breaking news
DESIGNATED
-
కేసుల కొండ కరిగిస్తా
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా న్యాయస్థానాల నెత్తిన గుదిబండగా తయారైన కేసుల సత్వర పరిష్కారంపై దృష్టిసారిస్తానని కాబోయే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టికరించారు. నవంబర్ 24వ తేదీన సర్వోన్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేయనున్న జస్టిస్ సూర్యకాంత్ శనివారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో మీడియా ప్రతినిధులతో కొద్దిసేపు పిచ్చాపాటీ మాట్లాడారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన ప్రాధాన్యాలకు సంబంధించిన ఆయన తన మనసులోని మాటలను బయటపెట్టారు. ‘‘నా ముందున్న తొలి, అత్యంత ముఖ్యమైన సవాల్ ఏదైనా ఉందంటే అది పేరుకుపోయిన కేసుల కొండ. దేశవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో కుప్పలుతెప్పలుగా పడి ఉన్న పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించడంపై దృష్టిసారిస్తా. ఒక్క సుప్రీంకోర్టులోనే ఏకంగా 90,000 కేసులు పరిష్కారం కోసం ఫైళ్లలో మూలుగుతున్నాయి. అసలు ఇన్ని కేసులు పెరిగేదాకా ఏం చేస్తున్నట్లు? అపరిష్కృతంగా పడి ఉండటానికి కారకులు ఎవరు? బాధ్యతారహితంగా వ్యవహరించింది ఎవరు? అనే అంశాల జోలికి వెళ్లదల్చుకోలేదు. కానీ వీటిని సత్వరం పరిష్కరించాల్సిందే. పేరుకుపోయిన పెండింగ్ కేసుల సంగతేంటి? అని హైకోర్టులు, ట్రయల్ కోర్టుల నుంచి నివేదికలు తెప్పిస్తా’’అని జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఉత్తమం ‘‘కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వ బాటలో పయనించడం చాలా మంచిది. వాస్తవానికి మధ్యవర్తి త్వం అనేది సమస్యలు, కేసులు పరిష్కృతం కావడా నికి అత్యంత చక్కటి మార్గం. కేసుల కొండ కరగాలంటే మధ్యవర్తిత్వ అస్త్రాన్ని ప్రయోగించక తప్ప దు. ఇది కేసుల పరిష్కార వ్యవస్థలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. ఈమధ్యే సుప్రీంకోర్టుకు సంబంధించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ సైతం మధ్యవర్తిత్వం ప్రాముఖ్యతను ప్రస్తావించారు. ఇప్పు డు దేశం మొత్తం ఈ అంశంపైనే చర్చ జరుగుతోంది. భారత్‌లోని బహుళజాతి సంస్థలు, బ్యాంక్‌లు, బీమా సంస్థలు సైతం ఇదే బాటలో పయనించేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి’’అని అన్నారు. నా ఒక్క తీర్పుతో 1,200 కేసులు పరిష్కారం ‘‘ఢిల్లీలో భూ సమీకరణకు సంబంధించి ఒకే తరహా కేసులు చాలా ఉండిపోయాయి. నేనిచి్చన ఒక్క తీర్పుతో ఏకంగా 1,200 కేసులు ఒకేసారి పరిష్కారమయ్యాయి. కీలకమైన చట్టపర, రాజ్యాంగ అంశాలతో ముడిపడిన చాలా కేసులు హైకోర్టుల వద్ద పేరుకుపోయాయి. వీటికి నేను సుప్రీంకోర్టులో విస్తృతస్థాయిలో రాజ్యాంగ ధర్మాసనాలను ఏర్పాటుచేసి పరిష్కారం చూపుతా’’అని అన్నారు. ఈస్థాయికి వచ్చాక అవి ఏపాటి? తమకు వ్యతిరేకంగా వచి్చన తీర్పులపై రాజకీయనేతలు లేదా కొన్ని వర్గాల వాళ్లు చేసే విమర్శలపై జస్టిస్ సూర్యకాంత్ స్పందించారు. ‘‘ఇటీవలికాలంలో న్యాయమూర్తులపైనా నిందలు వేస్తున్నారు. కోర్టుల తీర్పులను సామాజిక మాధ్యమాల వేదికగా తప్పుబడుతున్నారు. జడ్జీలను ఎగతాళి చేస్తూ ట్రోలింగ్ పెరిగింది. అయినాసరే వృత్తి ధర్మం పాటిస్తూ న్యాయమూర్తులు ముందుకు సాగిపోతారు. సుప్రీంకోర్టు జడ్జి లేదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థాయికి ఎదిగిన మేం ఇలాంటి చవకబారు అంశాలను అస్సలు పట్టించుకోము. నా దృష్టిలో సామాజికమాధ్యమం అనేది అసమాజ మా ధ్యమంగా తయారైంది. ఆన్లైన్ వేధింపులు, వ్యాఖ్యానాలను పట్టించుకోను. ఇవి నాపై ప్రభా వం చూపబోవు. వీటి వల్ల అస్సలు ఒత్తిడికి గురికాను. జడ్జీలు, తీర్పులపై సది్వమర్శను మాత్రమే నేను లెక్కలోకి తీసుకుంటా’’అని అన్నారు. కాలుష్యమున్నా కాలు బయటపెడతా ‘‘దేశరాజధానిలో వాయు కాలుష్యం విపరీతంగా ఉంది. పొగచూరినా సరే పాదం కదపాల్సిందే. వాతావరణం ఎలాగున్నా సరే రోజు ఉదయం మారి్నంగ్‌వాక్ చేస్తా. ఖచి్చతంగా దాదాపు గంటసేపు బయట నడుస్తా’’అని అన్నారు. -
ఆర్మీలో ఉన్నత స్థానంలో ఉన్న సెలెబ్రెటీస్
-
‘పార్టీకి పట్టం కట్టేందుకే పాటుపడ్డా’
న్యూఢిల్లీ : పార్టీని అధికారంలోకి తేవడానికే కసితో పనిచేశానని, సీఎం పదవిని చేపట్టాలనే దాహం తనకు లేదని మధ్యప్రదేశ్ సీఎం పగ్గాలు చేపట్టనున్న కమల్‌నాథ్ పేర్కొన్నారు. తాను దశాబ్ధాలుగా రాజకీయాల్లో ఉన్నానని, మధ్యప్రదేశ్‌లో తిరిగి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చే లక్ష్యంతో ముందుకెళ్లానన్నారు. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు. సీఎం ఆశావహులు జ్యోతిరాదిత్య సింధియా, దిగ్విజయ్ సింగ్‌లకు ప్రభుత్వంలో ఎలా భాగస్వామ్యం కల్పిస్తారన్న ప్రశ్నకు బదులిస్తూ ప్రభుత్వంలో అందరికీ ప్రాతినిధ్యం ఉంటుందని చెప్పారు. పార్టీలో సింధియా క్యాంప్, దిగ్విజయ్ క్యాంప్, కమల్‌నాథ్ క్యాంప్ అంటూ ఏమీ లేవన్నారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. మోదీ, అమిత్ షా విన్నింగ్ కాంబినేషన్‌కు మధ్యప్రదేశ్‌లో చెక్ పెట్టామని చెప్పుకొచ్చారు. మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే గవర్నర్‌ను కలవడంపై కమల్‌నాథ్ స్పందిస్తూ గోవాలో బీజేపీకి తగినంత సంఖ్యాబలం లేకున్నా ప్రభుత్వం ఏర్పాటు చేశారని, మధ్యప్రదేశ్‌లో తమకు తగినంత మెజారిటీ ఉన్నందునే గవర్నర్‌తో భేటీ అయ్యామన్నారు. మాయావతితో తాను మాట్లాడానని, తమకు మద్దతు ఇచ్చేందుకు ఆమె అంగీకరించారని, ఎస్పీ సైతం సహకరించేందుకు ముందుకువచ్చిందని అన్నారు. వారు బేషరతుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారని చెప్పారు. తమ ప్రభుత్వంలో అన్ని కులాలు, మతాలకు సమ ప్రాతినిధ్యం ఉంటుందని కమల్‌నాథ్ వెల్లడించారు. అవి తప్పుడు ఆరోపణలు 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో తనపై ఎలాంటి అభియోగాలు లేవని, తనపై ఆరోపణలున్నాయని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని చెప్పారు. సిక్కు వ్యతిరేక ఘర్షణలపై ఏర్పాటైన నానావతి కమిషన్ సరైన ఆధారాలు లేవంటూ కమల్‌నాథ్‌పై అభియోగాలను తోసిపుచ్చింది. కాగా సిక్కుల ఊచకోతలో ప్రమేయం ఉన్న కమల్‌నాథ్‌కు మధ్యప్రదేశ్ సీఎం పదవి కట్టబెట్టడాన్ని సిక్కు సంఘాల ప్రతినిధులు వ్యతిరేకిస్తున్నారు. మధ్యప్రదేశ్ సీఎంగా కమల్ నాథ్‌ను ఎంపిక చేస్తే దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతామని ఢిల్లీకి చెందిన అకాలీదళ్ నేత మంజిందర్ సింగ్ సిర్సా హెచ్చరించారు. -
‘ఒప్పంద’ సెగలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : తెలుగుదేశం పార్టీలో ‘ఒప్పంద’ సెగలు రగులుతున్నాయి. ఎన్నికల ముందు ఎంపీపీ, మునిసిపల్ చైర్మన్లు, జెడ్పీ వైస్ చైర్మన్ సహా పలు పదవులకు రెండున్నరేళ్లు ఒకరిని, మిగిలిన కాలానికి మరొకరిని నియమించేలా ఒప్పందాలు కుదిరాయి. రెండున్నరేళ్లు గడిచినా పదవుల్లో ఉన్నవారు తప్పుకోకపోవడంతో వారితో రాజీనామాలు చేయించేందుకు పార్టీ ముఖ్యులు సామదాన దండోపాయల్ని ప్రయోగిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేలుస్తున్నారు. ఇటీవల పెనుగొండ ఎంపీపీ వివాదం తెరపైకి రాగా.. తాజాగా ఏలూరు ఎంపీపీ, జెడ్పీ వైస్ చైర్మన్ పదవుల విషయంలో ఒప్పందాలు టీడీపీ అధిష్టానానికి తలబొప్పి కట్టిస్తున్నాయి. కుదరదంతే.. పెనుగొండ మండల ప్రజాపరిషత్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు పల్లి జూలీ సురేఖ ససేమిరా అనడంతో తెలుగుదేశం పార్టీలో వివాదం రాజుకొంది. ఎంపీపీ పదవికి మొదటి రెండున్నర సంవత్సరాలు పల్లి జూలీ సురేఖ, అనంతరం చీకట్ల భారతి పనిచేసేలా ఒప్పందం కుదిరింది. ఈ ప్రకారమే ఎన్నికల ఖర్చును ఇద్దరూ భరించాలని పెద్ద మనుషులు తీర్మానం చేయించారు. సురేఖ పదవీ కాలం జనవరి 4వ తేదీతో ముగిసింది. అయితే, డిసెంబర్ నెలలోనే ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణను కలసిన సురేఖ తాను ఎంపీపీ పదవికి రాజీనామా చేయడం లేదని తేల్చి చెప్పారు. ఏలూరు ఎంపీపీ రాజీనామా విషయంలో ఎంపీపీ భర్త, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై విరుచుకుపడ్డారు. సాధారణ ప్రజలు, అధికారులతో ఇష్టానుసారం మాట్లాడినటయగా పార్టీ కార్యకర్తలు, నాయకులను దూషిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించే స్థాయికి ఈ వివాదం వెళ్లింది. చింతమనేని ప్రభాకర్ ఏలూరు మండల పరిషత్ అధ్యక్ష పదవిని కొల్లేరు గ్రామాలకు కట్టబెట్టేందుకు రూ.40 లక్షలు దండుకున్నాడని ఆరోపించారు. ‘దెందులూరు నియోజకవర్గంలోని అమాయక ప్రజల భయపడతారు కానీ.. ఏలూరు నగరంలో నీ ఆటలు సాగవు’ అంటూ చింతమనేనిని బహిరంగంగా హెచ్చరించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. తాజాగా జెడ్పీ వైస్ చైర్మన్ వ్యవహారం కూడా ముదురుతోంది. ఈ పదవి కేటాయింపు విషయమై కుదిరిన ఒప్పందంలో తొలి గడువు ముగియడంతో.. వైఎస్ చైర్మన్ ఎన్నిక తెరపైకి వచ్చింది. 2014లో జెడ్పీ చైర్మన్ పదవి ముళ్లపూడి బాపిరాజుకు ఏకగ్రీవం అయినప్పటికీ ఉపాధ్యక్ష పదవిలో పోటీ ఏర్పడింది. ఈ పదవిని వెనుకబడిన తరగతులకు చెందిన మహిళా జెడ్పీటీసీకి కేటాయించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఆకివీడు, బుట్టాయగూడెం జెడ్పీటీసీలు వైస్‌చైర్మన్ గిరీకోసం పోటీ పడ్డారు. మెట్ట ప్రాంతానికి చైర్మన్ పదవి వచ్చినందున, డెల్టా ప్రాంతానికి వైస్ చైర్మన్ పదవి కేటాయించాలని అక్కడి ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. 2014 జనవరి 4న ఏలూరులోని టీడీపీ కార్యాలయంలో జెడ్పీ వైస్ చైర్మన్ పదవి ఎవరికి కేటాయించాలనే దానిపై చర్చించారు. చర్చల్లో ఏలూరు ఎంపీ మాగంటి బాబు పట్టుదలతో రెండున్నరేళ్లు ఒకరికి, మరో రెండున్నరేళ్లు పదవిని కట్టబెట్టేలా ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా మొదటి రెండున్నరేళ్లు తన అనుచర వర్గానికి చెందిన బుట్టాయగూడెం జెడ్పీటీసీ చింతల వెంకట రమణకు పదవిని కేటాయించారు. ఈ ఏడాది జనవరి 5 తేదీ నాటికి ఆమె వైస్ చైర్మన్ పదవి చేపట్టి రెండున్ననేళ్లు పూర్తయ్యింది. దీంతో ఆకివీడుకు చెందిన జెడ్పీటీసీ మన్నే లలితాదేవి జెడ్పీ వైస్ చైర్మన్ పదవి కోసం పావులు కదుపుతున్నారు. ఒప్పందం ప్రకారం తనకు రెండున్నరేళ్ల అనంతరం పదవిని కేటాయిస్తానని అప్పట్లో మాట ఇచ్చిన ఉండి ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు ద్వారా ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకూ ప్రస్తుత జెడ్పీ వైస్ చైర్మన్ రాజీనామా చేయకపోవడంతో ఈ వ్యవహారం పార్టీలో ముసలం రేపే పరిస్థితి కనిపిస్తోంది.


