breaking news
Doctor Kavita
-
డాక్టరమ్మ శిక్షణ చక్ దే..!
చక్‌దే ఇండియాలో మహిళా హాకీ జట్టును తీర్చిదిద్దుతాడు షారుక్ ఖాన్ . నిజామాబాద్‌లో ఫుట్‌బాల్‌లో బాలికలను మెరికల్లా తీర్చిదిద్దుతున్నారు డాక్టర్ కవితారెడ్డి. ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఇక్కడి నుంచి సెలెక్ట్ అవుతున్న బాలికలు ఇంటర్నేషనల్ స్థాయిలో తెలంగాణ పేరును నిలబెట్టేలా చేయడమే లక్ష్యం అంటున్నారామె. కవితారెడ్డి ఈ క్రీడా శిక్షణ ఎందుకు ప్రారంభించారో తెలిపే కథనం.‘సహాయం చేసే వ్యక్తులు మన జీవితాల్లో ఉంటే సహాయం చేయడం మనక్కూడా అలవడుతుంది’ అంటారు డాక్టర్ శీలం కవితా రెడ్డి. నిజామాబాద్‌లో గైనకాలజిస్ట్‌గా పేరొందిన ఈ డాక్టర్ తన సేవా కార్యక్రమాలతో కూడా అంతే గౌరవాన్ని పొందుతున్నారు. ‘మా తాతగారిది నల్లగొండ. పేదవాళ్లకు ఆయన సహాయం చేయడం, వాళ్లకు ఫీజులు కట్టి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో చదివించడం నేను బాల్యం నుంచి గమనించేదాన్ని. సాయం చేయడంలో సంతృప్తి నాకు అర్థమైంది. నేను డాక్టర్‌గా స్థిరపడ్డాక ‘డాక్టర్ కవితా రెడ్డి ఫౌండేషన్’ స్థాపించి స్త్రీల, బాలికల ఆరోగ్యం కోసం పని చేయాలని నిశ్చయించుకున్నాను. పేద మహిళల ఆరోగ్య సమస్యలను పట్టించుకోవడం అవసరం అనే భావనతో ఈ పని మొదలుపెట్టాను’ అన్నారామె.ఫుట్‌బాల్ మేచ్ చూసి...‘నిజామాబాద్ పట్టణంలో ఒకసారి బాలికల ఫుట్‌బాల్ టోర్నమెంట్ జరుగుతుంటే నన్ను అతిథిగా ఆహ్వానించారు. అక్కడ ΄ాల్గొన్న అమ్మాయిల క్రీడానైపుణ్యం చూసి ఆశ్చర్య΄ోయాను. ఎంతటి పేదరికంలో ఉన్నా సరైన ΄ోషణ, డ్రస్, షూస్ లేక΄ోయినా వారు గ్రౌండ్లో చిరుతల్లా పరిగెడుతూ ఆడారు. అలాంటి పిల్లలకు సరైన శిక్షణ ఇస్తే మరింతగా దూసుకు΄ోతారని భావించి 2019లో డాక్టర్ కవితారెడ్డి ఫుట్‌బాల్ అకాడెమీ స్థాపించాను. నిజామాబాద్ జిల్లాలోని గ్రామీణప్రాంతం బాలికలకు హాస్టల్ ఏర్పాటు చేసి ఫుట్‌బాల్‌లో శిక్షణ ఇప్పిస్తున్నాను. పట్టణంలో ఉన్న బాలికలు రోజూ వచ్చి ఉచిత శిక్షణ పొందితే బయటి ఊళ్ల అమ్మాయిలు హాస్టల్లో ఉంటూ శిక్షణ పొందుతున్నారు’ అని తెలి΄ారామె.అదే ప్రత్యేకం...కవితారెడ్డి తన అకాడెమీని ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్, తెలంగాణ ఫుట్‌బాల్ అసోసియేషన్‌కు అనుబంధంగా రిజిస్టర్ చేశారు. తెలంగాణ లో మొత్తం 8 ఫుట్‌బాల్ క్లబ్బులు ఉండగా మహిళా కార్యదర్శి ఉన్న క్లబ్ మాత్రం ఇదొక్కటే కావడం గమనార్హం. ప్రస్తుతం డాక్టర్ కవితారెడ్డి ఫుట్‌బాల్ అకాడమీలోని 41 మంది బాలికలు కోచ్ గొట్టి΄ాటి నాగరాజు ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్నారు. గతంలో నాగరాజు శిక్షణలోనే అంతర్జాతీయ క్రీడాకారిణి సౌమ్య తయారైంది. శిక్షణ పొందుతున్న బాలికల్లో వివిధ జిల్లాలకు చెందిన ఇంటర్, డిగ్రీ చదువుతున్న గ్రామీణప్రాంతాల వారున్నారు. వీరందరికీ కవితారెడ్డి తన సొంత ఖర్చుతోనే వసతి, ఆహారం, డ్రెస్సులు, వైద్య సౌకర్యం కల్పిస్తున్నారు. ఇతరప్రాంతాల్లో టోర్నమెంట్లకు వెళ్లాల్సి వస్తే అవసరమైన సామగ్రి, ప్రయాణ ఖర్చులన్నీ డాక్టరమ్మే భరిస్తున్నారు. ఈ అకాడమీ నుంచి ఇప్పటివరకు 9 మంది బాలికలు పశ్చిమబెంగాల్, కర్ణాటక, జార్ఖండ్ రాష్ట్రాల్లో నేషనల్స్ ఆడారు. మరో ఐదుగురు ఇతర రాష్ట్రాల క్లబ్‌లకు ఆడారు. ఖేలో ఇండియా కార్యక్రమం కింద అండర్–13, అండర్–15లో 14మంది ఆడారు. ఇక తెలంగాణ ఉమెన్స్ లీగ్‌కు 22 మంది ఈ అకాడమీ బాలికలు ఆడనున్నారు. మిషన్ 2027లో భారత జట్టుకు ఎంపికై అంతర్జాతీయ ΄ోటీలకు వెళ్లేలా బాలికలు శిక్షణ పొందుతున్నారు. మరోవైపు బాక్సింగ్ క్రీడాకారులకు సైతం ఇప్పటివరకు అవసరమైనప్పుడల్లా కిట్లు కొనిస్తున్నారు.హెల్త్ కార్డ్లుడాక్టర్ కవితారెడ్డి తన హెల్త్ ఫౌండేషన్ ద్వారా 2017 నుంచి పేద గర్భిణులకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తూ వస్తున్నారు. నాలుగు వేల మందికి హెల్త్ కార్డులు ఇచ్చారు. ఈ కార్డ్ ఉన్నవారికి తన ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలూ కల్పిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ΄ాఠశాలల్లో 8, 9, 10 తరగతుల విద్యార్ధినులకు అనీమియా వైద్యపరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. సేవాకార్యక్రమాల విషయంలో తనను భర్త రవీందర్‌రెడ్డి, కుమారుడు డాక్టర్ పరీక్షిత్ సాయినాథ్‌రెడ్డి అన్నిరకాలుగా ్ర΄ోత్సహిస్తున్నారని కవితారెడ్డి చెబుతున్నారు.– తుమాటి భద్రారెడ్డి, సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ -
అమల అక్కినేనికి అంతపేరెలా వచ్చింది?
డాక్టర్ కవితా సందీప్ అంటే మనకు తెలియదు.కానీ, తమిళనాడులో మాత్రం చాలా పాపులర్ డాక్టర్. అవును ఆ డాక్టర్ ఎవరో కాదు. మన అమల అక్కినేని. తమిళనాడులోని ప్రతి ఇంటికి వెళ్లి పలకరిస్తున్నారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత తమిళంలో నటిస్తున్నారు అమల. చెన్నై కళాక్షేత్ర విద్యార్థిని అయిన అమల 'మైథిలి ఎన్నై కాదళి' అంటే తెలుగులో 'మైథిలి నా ప్రేయసి' సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై తొలిసారి ప్రత్యక్షమయ్యారు. ఆరేళ్లలో అమల దాదాపు 50 సినిమాల్లో నటించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ అన్ని భాషలలో ఆమె నటించారు. ఈ మధ్య కాలంలో అమల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో అతిధి పాత్రలో కనిపించారు. ఆ తర్వాత 'ఉయిర్ మెయ్' అనే బుల్లితెర తమిళ సీరియల్ కోసమే ఆమె మేకప్ వేసుకున్నారు. ఉయిర్ మెయ్ అంటే ప్రాణదాత. డాక్టర్స్ చుట్టు ఈ కథ తిరుగుతూ ఉంటుంది. ఈ సీరియల్లో డాక్టర్ కవితా సందీప్ పాత్రలో అమల నటిస్తున్నారు. సందీప్ పాత్ర భరత్ కళ్యాణ్‌ది. పన్నెండు మంది డాక్టర్లు, వారి జీవితాలు, కుటుంబాలు, రోగుల చుట్టు కథ నడుస్తుంది. మణిరత్నం దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన భూషణ్ కళ్యాణ్ ఈ సీరియల్‌కు దర్శకత్వం వహిస్తున్నారు.తమిళ హీరో గీబ్రాన్ ఉస్మాన్ ఇందులో చిన్నపిల్లల డాక్టర్ పాత్ర. ఈ సీరియిల్ స్క్రిప్టు చాలా బాగుందని, అందువల్లనే ఇందులో నటించేందుకు ఒప్పుకున్నట్లు అమల చెప్పారు. అమల ఊహించినట్లే ఈ సీరియల్ తమిళనాడులో బాగా పాపులర్ అయింది. అందులోని డాక్టర్ పాత్ర అమలకు మంచి పేరు తెచ్చిపెడుతోంది. ''నేను సీరియల్లో నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ, అనుకోనివి జరగడమే జీవితం''అని అమల అన్నారు. ఉయిర్మెయ్ ధారావాహికలో నటించడానికి గల కారణాలను అమల వివరిస్తూ ఈ కథ, కథనం చాలా బాగున్నాయని తెలిపారు. పైగా ప్రతి ఎపిసోడ్‌లోనూ ప్రేక్షకులను ఆలోచింపజేసే మంచి సందేశం ఉందని చెప్పారు. ఇందులో తన పాత్ర పేరు డాక్టర్ కవిత అని, ఎమర్జెన్సీ కేర్‌కి హెడ్‌ని అని తెలిపారు. కేవలం మందుల వల్ల మాత్రమే అనారోగ్యం దూరం కాదని, రోగి పట్ల ప్రేమాభిమానాలు కనబర్చడం కూడా ముఖ్యం అని ఈ పాత్ర చెబుతుంది. గత నెల 18న ఈ ధారావాహిక ప్రసారం ఆరంభమైంది. తమిళంలో అనేక చిత్రాలలో నటించిన అమలకు తమిళనాడులో అభిమానులు బాగానే ఉన్నారు. మళ్లీ తెరపై అమల కనిపించడం వారికి ఆనందంగా ఉంది. నాగార్జునను పెళ్లి చేసుకున్న తర్వాత నటనకు అమల ఫుల్స్టాప్ పెట్టేశారు. ఇంటి బాధ్యతలను నిర్వర్తిస్తూ బ్లూ క్రాస్ కార్యకలాపాలు చూసుకుంటూ గడిపేవారు. ఇరవయ్యేళ్ల విరామం తర్వాత మళ్లీ వెండితెరపై లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ద్వారా మెరిశారు. ఇప్పుడు బుల్లి తెరపై మంచి పాత్ర పోషిస్తున్నారు. - శిసూర్య