కంట్రీలో ఉండే అర్హతలేని కిరణ్: శంకర్రావు | Sakshi
Sakshi News home page

కంట్రీలో ఉండే అర్హతలేని కిరణ్: శంకర్రావు

Published Sun, Jan 19 2014 1:56 AM

కంట్రీలో ఉండే అర్హతలేని కిరణ్:  శంకర్రావు - Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా శనివారం సీఎం కిరణ్‌పై కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు విరుచుకుపడ్డారు. రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్న కిరణ్‌కు దేశంలో ఉండే అర్హతలేదన్నారు. ఈ సమయంలో సీఎం కూడా అసెంబ్లీలోనే ఉన్నారు. ‘సోనియా దయ వల్ల మీకు సీఎం పదవి దక్కిన విషయం మరచిపోకండి. సోనియా వల్లనే బిల్లు వచ్చింది. దానిని మీరు వ్యతిరేకించడం మంచిది కాదు.
 
  సీఎం తీరును తీవ్రంగా ఖండిస్తున్నా.. బిల్లుపై ఓటింగ్ పెట్టే విధంగా సభ్యులను ప్రేరేపిస్తున్నారు.. మీరు రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నారు.. కంట్రీలో ఉండే అర్హత మీకు లేదు,  బిల్లును వ్యతిరేకిస్తే.. చరిత్ర క్షమించదు. మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రా? లేక చిత్తూరుకే సీఎంవా ?’ అని  కిరణ్‌ను శంకర్రావు నిలదీశారు. ఈ సమయంలో కొందరు కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సోనియా దయ వల్లే తెలంగాణ వస్తున్నదని, అందుకే కొత్త రాష్ట్రానికి ‘సోనియా తెలంగాణ’ అనే పేరు పెట్టడానికి అసెంబ్లీలో తీర్మానం చేయాలని శంకర్‌రావు సూచించారు.

Advertisement
Advertisement