breaking news
discuss on bill
-
ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశంలో కీలక అంశాలపై చర్చ
న్యూఢిల్లీ: పార్లమెంట్లో మంగళవారం ఉదయం ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ ‘మంగళ్ మిలన్’ సమావేశం జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రసంగించారు. భారత్ ఇటీవల కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టీఏ) విజయం, వ్యూహాత్మక ప్రభావం గురించి పీయూష్ గోయల్ వివరించగా.. మత్స్య రంగ వృద్ధి, ప్రభుత్వ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణను మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ప్రస్తావించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితర అగ్రనేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్లమెంట్ లైబ్రరీ భవనంలోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో జరుగుతున్న ఈ భేటీకి, తొలిసారిగా కొత్తగా ఏర్పడిన ‘నేషనలిస్ట్ సిటిజెన్స్ పార్టీ ఆఫ్ ఇండియా’ (ఎన్సీపీఐ)కు కూడా ఆహ్వానం లభించింది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ను వీడి ఎన్సీపీఐలో చేరిన సుదీప్ బందోపాధ్యాయ, కాకోలి ఘోష్, శతాబ్ది రాయ్ తదితర ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. Delhi: NDA Parliamentary Party's 'Mangal Milan' meeting begins at the Parliament. Prime Minister Narendra Modi, Union Home Minister Amit Shah, Defence Minister Rajnath Singh, and other leaders attend the meeting.(ANI photos by Rahul Singh) pic.twitter.com/ckHDAIG7vJ— ANI (@ANI) July 28, 2026ప్రస్తుత వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఎన్డీఏ ‘మంగళ్ మిలన్’ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. పరీక్షల సంస్కరణలు, విద్యార్థులపై పోలీసుల చర్యలంటూ విపక్షాలు చేస్తున్న ఆందోళనలు ఈ సమావేశంలో ప్రధాన చర్చాంశాలుగా మారాయి. లోక్‌సభలో విపక్షాల నినాదాల మధ్య పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అన్యాయమైన మార్గాల నిరోధక) సవరణ బిల్లు-2026 ప్రవేశపెట్టిన తరుణంలో ఈ సమావేశం ప్రాముఖ్యత సంతరించుకుంది. పేపర్ లీక్‌లు, పరీక్షల అవకతవకలను కఠినంగా అణచివేసేందుకు ఉద్దేశించిన ఈ బిల్లుపై చర్చించేందుకు ఎన్డీఏ పలువురు యువ ఎంపీలను రంగంలోకి దించింది. జులై 20 నాటి ‘సంసద్ చలో’ నిరసనల సమయంలో జరిగిన పోలీసు చర్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు పార్లమెంట్లో ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. దీనికితోడు కొత్త చట్టం ప్రభావంపై కూడా విపక్షాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. గత సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యార్థుల వెంటే ఉంటుందని, పేపర్ లీక్‌లు జాతీయ ఆందోళనకర అంశమని, దీనిపై రాజకీయాలు చేయకూడదని స్పష్టం చేశారు. పరీక్షల అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణే ప్రభుత్వ ప్రాధాన్యమని ఆయన పునరుద్ఘాటించారు.తొలగిన ప్రతిష్టంభన..పబ్లిక్ పరీక్షల బిల్లుపై చర్చపార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి కొనసాగుతున్న ప్రతిష్టంభన తొలగింది. మంగళవారం లోక్‌సభలో పబ్లిక్ పరీక్షల (అక్రమాల నివారణ) సవరణ బిల్లు, 2026పై చర్చ జరగనుంది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో వివిధ పార్టీల నేతలతో జరిపిన సంప్రదింపులు ఫలించడంతో సభ సజావుగా సాగేందుకు మార్గం సుగమమైంది. నీట్ పేపర్ లీక్ ఉదంతం నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడం, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యవస్థీకృత పరీక్షల మోసాలను అణచివేయడానికి కేంద్రం ఉద్దేశించిన నూతన బిల్లును ప్రధాని కార్యాలయ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. -
కంట్రీలో ఉండే అర్హతలేని కిరణ్: శంకర్రావు
సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా శనివారం సీఎం కిరణ్‌పై కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు విరుచుకుపడ్డారు. రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్న కిరణ్‌కు దేశంలో ఉండే అర్హతలేదన్నారు. ఈ సమయంలో సీఎం కూడా అసెంబ్లీలోనే ఉన్నారు. ‘సోనియా దయ వల్ల మీకు సీఎం పదవి దక్కిన విషయం మరచిపోకండి. సోనియా వల్లనే బిల్లు వచ్చింది. దానిని మీరు వ్యతిరేకించడం మంచిది కాదు. సీఎం తీరును తీవ్రంగా ఖండిస్తున్నా.. బిల్లుపై ఓటింగ్ పెట్టే విధంగా సభ్యులను ప్రేరేపిస్తున్నారు.. మీరు రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నారు.. కంట్రీలో ఉండే అర్హత మీకు లేదు, బిల్లును వ్యతిరేకిస్తే.. చరిత్ర క్షమించదు. మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రా? లేక చిత్తూరుకే సీఎంవా ?’ అని కిరణ్‌ను శంకర్రావు నిలదీశారు. ఈ సమయంలో కొందరు కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సోనియా దయ వల్లే తెలంగాణ వస్తున్నదని, అందుకే కొత్త రాష్ట్రానికి ‘సోనియా తెలంగాణ’ అనే పేరు పెట్టడానికి అసెంబ్లీలో తీర్మానం చేయాలని శంకర్రావు సూచించారు. -
సమైక్య తీర్మానం, ఓటింగ్‌తోనే పరిష్కారం
ఒంగోలు కలెక్టరేట్/మార్కాపురం/కందుకూరు, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చించాలన్న తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పాలకుల వాదనపై జిల్లాలోని సమైక్యవాదులు భగ్గుమంటున్నారు. అసెంబ్లీలో సమైక్య తీర్మానంతోగానీ, విభజన బిల్లుపై ఓటింగ్ ప్రక్రియతోగానీ ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని వారంతా స్వాగతిస్తున్నారు. బిల్లుపై చర్చ పేరుతో రాష్ట్రాన్ని విభజించేందుకు సీఎం కుట్రచేస్తున్నారని విమర్శిస్తున్నారు. అసెంబ్లీలో రాష్ట్ర విభజన బిల్లుపై జిల్లావాసుల మనోభావాలు ఈ విధంగా ఉన్నాయి... ఓటింగ్‌తో నిజమైన సమైక్యవాదులు తేలుతారు రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి ఓటింగ్ పెట్టాలి. ఓటింగ్‌తోనే నిజమైన సమైక్యవాదులు తేలుతారు. సమైవాదుల ముసుగులో కొంతమంది పబ్బం గడుపుకుంటున్నారు. కాలయాపన కోసమే చర్చను తెరపైకి తీసుకువచ్చారు. - శెట్టి గోపి,ప్రభుత్వ డ్రైవర్ల సంఘ రాష్ట్రనేత ప్రభుత్వంతో అశోక్‌బాబు కుమ్మక్కు రాష్ట్ర విభజనపై ప్రజలు రగులుతుంటే ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారు. ఉద్యోగులు 66 రోజులపాటు సమ్మె చేస్తే దానికి సరైన ఫలితం లేకుండానే ముగించేశారు. విభజనను వ్యతిరేకించే రాజకీయ పార్టీలను కలుపుకోలేదు. సీఎం డెరైక్షన్‌లో సమైక్యాంధ్ర పోరాటం చేశారు. సమైక్యాంధ్ర కోసం నిలబడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇళ్లను చర్చల్లో పాల్గొనకుంటే ముట్టడిస్తామనడం అశోక్‌బాబు అవివేకం. - మాంటిస్సోరి ప్రకాష్, సమైక్యాంధ్ర ట్యుటోరియల్స్ నేత చర్చించినా పరిష్కారం లభించదు రాష్ట్ర విభజన బిల్లు గురించి చర్చించినా ఎలాంటి పరిష్కారం లభించదు. ఎన్ని రోజులు చర్చించినా ఉపయోగం ఉండదు. చర్చ అంశాన్ని పక్కనపెట్టి ఓటింగ్ కోసం సీమాంధ్రలోని అన్ని రాజకీయ పార్టీలు పట్టుబట్టాలి. ఓటింగ్ ద్వారా విభజనను వ్యతిరేకిస్తున్నట్లు తేలుతోంది. వైఎస్ విజయమ్మ సూచనకు అన్ని పార్టీలు సహకరించాలి. - సాంబశివరావు, విద్యుత్ జేఏసీ జిల్లా కన్వీనర్


