ఆహారధాన్యాల ఈ - పోస్ నమోదులో ఏపీ అగ్రస్థానం | Andhra pradesh state number one position in e-POS | Sakshi
Sakshi News home page

ఆహారధాన్యాల ఈ - పోస్ నమోదులో ఏపీ అగ్రస్థానం

Aug 5 2015 1:49 PM | Updated on Jun 2 2018 3:18 PM

పౌరసరఫరాల శాఖ సేకరిస్తున్న మరియు పంపిణీ చేస్తున్న ఆహారధాన్యాల వివరాలను ఈ- పోస్ నమోదులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటిస్థానంలో ఉందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఆర్ కరికల్ వలవెన్ తెలిపారు.

హనుమాన్‌జంక్షన్ : పౌరసరఫరాల శాఖ సేకరిస్తున్న మరియు పంపిణీ చేస్తున్న ఆహారధాన్యాల వివరాలను ఈ- పోస్ నమోదులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటిస్థానంలో ఉందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఆర్ కరికల్ వలవెన్ తెలిపారు. హనుమాన్‌జంక్షన్ ఎఫ్‌సీఐలో ఈ-పోస్ విధానాన్ని ఆయన బుధవారం పరిశీలించారు.

అనంతరం కరికల్ వలవన్ విలేకర్లతో మాట్లాడారు. ఆహారధాన్యాలకు సంబంధించి మొదటి నుంచి చివర వరకు సేకరణ, పంపిణీలను కంప్యూటరైజేషన్ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో ఎఫ్‌సీఐ గిడ్డంగుల్లో ఈ-పోస్ విధానాన్ని పరిశీలించడానికి జిల్లా పర్యటనకు వచ్చినట్లు ఆయన వెల్లడించారు.

పౌరసరఫరాల శాఖ ధాన్యం మిల్లింగ్ చేసి ఎఫ్‌సీఐకి తరలించిన వివరాలు ఎఫ్‌సీఐ నుండి ఎంఎస్‌ఎల్ పాయింట్లకు పంపిణీ చేస్తున్న వివరాలతో పాటు నిల్వల వివరాలు ఈ-పోస్ నమోదు విధానం ఎలా జరుగుతోంది.. అన్న విషయాలు క్షేత్ర స్థాయి సిబ్బంది నుండి వివరాలు సేకరించడం జరిగిందన్నారు. అనంతరం గిడ్డంగుల్లో ఆహారధాన్యాల నిల్వల విధానాన్ని, వాటి సంరక్షణ తీరుతెన్నులు కరికల్ వలవన్ పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement