breaking news
e-POS
-
Telangana: కొత్త రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్..
కరీంనగర్ అర్బన్: నూతనంగా రేషన్ కార్డు పొందినవారంతా తస్మాత్ జాగ్రత్త. ఈ–కేవైసీ ఉంటేనే రేషన్ సరకులు ఇవ్వనున్నారు. తుది గడువంటూ లేకపోగా వీలైనంత త్వరగా సదరు ప్రక్రియ చేసుకోవడమే ఉత్తమం. ఇటీవల రెండు నెలల కాలంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో ఈ–కేవైసీ తప్పనిసరని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కార్డులో పేర్లున్న కుటుంబ సభ్యులందరూ దగ్గరలోని రేషన్ దుకాణానికి వెళ్లి ఈ–పోస్ యంత్రంలో బయోమెట్రిక్ వేలిముద్రలు అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది.రెండేళ్లుగా ఈ–కేవైసీ ప్రక్రియ...రేషన్ కార్డులో ఉన్నవారందరూ ఈ–కేవైసీ నమోదు చేయుంచుకోవాలని రెండేళ్లుగా ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తిచేసింది. అయితే ఇప్పటికీ అనేకసార్లు గడువు పొడిగించింది. కరీంనగర్ జిల్లాలో 3.01లక్షల రేషన్ కార్డులుండగా 40 వేల మందికిపైగా కొత్తరేషన్ కార్డులు మంజూరయ్యాయి. కార్డులు మంజూరైన వారికి సెప్టెంబరు నెలలో బియ్యం కోటాకూడా విడుదలైంది. వారికి ఈ నెలలో బియ్యం పంపిణీ చేశారు. 32,577 మంది కుటుంబ సభ్యుల పేర్లను పాతకార్డుల్లో జత చేశారు. పాత కార్డులో కొత్తగా పేర్లు నమోదు చేసుకున్నవారు కూడా ఈ–కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుందని అధికారులు వివరించారు.ఆధార్ అప్డేట్ లేక అవస్థలు..ఆధార్ నవీకరణ(అప్డేట్) లేకపోవడంతో కొందరికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజలు ఆధార్ కేంద్రాలకు వెళ్లి అప్డేట్ ప్రక్రియ పూర్తిచేయించుకున్నప్పటికీ ఈ–కేవైసీ ప్రక్రియలో వేలిముద్రలు రావడంలేదు. కారణం తెలుసుకోవాలని బాధితులు ఇతర కేంద్రాలకు వెళ్లి వాకబు చేయగా.. ఆధార్ అప్డేట్ పూర్తి కాకపోవడంతో ఈ–కేవైసీ తీసుకోవడం లేదని పేర్కొంటున్నారు. దీంతో లబ్ధిదారులు వేర్వేరు ఆధార్ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది. కరీంనగర్ జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో ఆధార్ కేంద్రాలు లేకపోవడంతో ప్రజలు ఇతర మండలాలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ సమస్యపై అధికారులు స్పందించి మరిన్ని ఆధార్ కేంద్రాలను అందుబాటులో ఉంచితే ప్రజలకు ఉపయోగపడుతుందని పలువురు కోరుతున్నారు. కొత్త రేషన్ కార్డుదారులు ఈ–కేవైసీ చేయించుకోవాలని, సదరు ప్రక్రియకు తుది గడువు రాలేదని పౌరసరఫరాల శాఖ అధికారులు వివరించారు. -
e-పోస్ విధానానికి ఆదిలోనే అడ్డంకులు
-
‘ఈ–పోస్’ పనితీరును పరిశీలించిన ప్రపంచ బ్యాంక్ బృందం
ఆగిరిపల్లి : మండల కేంద్రమైన ఆగిరిపల్లిలో ఈ–పోస్ మిషన్ల పనితీరును ప్రపంచ బ్యాంకు బృందం సభ్యులు బుధవారం పరిశీలించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో గౌసియాబేగం, తహసీల్దార్ సీహెచ్ ఉమామహేశ్వరరావును పింఛన్ల పంపిణీ చేసే విధానం, ఎన్ఆర్ఈజీఎస్ అమలు జరుగుతున్న తీరు, రేషన్ పంపిణీ విధానం, ఎరువుల దుకాణాల్లో పంపిణీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సత్రం సెంటర్లో గల ఎరువుల దుకాణంలో ఈ–పోస్ విధానం ద్వారా ఎరువుల పంపిణీని దుకాణదారుడిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ప్రపంచ బ్యాంకు బృందం సభ్యులు సునీతచోప్రా, వసుమతి, మండల వ్యవసాయ విస్తరణ అధికారిణి బి.త్రివేణి, ఏపీవో రాజు, తహసీల్దార్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఎరువులపై సిగ్నల్ దరువు
భీమవరం : ఎరువుల అమ్మకాల్లో ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఈ పోస్ విధానంతో రైతులు, వ్యాపారులు అనేక ఇక్కట్లకు గురవుతున్నారు. ఈ పోస్ యంత్రాలకు సక్రమంగా సిగ్నల్స్ అందకపోవడంతో గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎరువుల వాడకం తగ్గించడం ద్వారా ఎరువుల కొరత నివారణ, ఆహార పదార్థాలపై విష ప్రభావాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఈ విధానం అమలులోకి తీసుకువచ్చినా ప్రభుత్వ నిబంధనలతో రైతులకు సకాలంలో ఎరువులు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఎరువులు పొందాలంటే ఎరువుల డీలర్లు, సహకార ‡సంఘాల వద్ద పట్టాదార్ పాస్‌పుస్తకం, ఆధార్‌కార్డు నకళ్లను తీసుకువెళ్లి దానిలో నమోదుచేయించుకుని ఎరువులు పొందాల్సి ఉంది. అయితే ప్రస్తుతం రైతులు ఈ పోస్ విధానంలో ఎంత ఎరువునైనా కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. సరిగా పనిచేయని సిగ్నల్స్ రైతులు ఎరువులు కొనుగోలు చేయాలంటే వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (సొసైటీలు), ఎరువుల వ్యాపారుల వద్దకు ఆధార్ కార్డుతో వెళ్లాలి. దాని ద్వారా రైతుకు ఏ ఎరువు ఎంత మొత్తంలో కావాలో ఈ పోస్ విధానం ద్వారా ఆన్లైన్లో దానిని పొందుపర్చి కొనుగోలు చేసిన ఎరువుల మొత్తానికి రశీదు ఇచ్చి ఎరువులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ పోస్ యంత్రాలకు సిగ్నల్స్ సరిగా అనుసంధానం కాకపోవడంతో రైతులు గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. డీసీసీబీ, డీసీఎంఎస్ సమావేశాల్లో చర్చ ఎరువుల విక్రయంలో ఈ పోస్ విధానం అమలు కారణంగా సహకార సంఘాల్లో ఎదురవుతున్న సమస్యలను ఇటీవల జరిగిన డీసీసీబీ, డీసీఎంఎస్ జనరల్ బాడీ సమావేశాల్లో సహకార సంఘాల ఉద్యోగులు, రైతులు ఏకరవు పెట్టారు. ఈ పోస్ విధానం వేగవంతంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని లేకుంటే రైతులు సొసైటీలపై అభాండాలు వేసే ప్రమాదముందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేయగా చేతిలో సొమ్ము, ఎదురుగా ఎరువులున్నా పంట పొలాలకు వినియోగించుకోలేకపోతున్నామని రైతులు ధ్వజమెత్తారు. కొనుగోలులో కష్టాలు ఈ పోస్ విధానంలో ఎరువుల కంపెనీలు, డీలర్ల నుంచి సహకార సంఘాలు, వ్యాపారులు కొనుగోలు చేసి దిగుమతి చేసుకున్న ఎరువుకు ఆయా కంపెనీల నుంచి ఎక్‌నాలేడ్జ్‌మెంట్ పొందాల్సి ఉంటుంది. ఎరువులు దిగుమతి చేసిన వాహనదారుడు తిరిగి వెళ్లి ఆయా కంపెనీలు, డీలర్లకు వారు దింపుకున్న మొత్తం వివరాలను తెలిపిన తరువాత వాటిని ఆన్లైన్లో పొందుపరిస్తే స్టాక్ రిజిస్టర్లో చూపిస్తుంది. అప్పటివరకు వ్యాపారులు ఎరువులు అమ్ముకునే అవకాశం లేదు. డీలర్లు, కంపెనీలు వెనువెంటనే ఆన్లైన్ చేయకపోవడంతో స్టాక్ రిజిస్టర్లో చూపించకపోవడం వల్ల తమ వద్ద సరుకు ఉన్నా అమ్ముకునే వీలులేకుండా పోతుందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ నుంచి సరికొత్త విధానం ప్రస్తుతం రైతుల భూముల వివరాలను వెబ్‌ల్యాండ్‌లో పొందుపరుస్తున్నారు. దీంతో వచ్చే ఏడాది ఏప్రిల్ నెల నుంచి రైతులు ఎరువులు కొనుగోలుకు వెళ్తే వెబ్‌ల్యాండ్‌ను పరిశీలించి దానిలో వివరాల మేరకే ఎరువుల వ్యాపారులు, సొసైటీల్లో ఎరువులను విక్రయించాల్సి ఉంది. భూసార పరీక్షల ఆధారంగా రైతులకు ఎరువులను అందించనున్నారు. రైతులు ఏ ఎరువులు కొనుగోలు చేసినా పూర్తి ధరకే కొనాలి. అనంతరం ఆయా ఎరువులపై ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. -
ఆహారధాన్యాల ఈ - పోస్ నమోదులో ఏపీ అగ్రస్థానం
హనుమాన్‌జంక్షన్ : పౌరసరఫరాల శాఖ సేకరిస్తున్న మరియు పంపిణీ చేస్తున్న ఆహారధాన్యాల వివరాలను ఈ- పోస్ నమోదులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటిస్థానంలో ఉందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఆర్ కరికల్ వలవెన్ తెలిపారు. హనుమాన్‌జంక్షన్ ఎఫ్‌సీఐలో ఈ-పోస్ విధానాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. అనంతరం కరికల్ వలవన్ విలేకర్లతో మాట్లాడారు. ఆహారధాన్యాలకు సంబంధించి మొదటి నుంచి చివర వరకు సేకరణ, పంపిణీలను కంప్యూటరైజేషన్ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో ఎఫ్‌సీఐ గిడ్డంగుల్లో ఈ-పోస్ విధానాన్ని పరిశీలించడానికి జిల్లా పర్యటనకు వచ్చినట్లు ఆయన వెల్లడించారు. పౌరసరఫరాల శాఖ ధాన్యం మిల్లింగ్ చేసి ఎఫ్‌సీఐకి తరలించిన వివరాలు ఎఫ్‌సీఐ నుండి ఎంఎస్ఎల్ పాయింట్లకు పంపిణీ చేస్తున్న వివరాలతో పాటు నిల్వల వివరాలు ఈ-పోస్ నమోదు విధానం ఎలా జరుగుతోంది.. అన్న విషయాలు క్షేత్ర స్థాయి సిబ్బంది నుండి వివరాలు సేకరించడం జరిగిందన్నారు. అనంతరం గిడ్డంగుల్లో ఆహారధాన్యాల నిల్వల విధానాన్ని, వాటి సంరక్షణ తీరుతెన్నులు కరికల్ వలవన్ పరిశీలించారు.