breaking news
Dron attack
-
ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డ రష్యా
కీవ్: రష్యా మరోసారి క్షిపణులు, డ్రోన్లతో ఉక్రెయిన్‌పై భీకర దాడులకు పాల్పడింది. రాజధాని కీవ్‌తోపాటు ఇతర ప్రాంతాలే లక్ష్యంగా శనివారం రాత్రి చేపట్టిన దాడుల్లో కనీసం 12 మంది చనిపోగా పదుల సంఖ్యలో జనం క్షతగాత్రులయ్యారు. మొత్తం 69 క్షిపణులు, 298 డ్రోన్లను రష్యా ప్రయోగించిందని ఉక్రెయిన్ ఎయిర్‌ఫోర్స్ పేర్కొంది. ఇరాన్ డిజైన్ చేసిన షహీద్ రకం డ్రోన్లు కూడా ఇందులో ఉన్నాయంది. మూడేళ్లుగా సాగుతున్న యుద్ధంలో ఒకే రాత్రిలో రష్యా ఇంత భారీ స్థాయిలో వైమానిక దాడులకు దిగడం ఇదే మొదటిసారని తెలిపింది. శుక్రవారం మాదిరిగానే శనివారం రాత్రంతా కీవ్ వాసులు కంటిపై కునుకు లేకుండా గడిపారు. సైరన్ మోతలు, పేలుళ్లతో రాజధాని దద్దరిల్లింది. క్షిపణులు, డ్రోన్ల శకలాలు పడి నివాస ప్రాంతాలు, వ్యాపార సముదాయాల్లో మంటలు చెలరేగాయి. కీవ్‌లో అత్యధికంగా నలుగురు మరణించగా, 16 మంది గాయపడ్డారని నగర భద్రతా విభాగం తెలిపింది. తర్వాత, జిటోమిర్ ప్రాంతంలో ముగ్గురు బాలలు సహా 12 మంది క్షతగాత్రులయ్యారు. సుమీ, మైకోలైవ్, ఖ్మెల్నిట్స్కీ, చరి్నహివ్, ఒడెసా, టెర్నోపిల్, పొల్టావా, నీప్రో, చెర్కసీ ప్రాంతాలపైనా దాడులు జరిగాయి. కీవ్ శివారులోని మర్ఖాలివ్స్కాలో పలు నివాసాలు మంటల్లో కాలిబుగ్గయ్యాయి. దాడుల అనంతరం మరో గ్రామం మొత్తం పొగలు, మంటలతో నిండిపోయింది. ఇక్కడ చోటుచేసుకున్న విధ్వంసం మరియుపోల్, బాఖ్ముత్లను తలపించిందని స్థానికుడొకరు పేర్కొన్నారు. రష్యా క్షిపణులు, డ్రోన్లతో 30కి పైగా నగరాలు, గ్రామాల్లో విధ్వంసం జరిగిందని అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. రష్యా ఉద్దేశ పూర్వకంగా సామాన్యులపై దాడులకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. ఆంక్షలు విధించడం వంటి తీవ్రమైన ఒత్తిడి తేకుండా రష్యా దురాక్రమణకు అడ్డుకట్ట వేయలేమన్నారు. ఇలా ఉండగా, ఉక్రెయిన్ శనివారం రాత్రి ప్రయోగించిన 110 డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థలు ధ్వంసం చేశాయని రష్యా రక్షణ శాఖ తెలిపింది.మూడో విడత ఖైదీల మార్పిడి రష్యా, ఉక్రెయిన్ అధికారుల మధ్య మూడో విడత యుద్ధ ఖైదీల మారి్పడి కొనసాగింది. ఒకవైపు భీకర దాడులు కొనసాగుతుండగానే ఆదివారం మరో 303 మంది ఖైదీలను ఇచి్చపుచ్చుకున్నామని ఇరుదేశాలు ప్రకటించాయి. తుర్కియేలో కుదిరిన ఒప్పందం ప్రకారం ఇరుదేశాలు వెయ్యి మంది యుద్ధ ఖైదీలను పరస్పరం మారి్పడి చేసుకోవాల్సి ఉంది. ఇందులో భాగంగా మొదటి విడతలో శుక్రవారం 390 మందిని, శనివారం మరో 307 మందిని పరస్పరం మార్చుకోవడం తెల్సిందే. వీరిలో వివిధ విభాగాలకు చెందిన సైనికులతోపాటు పౌరులు కూడా ఉన్నారు. మూడేళ్లలో మార్చుకున్న మొత్తం యుద్ధ ఖైదీల కంటే ఈ మూడు రోజుల్లో పరస్పరం అప్పగించుకున్న యుద్ధ ఖైదీల సంఖ్యే ఎక్కువని సమాచారం. -
విరామం అంటూనే విరుచుకుపడింది
కీవ్: అగ్రరాజ్యం అమెరికా ప్రోద్బలంతో కాల్పుల విరమణకు దాదాపు తలూపిన రష్యా చిట్టచివర్లో తల ఎగరేసింది. శాంతిని కోరుకుంటున్నామని, 30 రోజులపాటు ఉక్రెయిన్ ఇంధన, మౌలిక వసతులపై దాడులు చేయబోమని సూత్రప్రాయ అంగీకారానికి సిద్ధపడిన రష్యా వెనువెంటనే సమరనినాదం చేసింది. మంగళవారం రాత్రి నుంచి నిరాటంకంగా రష్యా డ్రోన్లు జనావాసాలపై దాడులు చేస్తున్నాయని ఉక్రెయిన్ బుధవారం ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో దాదాపు గంటకుపైగా ఫోన్లో సంభాషించిన కొద్దిగంటలకే రష్యా మళ్లీ తన భీకర దాడులను మొదలుపెట్టడం గమనార్హం. దాడులు ఆపబోమని తాజా ఘటనతో రష్యా చెప్పేసిందని, సమీ పట్టణంలోని ఒక ఆస్పత్రిపై, ప్రజల ఇళ్లపై డ్రోన్ల దాడులు జరిగాయి. ముఖ్యంగా డోనెట్సక్ ప్రాంతంలోని నగరాలపై 150 డ్రోన్ల దాడులు జరిగాయి. వీటితోపాటు కీవ్, ఝిటోమిర్, చెరి్నహీవ్, పోల్టావా, ఖర్కీవ్, కిరోవోహార్డ్, డినిప్రోపెట్రోవ్సŠక్, చెర్కసే ప్రాంతాలపైనా డ్రోన్లు విరుచుకుపడ్డాయి. అయితే ప్రాణనష్టం వివరాలు వెల్లడికాలేదు. ఉక్రెయిన్ సైతం డ్రోన్లకు పనిచెప్పింది. రష్యా ప్రాంతాలపై డ్రోన్ దాడులుచేసింది. 57 డ్రోన్లను కూల్చేశామని రష్యా ప్రకటించింది. చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులు చేస్తోందని ఆరోపించింది. ‘‘కాల్పుల విరమణ చర్చల వేళ ఇలా దాడులతో ఉక్రెయిన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. దీంతో చర్చలు రైలు పట్టాలు తప్పే ప్రమాదమొచ్చింది’’ అని రష్యా రక్షణ శాఖ ఆగ్రహం వ్యక్తంచేసింది. -
ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా భీకర దాడి
బీరూట్: లెబనాన్‌కు చెందిన హెజ్బొల్లా మిలిటెంట్లు మరోసారి భీకర దాడులకు దిగారు. ఆదివారం ఇజ్రాయెల్ భూభాగంపై 250 రాకెట్లు, ఇతర డ్రోన్లు ప్రయోగించారు. గత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై విరుచుకుపడుతుండడంతో ప్రతీకార చర్యగా మిలిటెంట్లు రాకెట్లతో దాడి దిగారు. ఈ దాడుల్లో కనీసం ఏడుగురు ఇజ్రాయెల్ పౌరులు గాయపడ్డారు. మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్ ఆర్మీ సెంటర్‌పై దాడికి పాల్పడింది. నైరుతి కోస్తా తీర రహదారిపై టైర్, నఖౌరా మధ్య ఈ దాడి జరిగినట్లు లెబనాన్ సైన్యం వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడిలో ఒక సైనికుడు మృతిచెందాడని, 18 మంది గాయపడ్డారని తెలియజేసింది. -
రష్యాపైకి ఉక్రెయిన్ 100 డ్రోన్లు
కీవ్: ఉక్రెయిన్ శనివారం రాత్రి తమ పశ్చిమ ప్రాంతంపైకి 100కు పైగా డ్రోన్లను ప్రయోగించిందని రష్యా తెలిపింది.గగనతల రక్షణ వ్యవస్థలు వీటిని కూల్చేశాయని ప్రకటించింది. మొత్తం ఏడు ప్రాంతాల్లోకి 110 డ్రోన్లు చొచ్చుకురాగా, సరిహద్దుల్లోని ఒక్క కస్క్పైకే ఏకంగా 43 డ్రోన్లను పంపిందని రష్యా ఆర్మీ ప్రకటించింది. నిజ్నీ నొవ్గొరోడ్లోని పేలుడు పదార్థాల కర్మాగారానికి సమీపంలోకి వచ్చిన డ్రోన్‌ను గాల్లోనే ధ్వంసం చేశామని వివరించింది. ఈ ఘటనలో నలుగురు సైనికులు గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఇలా ఉండగా, శనివారం సాయంత్రం ఉక్రెయిన్‌లోని క్రివ్యి రిహ్‌లో రష్యా రెండు బాలిస్టిక్ క్షిపణులతో జరిపిన దాడిలో 17 మంది గాయపడ్డారని యంత్రాంగం తెలిపింది. పలు నివాసాలు, వ్యాపార సంస్థలకు నష్టం వాటిల్లిందని వెల్లడించింది. కాగా, వారం రోజుల వ్యవధిలో రష్యా 800 గైడెడ్ ఏరియల్ బాంబులు, 500కు పైగా డ్రోన్లతో దాడులు చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తెలిపారు. నిత్యం తమ నగరాలు, పట్టణాలపై రష్యా దాడులు జరుపుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు. -
‘జిహాదీ జాన్’ హతం!
పాశ్చాత్య బందీలకు శిరచ్ఛేదం చేస్తూ నరరూప రాక్షసుడిగా పేరొందిన ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) మిలిటెంట్ మహమ్మద్ఎంవాజీ (27) అలియాస్ ‘జిహాదీ జాన్’ సిరియాలో అమెరికా గురువారం జరిపిన ద్రోన్ దాడిలో హతమైనట్లు తెలుస్తోంది. ఎంజావీ హతమై ఉండొచ్చని బ్రిటన్ వర్గాలు కూడా పేర్కొన్నాయి.