breaking news
Disease diagnosis
-
బీర్‌ని బేషుగ్గా తాగొచ్చట! అందులో ప్రోటీన్, విటమిన్ బీ..
బీర్‌ని ఎలాంటి సందేహం లేకుండా హాయిగా తాగొచ్చట. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. పైగా ఎన్నో రకాల వ్యాధుల నుంచి రక్షిస్తుందని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. ఆరోగ్య నిపుణులు ఎలాంటి ఆందోళన లేకుండా బీర్‌ని బేషుగ్గా తాగండి అని ధీమాగా చెప్పేస్తున్నారు. ఇంతకీ బీర్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే.. బీర్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు రోజు 1.5 నుంచి రెండు గ్లాసుల బీర్లు తీసుకుంటే గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఒకవేళ ఇప్పటికే గుండె సమస్యలతో బాధపడుతుంటే వాళ్లు బీర్ తాగాలని నిర్ణయించుకోవడం అనేది చాలా మంచి ఆప్షన్ అంటున్నారు. ఇంతకు మునుపు గుండె పోటుకి గురైనవారు క్రమం తప్పకుండా బీర్ తాగితే ఇరవై ఏళ్లకు పైగా జీవిస్తారని, వారి ఆయుః ప్రమాణం కూడా పెరుగుతుందని చెబుతున్నారు బీర్లో వైన్ కంటే పోషకమైనది. ఎందుకంటే వైన్‌లో ఉండే ఆల్కహాలిక్ ద్రాక్ష రసం కంటే బీర్లో ఎక్కువ ప్రోటీన్లు, విటమిన్ బీ రెండూ ఉంటాయని అమెరికన్ జర్నల్ ఆఫ్ మెడికల్ సైన్స్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. బీర్లో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇది వివిధ రకాల వ్యాధుల నుంచి రక్షిస్తుంది. మధుమేహం వచ్చే ప్రమాదం కూడా తక్కువే. వారానికి 14 గ్లాస్లుల బీర్ తాగితే టైప్2 డయాబెటిస్‌కు గురయ్యే అవకాశం తక్కువగా ఉందని, ఏడువేల మందికి పైగా వ్యక్తులపై జరిపిన అధ్యయనంలో తేలింది. బలమైన ఎముకల కోసం పాలు ఎలా అయితే మంచిదే బీర్ కూడా మంచిదే. పాలు ఎముకలకు ఏ విధమైన శక్తిని అందిస్తాయో అలానే బీర్ కూడా ఇస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పచ్చి బఠానీలు, తృణధాన్యాల్లో ఎలాంటి విటమిన్లు ఉంటాయో అవే బీర్లో కూడా ఉంటాయిన చెబుతున్నారు. దంతాలు కూడా బాగుంటాయట. ఇది తాగితే పెదాలపై చిరునవ్వు తగ్గదని దంత వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే బీర్ దంతాలపై ప్రభావంతంగా పనిచేస్తుందట. ముఖ్యంగా కావిటీస్, ఇన్ఫెక్షన్కు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుందట. (గమనిక: ఒక గ్లాసు బీరు ఎలాంటి హాని ఉండదన్నారు. అదికూడా వారానికి ఒక్కసారి చొప్పున తీసుకుంటుంటే ఎలాంటి సమస్య ఉండదని చెబుతున్నారు) (చదవండి: అత్యంత అరుదైన వ్యాధి!సల్మాన్ ఖాన్ సైతం ఫేస్ చేశాడు! ఆ వ్యాధి ఏంటంటే) -
రాష్ట్రంలో మార్సా!
- మంగళూరు ప్రాంతంలో వ్యాధిగ్రస్తులు? - బాధితుల్లో 120 మంది నర్సింగ్ విద్యార్థులు - అనుమానిత వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక చికిత్స - వ్యాధి నిర్ధారణపై స్పష్టత లేదంటున్న మంత్రి ఖాదర్ - ముందస్తు చర్యలు చేపట్టాలని వైద్యులకు సూచన సాక్షి, బెంగళూరు : యూరోపియన్ యూనియన్ దేశాలను ఇటీవల తీవ్ర భయభ్రాంతులకు గు రిచేసిన మార్సా (మెథిలీషియన్ రెసిస్టెంట్ స్టిఫైలో కాకస్ ఆరియోస్) వ్యాధి లక్షణాలు రాష్ట్రంలోని మంగళూరులోని విద్యార్థుల్లో గుర్తించినట్లు సమాచారం. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి యూటీ ఖాదర్ మాత్రం మార్సా అన్న విషయంపై స్పష్టత రాలేదని ఇంకా వ్యాధి నిర్ధారణ పరీక్షల నివేదిక అందాల్సి ఉందన్నారు. అయితే ముందస్తు చర్యల్లో భాగంగా మార్సా ను అరికట్టడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా వైద్యాధికారులకు ఇప్పటికే సూచించినట్లు వెల్లడించారు. మంగళూరులోని ఓ నర్సింగ్ కళాశాల విద్యార్థినుల్లో మార్సా వ్యాధి లక్షణాలను ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు గుర్తించారు. ఈ విషయాన్ని సదరు కళాశాల యాజమాన్యంృదష్టికి తీసుకువెళ్లినా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు శనివారానికి 120 మంది విద్యార్థులకు ఈ వ్యాధి సోకినట్లు అక్కడి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా కళాశాల యాజమాన్యం జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇంతమంది ఈ వ్యాధి బారిన పడేవారు కాదని పేర్కొంటూ కళాశాల ముందు విద్యార్థులు నిరసనకు దిగారు. ఈ విషయమై కళాశాల ప్రిన్స్‌పాల్ మాథ్యూ మాట్లాడుతూ మార్సా సోకినట్లు భావిస్తున్న విద్యార్థులను వేరుగా ఉంచి యాంటీ బయాటిక్స్ ఇస్తున్నామని తెలిపారు.