక దళాలు సిద్ధంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. సమాచారం అందిన వెంటనే విమానాశ్రయ సిబ్బంది కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. విమానం ఎటువంటి నష్టం లేకుండా సురక్షితంగా ల్యాండ్ అయింది.కాగా విమానంలోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు, అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. అగ్నిమాపక విభాగం, ఎయిర్పోర్టు అత్యవసర బృందాలు నిమిషాల వ్యవధిలో స్పందించి ల్యాండింగ్ ప్రక్రియను పర్యవేక్షించాయి. విమానానికి కూడా ఎటువంటి నష్టం వాటిల్లలేదని, కేవలం ముందుజాగ్రత్త చర్యగానే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశామని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. -
ఎయిర్ ఇండియా ఫ్లయిట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
భోపాల్: ఎయిర్ ఇండియాకు చెందిన విమానం భోపాల్ లోని రాజాభోజ్ ఎయిర్ పోర్టు లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఢిల్లీ నుంచి కోచికు మంగళవారం ఉదయం బయలుదేరిన ఈ విమానం లో సాంకేతిక లోపం తలెత్తడమే ల్యాండింగ్ కు కారణమని అధికారులు తెలిపారు. విమానంలోని ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నట్లు వివరించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


