breaking news
devotees donations
-
కానుకలు తీసుకోవద్దు
భువనేశ్వర్: భక్తుల నుంచి విరాళాలు, కానుకలు స్వీకరించవద్దని ప్రఖ్యాత పూరీ జగన్నాథస్వామి ఆలయంలో పనిచేసే సేవకులకు సుప్రీంకోర్టు సూచించింది. కానుకలు ఇవ్వని భక్తుల పట్ల సేవకులు వివక్ష చూపుతున్నారంటూ వచ్చిన వార్తలపై కోర్టు స్పందించింది. సూచనలను ఆలయంలోని పలు ప్రాంతాల్లో అంటించింది. సేవకులకు భక్తులు కానుకలు ఇచ్చే విధానానికి బదులుగా ఏపీలోని తిరుపతి,, జమ్మూకశ్మీర్లోని వైష్ణోదేవి, గుజరాత్లోని సోమనాథ్, పంజాబ్లోని స్వర్ణదేవాలయంలలో అమల్లో ఉన్న వివిధ విధానాలను అధ్యయనం చేసి తగు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఒడిశా ప్రభుత్వాన్ని కోరింది. భక్తులు ఇచ్చే కానుకలపైనే తాము ఆధారపడి జీవిస్తున్నందున ఈ ఆదేశాలను పునః పరిశీలించాలంటూ కొందరు సేవకులు కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నారు. -
నా దగ్గర అసలు డబ్బులే లేవు!
రాధే మా.. ఈ పేరుకు ఇప్పుడు పరిచయం అవసరం లేదు. ప్రత్యేకంగా హెలికాప్టర్ సమకూరిస్తేనే పెళ్లికి వస్తానని చెప్పిన సన్యాసిని! ప్రస్తుతం వరకట్న వేధింపుల కేసులో అరెస్టయి జైల్లో ఊచలు లెక్కపెడుతోంది. ఆమె సంపద గురించి, ఖరీదైన దుస్తులు, నగలంటే ఆమెకున్న మోజు గురించి కథలు కథలుగా అందరూ చెప్పుకొంటారు. ఆమె మేకప్ అయితే.. ఫొటోలలోను, వీడియోల్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ అలాంటి రాధే మా దగ్గర అసలు డబ్బుఏ లేవట. తన బ్యాంకు ఖాతాలో కేవలం 8-10 లక్షల రూపాయలు మాత్రమే ఉన్నాయని ఆమె చెబుతోంది. మరి ఖరీదైన దుస్తులు, మేకప్ విషయం ఏంటని అడిగితే.. భక్తులు ఇచ్చిన దుస్తులే తాను వేసుకుంటానని, అలాగే తన మేకప్ కూడా భక్తులే చేస్తారని ఆమె సెలవిచ్చిందట. కుంభమేళాకు తనను రావొద్దంటూ నిషేధించినట్లు వచ్చిన కథనాలన్నీ అవాస్తవమని, తనపై ఎలాంటి నిషేధం లేదని కూడా చెప్పింది. తాను కావాలనుకుంటే నాసిక్ కుంభమేళాకు వెళ్లేదాన్నని, ఇంతకు ముందు కూడా చాలా కుంభమేళాలకు వెళ్లానని రాధే మా తెలిపింది.


