Eco - Park
-
హైదరాబాద్‌లో ఎకో టౌన్!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఎకో టౌన్ ఏర్పాటు, అలాగే సర్క్యులర్ ఎకానమీ, వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్, పర్యావరణ పునరుద్ధరణ వంటి రంగాల్లో సహకారం కోసం ప్రముఖ జపనీస్ ఎకో టౌన్ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్ఓఐ) రూపంలో ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకుంది.ఈఎక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, పీ9 ఎల్ఎల్సీ, నిప్పన్ స్టీల్ ఇంజనీరింగ్, న్యూ కెమికల్ ట్రేడింగ్, అమిటా హోల్డింగ్స్ వంటి కంపెనీలు వీటిల్లో ఉన్నాయి. సీఎం ఎ.రేవంత్‌రెడ్డి నేతృత్వంలో జపాన్ పర్యటనకు వెళ్లిన తెలంగాణ రైజింగ్ బృందం ఆదివారం అక్కడి కిటాక్యుషు నగరాన్ని సందర్శించి ఈ మేరకు పలు కీలక ఒప్పందాలు చేసుకుంది. హైదరాబాద్, కిటాక్యుషు నగరాల మధ్య బలమైన బంధానికి ఈ ఒప్పందాలు నిదర్శనమని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు.రెండు నగరాల మధ్య పరస్పర సహకారం కోసం మేయర్ కజుషియా టేకుచి ఆలోచన మేరకు ‘సిస్టర్ సిటీ’ఒప్పందం చేసే అంశాన్ని తప్పనిసరిగా పరిశీలిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. సత్వర అభివృద్ధి, ఉద్యోగాల కల్పన, సంపద సృష్టి, పర్యావరణ పరిరక్షణ పట్ల తామే నిబద్ధతతో పనిచేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో ఎకో టౌన్ ఏర్పాటుకు కలిసి పనిచేయనుండడంపై ఆనందం వ్యక్తం చేశారు. నగరాలు, సమాజాల మధ్య వారధి కోసం.. ‘రెండు నగరాలు, సమాజాల మధ్య వారధి నిర్మించడానికి మనం చేతులు కలిపాం. ఇది భవిష్యత్తు తరాలకు ప్రయోజనకరం. స్వచ్ఛత, పచ్చదనం, సుస్థిరత, సర్క్యులర్ ఎకనామీ మన ఉమ్మడి లక్ష్యాలు. చిత్తశుద్ధితో చేసే ఆవిష్కరణలతో ఏం సాధించగలమో మీ పర్యావరణహిత నగరం చూస్తే అర్థం అవుతోంది. హైదరాబాద్ నగరంలో సున్నా స్థాయి కర్బన ఉద్గారాల (నెట్ జీరో)తో ఫ్యూచర్ సిటీని ఇదే తరహాలో నిర్మించాలని కోరుకుంటున్నా..’అని సీఎం తెలిపారు. గ్రీన్ ఇన్ఫ్రా ప్రాజెక్టులకు సహకారం అందించాలని కోరారు. మెట్రో రైలు, ఫ్యూచర్ సిటీ, ఆర్ఆర్ఆర్, రేడియల్ రోడ్లు, మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. విమాన సేవలు ప్రారంభించాలి హైదరాబాద్–కిటాక్యుషు నగరాల మధ్య నేరుగా విమాన సేవలను ప్రారంభించాలని అక్కడి మేయర్ చేసిన విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. జపనీస్ భాష పాఠశాలను హైదారాబద్‌లో స్థాపించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. నైపుణ్యం కలిగిన యువతను తమకు అందించాలని, అక్కడి మేయర్ కోరడంతో సీఎం ఈ మేరకు సూచన చేశారు. మా వద్ద నైపుణ్యం కలిగిన వారు ఉన్నారు. వారికి జపనీస్ భాష నేర్పిస్తే మీ అవసరాలు తీరుతాయి..’అని చెప్పారు. రెండు పక్షాల మధ్య జరిగిన ఒప్పందాలను నిర్దిష్ట గడువుల్లోగా అమలు చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై నిరంతరం చర్చించాలని, సంప్రదింపులతో పురోగతి సాధించాలని నిర్ణయం తీసుకున్నారు. కలిసి పనిచేస్తాం: కిటాక్యుషు మేయర్ రేవంత్ బృందం అంతకుముందు ఓసిన్–ఓసాకా ప్రాంతం నుంచి కిటాక్యుషు నగరానికి బుల్లెట్ ట్రైన్లో చేరుకుంది. చారిత్రాత్మక కోకుర క్యాజిల్ వద్ద నగర మేయర్ కజుíÙయా టేకుచి వారికి సాంప్రదాయ స్వాగతం పలికారు. సమురాయ్ ఖడ్గ వీరులు, టైకో డ్రమ్ బృందాల సభ్యులు ఆటపాటలతో ఆలరించారు. ఒకప్పుడు ప్రపంచంలోని అత్యంత కాలుష్యకారక నగరాల్లో ఒకటిగా కిటాక్యుషు ఉంది. అదే ఇప్పుడు అత్యంత స్వచ్ఛమైన నగరాల్లో ఒకటిగా ఉంది. ఈ అంశాన్ని మేయర్ టేకుచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కిటాక్యుషు ప్రభుత్వం ..తెలంగాణ, హైదరాబాద్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. కాగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు వివరించారు. కిటాక్యుషు నగరంలో ఒకప్పుడు అత్యంత కలుíÙతమైన మురాసకి నదిని అత్యంత స్వచ్ఛమైన నదిగా పునరుద్ధరించారు. దీని అధ్యయనంలో భాగంగా సీఎం బృందం ఓ మ్యూజియాన్ని సందర్శించింది. నడక ద్వారా నదీ తీరాన్ని పరిశీలించింది. -
వనంలో మనం
నర్సాపూర్ మెదక్ : జిల్లాలోని అడవుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ధర్మారెడ్డి చెప్పారు. డీఎఫ్ఓ పద్మజారాణి, ఇతర అధికారులతో కలిసి ఆయన నర్సాపూర్ అడవులలో పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌కు చేరువలో ఉన్న అడవులను వివిధ పథకాల కింద సంరక్షించడంతో పాటు అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించనున్నట్లు చెప్పారు. నర్సాపూర్ అడవిలో ఎకో టూరిజం పార్కు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. కాగా అడవిని అభివృద్ధి చేసే పనులలో భాగంగా ఖాళీ ప్రదేశాలలో ఔషధ, ఇతర మొక్కలు నాటి కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని.. అడవి చుట్టూ ఫెన్సింగ్ వేయనున్నారని చెప్పారు. కాగా ఎకో టూరిజం పార్కు కింద నర్సాపూర్ అడవితో పాటు నర్సాపూర్ రాయరావు చెరువును అభివృద్ధి చేసి చెరువులో బోటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. టూరిజం పార్కు కింద ఎంపిక చేసిన అటవీ ప్రాంతంలో ప్రజలకు కనీస వసతులు కల్పించడం, విహార ప్రాంతంగా తీర్చిదిద్దే పనులను ఎక్కడెక్కడ చేపడితే బాగుంటుందో తెలుసుకునేందుకు తాము పర్యటించి పరీశీలించినట్లు ఆయన చెప్పారు. రాయరావు చెరువులో బోటింగ్ ఏర్పాటు చేస్తారని ఆయన చెప్పారు. ఎకో టూరిజం పార్కును అటవీ శాఖ ఏర్పాటు చేస్తున్నప్పటికీ టూరిజం శాఖతో అనుసంధానం చేయనున్నందున ఆ శాఖ సైతం పలు వసతులు కల్పిస్తున్నదని కలెక్టర్ చెప్పారు. రూ.20 కోట్లు మంజూరు నర్సాపూర్ అడవి అభివృద్ధితోపాటు ఎకో టూరిజం పార్కు ఏర్పాటుకు గాను ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసిందని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి చెప్పారు. కాగా జిల్లాలోని వడియారం, మనోహరబాద్, పర్కిబండ అడవులను అభివృద్ధి చేయడంతో పాటు అర్బన్ పార్కులు ఏర్పాటు చేసేందుకు హెచ్ఎండీఏ నిధులు మంజూరు చేసిందని ఆయన చెప్పారు. వడియారం అడవిలోని 170 హెక్టార్లలో అభివృద్ధి చేసేందుకు రూ.4.36 కోట్లు, మనోహరబాద్ అడవిని 725 హెక్టార్లలో అభివృద్ధి చేసేందుకు రూ.3.33 కోట్లు, పర్కిబండ అడవిని 186 హెక్టార్లలో అభివృద్ధి చేసేందుకు రూ.6.14 కోట్లు హెచ్ఎండీఏ మంజూరు చేసిందని ఆయన చెప్పారు. అర్బన్ పార్కులలో పిల్లల ఆట వస్తువులు ఏర్పాటు చేసి పర్యాటకులు సంతోషంగా గడిపేందుకు పార్కులను తీర్దిదిద్దుతారని చెప్పారు. పార్కు ఏర్పాటుకు సంబంధించి ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి పంపనున్నట్లు కలెక్టర్ చెప్పారు. కలెక్టర్ ధర్మారెడ్డి వెంట డీఎఫ్ఓ పద్మజారాణి, ఆర్డీఓ వెంకటేశ్వర్లు, హెచ్ఎండీఏ డీసీఎఫ్ శ్రీలక్ష్మి, స్థానిక ఎఫ్ఆర్ఓ గణేష్ తదితరులు ఉన్నారు. కాగా అడవిలో ఉన్న వాగులు, గుట్టల వివరాలను అటవీ శాఖ అధికారులు కలెక్టర్‌కు వివరించారు. స్థానిక అటవీ శాఖ రేంజ్ ఆధ్వర్యంలో చేపట్టిన హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటే పనులు చేపట్టారు. కలెక్టర్ ధర్మారెడ్డి నర్సాపూర్ అడవులలో పలువురు అధికారులతో పర్యటించిన అనంతరం రాయరావు చెరువు శిఖం వద్ద మొక్క నాటారు. -
జయపురంలో ఎకో పార్క్ ఏర్పాటు
జయపురం: కొరాపుట్ జిల్లా జయపురం సమీపంలో గల నక్కిడొంగర పర్వత ప్రాంతంలో ఎకో–పార్క్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు జయపురం ఎంఎల్ఏ తారాప్రసాద్ బాహిణీపతి, కొరాపుట్ ఫారెస్ట్ డివిజన్ అ«ధికారి తో పాటు పలువురు అటవీ విభాగ అధికారులు జయపురంలోని పూర్ణగఢ్ సమీపంలోగల నట్టిడొంగర పర్వత ప్రాంతంలో మంగళవారం పర్యటించి ఎకో–పార్క్ ఏర్పాటుకు తగిన ప్రాంతం కోసం పరిశీలించారు. ఈ ప్రాంతంలో రెండు కిలో మీటర్ల పరిధిలో ట్రాకింగ్ చేసేందుకు అనువుగా రోడ్డు నిర్మాణం చేపట్టడంతో పాటు సర్వ సాధారణ ప్రజలకోసం వ్యాయామశాల ఏర్పాటు చేయాలని, అలాగే ఉదయం, సాయంత్రం యోగా భ్యాసం చేసేందుకు అనువుగా ఎకో–పార్క్ ఏర్పాటు చేయాలని బావిస్తున్నారు.ఈ విషయమై డీఎçఫ్‌ఓతోను ఇతర అటవీ విభాగ అధికారులతోను ఎంఎల్ఏ తారాప్రసాద్ బాహిణీపతి చర్చలు జరిపి తన అభిప్రాయాలను తెలిపారు . నక్కిడొంగర పర్వత ప్రాం తాంలో ఎకో–పార్క్ ఏర్పాటుతో పాటు దేశ విదేశ పర్యాటకులను ఆకర్షించేందుకు అనువుగా నక్కిడొంగర పర్వత ప్రాంతాన్ని అందంగా తీర్చి దిద్దుతామని ఎంఎల్ఏ తారాప్రసాద్ బాహిణీపతి వెల్లడించారు. దీనిని ఒంక ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దాలన్నది తన అభిప్రాయమని తెలిపారు. -
నగరంలో నందనవనం
=కొత్వాల్‌గూడలో ఎకో పార్కుకు హెచ్ఎండీఏ శ్రీకారం =రూ.60కోట్లతో 85 ఎకరాల్లో ఏర్పాటు సాక్షి, సిటీబ్యూరో: ‘మహా’నగరం శివారులో అందమైన నందనవరం రూపుదిద్దుకుంటోంది. కిక్కిరిసిన నగరవాసులకు ఆహ్లాదాన్ని పంచేందుకు హెచ్ఎండీఏ ‘ఎకో-పార్కు’కు రూపకల్పన చేసింది. శంషాబాద్ సమీపంలోని కోత్వాల్‌గూడ వద్ద ఈ ఉద్యానవనం రూపుదాల్చనుంది. ప్రధానంగా హిమాయత్‌సాగర్ దగ్గరలోని ఔటర్ రింగ్‌రోడ్డుకు ఇరువైపులా ఉన్న 85 ఎకరాల స్థలాన్ని పార్కు కోసం ఎంపిక చేసింది. హిమాయత్‌సాగర్ వైపు 60 ఎకరాల్లోను, దాని ఎదురుగా 25 ఎకరాల్లో పచ్చదనాన్ని అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ విభాగం ప్రణాళికను సిద్ధం చేసింది. తొలిదశకు టెండర్ల ఆహ్వానం సుమారు రూ.60 కోట్ల అంచనా వ్యయంతో మూడేళ్ల వ్యవధిలో ఈ పార్కును పూర్తి చేయనున్నారు. తొలిదశలో భాగంగా 60 ఎకరాల చూట్టూ రూ.62 లక్షల వ్యయంతో ఫెన్షింగ్ బిగించేందుకు తాజాగా టెండర్లు ఆహ్వానించారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రూపొందిస్తున్న ఈ నందనవనంలో ఆహ్లాదాన్ని పంచడంతో పాటు ఆటవిడుపు ఏర్పాట్లు చేయనున్నారు. ప్రస్తుతం న గరంలో హుస్సేన్‌సాగర్ పరిసరాల్లోని లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్, దామోదర సంజీవయ్య పార్కు, కేబీఆర్ పార్కు, సరూర్‌నగర్ పార్కు తదితరాలు ప్రజలు సేద తీరేందుకు ఉపకరిస్తున్నాయి. హెచ్ఎండీఏ నిర్వహిస్తున్న ఈ పార్కులకు వారాంతాల్లో రద్దీ అధికంగా ఉంటోంది. అయితే, శివారు ప్రాంత ప్రజలకు ఇలాంటి పార్కులు అందుబాటులో లేవు. దీంతో వారు సెలవు దినాల్లో కుటుంబంతో ఇక్కడకు వచ్చి వెళుతున్నారు. ఇప్పుడు శివారు ప్రాంతంలోనే అద్భుతమైన పార్కు ఏర్పాటు కానుండటంతో నగర పార్కులపై ఒత్తిడి తగ్గడమే కాకుండా నగరవాసులు కూడా ఆటవిడుపు కోసం శివారులోని ఎకో-పార్కుకు వెళ్లే అవకాశం ఉంది. అద్భుత ప్రవేశ ద్వారం పచ్చదనం పరవళ్లు తొక్కే ఈ ఎకో-పార్కుకి అద్భుతమైన ప్రవేశ ద్వారాన్ని తీర్చిదిద్దుతున్నారు. దీనికి సంబంధించిన డిజైన్‌ను ముంబయికి చెందిన ప్రముఖ ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్ట్ కిషోర్ ప్రధాన్ రూపొందించారు. పార్కులో పచ్చని చెట్లు, పూలమొక్కలు, పచ్చిక బయళ్లతో వనాన్ని అద్భుతంగా డిజైన్ చేశారు. ప్రత్యేకించి వివిధ జాతుల నీటి పక్షులు, మైదాన ప్రాంత పక్షుల ఆవాసాలు, నగర సంస్కృతికి అద్దంపట్టే శిల్పాలు, బటర్‌ఫ్లై పార్కు, వ్యవసాయానికి ఉపకరించే వివిధ జాతుల మొక్కలు, గ్రామీణ ప్రాంత వాతావరణ ం, సోలార్ ఫార్మ్, పబ్లిక్ పార్కు, పిక్నిక్ ఏరియా, మౌంటెన్ బైకింగ్ ట్రాక్స్, వినోద భరిత హంగులతో పాటు చూపరులను కట్టిపడేసే ల్యాండ్ స్కేప్‌తో తీర్చిదిద్దనున్నారు. ఇప్పటివరకు గుట్టలు, తుప్పలతో ఉన్న ఈప్రాంతం ఇకపై పచ్చదనంతో కళకళలాడనుంది.