breaking news
dollar strengthened
-
ఫార్మా ఎగుమతులు 4 శాతం అప్
హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో (ఏప్రిల్–అక్టోబర్) ఫార్మా ఎగుమతులు 4.22 శాతం వృద్ధి చెంది 14.57 బిలియన్ డాలర్లకు చేరాయి. గత ఏడాది ఇదే వ్యవధిలో ఎగుమతులు 13.98 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఇవి 27 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనాలు నెలకొన్నాయి. కేంద్ర వాణిజ్య శాఖలో భాగమైన ఫార్మా ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఫార్మెక్సిల్) డైరెక్టర్ జనరల్ ఉదయ భాస్కర్ ఈ విషయాలు వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఫార్మా ఎగుమతులు 24.62 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. జూలై, అక్టోబర్ ఎగుమతులు కాస్త తగ్గినప్పటికీ సెప్టెంబర్‌లో సానుకూలంగానే ఉన్నాయని, ఇదే ధోరణి పూర్తి ఆర్థిక సంవత్సరంలోను కొనసాగవచ్చని భాస్కర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అక్టోబర్‌లో ఫార్మా ఎగుమతులు 5.45 శాతం క్షీణించి 1.95 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. రష్యా–ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలతో పాటు కొన్ని కీలక కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలపడటం కూడా ఎగుమతుల తగ్గుదలకు కారణమైనట్లు భాస్కర్ చెప్పారు. ‘ఉదాహరణకు భారత ఫార్మాకు టాప్ 5 మార్కెట్లలో నైజీరియా కూడా ఒకటి. అమెరికా డాలర్‌తో పోలిస్తే నైజీరియా నైరా క్షీణత కొనసాగుతుండటంతో ఆ దేశం దిగుమతులను తగ్గించుకోవాల్సి వస్తోంది‘ అని ఆయన తెలిపారు. ప్రస్తుతం భారత్‌కు అమెరికా, కెనడా, మెక్సికోతో పాటు యూరప్, ఆఫ్రికా దేశాలు టాప్ మార్కెట్లుగా ఉంటున్నాయి. -
పసిడి పెరిగినా.. పడింది!
• 40 డాలర్లు పెరిగినా... 80 డాలర్ల నష్టం... • ఫడ్ రేటు భయాలు; డాలర్ బలోపేతం ఫలితం న్యూయార్క్, ముంబై: అంచనాలకు భిన్నంగా గడచిన వారం పసిడి తీవ్ర ఒడిదుడుకులకు గురైంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయ సంకేతాలతో బుధవారం ఒక్కసారిగా ఆసియా ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో భారీగా ఔన్సకు (31.1 గ్రాములు) 40 డాలర్లు ఎగసి, 1,338 డాలర్లకు పెరిగినప్పటికీ, తర్వాత అక్కడ నిలవలేకపోయింది. క్రమంగా తిరిగి 1,300 డాలర్లకు చేరింది. తరువాత అదే రోజు అమెరికా ఫ్యూచర్స్ మార్కెట్ నెమైక్స్‌లో పసిడి ధర 1,280 డాలర్లకు పడిపోయింది. తదుపరి మూడు రోజుల్లో క్రమంగా 1,224 డాలర్లకు దిగివచ్చింది. మార్కెట్ పండితులు ఊహించినదానికన్నా భిన్నంగా అమెరికా ఈక్విటీ మార్కెట్లు బలపడటం, డాలర్ బలోపేతం, అమెరికా ఫెడ్ ఫండ్ రేటు (ప్రస్తుతం 0.50 శాతం) మరింత పెంచవచ్చన్న అంచనాలు పసిడిని నష్టాలవైపు పరుగులు తీయించాయి. సమీపకాలంలో పడిసి ఇదే తీరులో కొనసాగే అవకాశాలున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ అనుసరించే విధానాల్లో స్పష్టత, ఫెడ్ ఫండ్ రేటు అనిశ్చితి పసిడి ధరపై ప్రతికూలత చూపే అవకాశం ఉందన్నది విశ్లేషణ. మొత్తంమీద వారం వారీగా పసిడి 80 డాలర్లు పడిపోరుు 1,224 డాలర్ల వద్ద ముగిసింది. దేశంలో ఇలా... ముంబైలో స్పాట్ బులియన్ మార్కెట్‌ను చూస్తే... బుధవారం అంతర్జాతీయ ధోరణి సుస్పష్టంగా కనిపించింది. ఆ రోజు రూ.31,150 దాటిపోరుుంది. తర్వాత క్రమంగా పడిపోరుు చివరకు వారం వారీగా చూస్తే... 99.9 స్వచ్ఛత గల 10 గ్రాముల పసిడి ధర రూ.295 తగ్గి, రూ.30,515 వద్ద ముగిసింది. ఇక 99.5 స్వచ్ఛత ధర సైతం ఇంతే స్థారుులో తగ్గి రూ.30,365 వద్ద ముగిసింది. అయితే పెళ్లిళ్ల సీజన్, పెద్ద నోట్ల రద్దుతో పసిడివైపు నల్లధన కుబేరుల చూపు వంటి అంశాలతో సమీప కాలంలో దేశీయంగా కొంత మద్దతు లభిస్తుందని భావిస్తున్నారు. ఇక వెండి కేజీ ధర రూ.1,385 పెరిగి రూ.45,420కి చేరింది. పెళ్లిళ్ల సీజన్, నాణేల తయారీ దారుల నుంచి డిమాండ్ వెండి ధర పెరుగుదలకు కలిసివచ్చిందని నిపుణులు చెబుతున్నారు.