breaking news
deportation plan
-
పాత ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ కేసులతో ట్రంప్ పంపేస్తారా?
వాషింగ్టన్: అమెరికాలోని ప్రతి ఒక్క ఉద్యోగం అమెరికన్లకే దక్కాలనే దురాశతో దొరికిన ప్రతి ఒక్క అవకాశాన్ని, లొసుగును వాడుకునేందుకు ప్రయత్నిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈసారి గ్రీన్‌కార్డ్, వీసాదారులను దేశం నుంచి బహిష్కరించేందుకు కొత్త ఎత్తుగడతో ముందుకొచ్చారు. మద్యం తాగి వాహనం నడపడంతో నమోదైన పాత కేసులను సైతం తిరిగి తోడి ఆయా వ్యక్తులపై మళ్లీ నేరాభియోగాలు మోపి దేశం నుంచి బహిష్కరించాలని ట్రంప్ సర్కార్ కంకణం కట్టుకుంది. ఇందులోభాగంగా ఇప్పటికే ‘ప్రొటెక్షన్ అవర్ కమ్యూనిటీస్ ఫ్రమ్ డ్రంక్ అండర్ ఇన్ప్లూయన్స్’చట్టాన్ని అక్కడి కాంగ్రెస్ ప్రతినిధుల(దిగువ)సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు జూలై చివరివారంలో ఆమోద ముద్రపడింది. వెంటనే దీనిని ఎగువ సభ అయిన సెనేట్‌లో ప్రవేశపెట్టారు. జూన్‌లో ఈ బిల్లును సెనేట్ జుడీíÙయరీ, రూల్స్ కమిటీ పరిశీలనకు పంపించారు. అక్కడ బిల్లుకు ఆమోదముద్రపడితే సెనేట్‌లో తర్వాత ఆమోదం పొందే అవకాశాలు మెరుగవుతాయి. ఈ లెక్కన బిల్లు చివరకు చట్టంగా మారితే ఇప్పటికే పాత ‘డ్రంక్ అండ్ డ్రైవ్’కేసులున్న గ్రీన్‌కార్డ్ పొందిన భారతీయులకూ కష్టాలు మొదలుకానున్నాయి. ఇక విద్యార్థి, హెచ్–1బీ వంటి వీసాలు పొందిన భారతీయులకూ బహిష్కరణ వేటు పడే అవకాశముంది. ఇమిగ్రేషన్ అండ్ నేషనల్ చట్టానికి సవరణలు తెస్తూ ఈ హెచ్.ఆర్.875 బిల్లును తీసుకొచ్చారు. అమెరికా పౌరసత్వంలేని విదేశీయులు అమెరికాలో మద్యం తాగి, లేదంటే మద్యం మత్తులో వాహనం నడిపి రోడ్డు ప్రమాదం చేసినా, అమెరికన్ల ప్రాణాలు హరించినా అలాంటి వ్యక్తలను దేశబహిష్కరణ చేయాలనే ప్రధానోద్దేశ్యంతో ఈ బిల్లును తీసుకొచ్చారు. ఈ బిల్లుపై గ్రీన్‌కార్డ్, వీసాదారుల నుంచి సర్వత్రా విమర్శలు, అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. అత్యంత నిర్దయగా నిబంధనలు కొత్త బిల్లులో పేర్కొన్న నిబంధనలు, షరతులు చూస్తుంటే ఎలాగైనా సరే పాత, చిన్నపాటి నేరాలకు పాల్పడిన విదేశీయులను ఖచ్చితంగా దేశబహిష్కరణచేయాలనే ఉద్దేశం్య స్పష్టంగా కనిపిస్తుంది. ‘‘ఒక పదేళ్ల క్రితంనాటి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు అయినాసరే, అది ఇప్పటికే మూసేసిన కేసు అయినాసరే దానిని మళ్లీ తెరచి నేరం మోపుతారు. ఆ కేసులో నిందితుడు క్షమాపణ చెప్పడం, సంబంధిత ట్రయల్ కోర్టు అందుకు సమ్మతి తెలపడం వంటి సందర్భాల్లోనూ పాత కేసులను తిరగతోడి దేశ బహిష్కరణచేస్తారు’’అని వలసదారుల కేసులను వాదించే లాయర్ జోసెఫ్ ట్సాంగ్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘ఇది అత్యంత దారుణమైన బిల్లు. ఉదాహరణకు గ్రీన్కార్డ్దారుడు లేదంటే స్టూడెంట్ వీసా, హెచ్–1బీ వంటి అంతర్జాతీయ వీసా పొందిన వ్యక్తి పదేళ్ల క్రితం మద్యం మత్తులో చిన్నపాటి యాక్సిడెంట్ చేసి తర్వాత కేసు నుంచి బయటపడ్డాను అనుకుందాం. ఈరోజు ఆ వ్యక్తి స్వదేశానికి లేదంటే వేరే పని నిమిత్తం న్యూజిలాండ్ వంటి దేశానికి వెళ్లాడనుకుందాం. ఈలోపు హెచ్.ఆర్.875 బిల్లు చట్టంగామారితే ఇకపై ఆ వ్యక్తిని అమెరికాలోకి అనుమతించబోరు. కనీసం ఆ పాత కేసుపై వాదించుకునే అవకాశం అతనికి ఇవ్వబోరు. నిన్ను అమెరికాలోకి అనుమతించబోమనే ముంద్తు హెచ్చరిక కూడా ప్రభుత్వం పంపబోదు. అసలు అమెరికాలోకి వచ్చే అధికారిక మార్గాలన్నీ మూసుకుపోతాయి. ఇంతటి నిర్దయ నిబంధనలు ఈ బిల్లులో ఉన్నాయి’’అని జోసెఫ్ చెప్పారు. ‘‘ఎలాంటి అధికారిక పత్రాలు లేని వలసదారులు, వీసా, శాశ్వత స్థిరనివాస హోదా సవరణ కోసం దరఖాస్తు చేసుకుని వేచిచూస్తున్న వ్యక్తులకు సైతం ఈ బిల్లు వర్తిస్తుంది’’అని వలసదారుల న్యాయసేవల సంస్థ ‘ల్యాండర్హోమ్ ఇమిగ్రేషన్’పేర్కొంది. ఈ బిల్లు చట్టంగా మారేలోపే పాత కేసులున్న వ్యక్తులు తక్షణం కోర్టులను ఆశ్రయించి తమ వాదనలను వినిపించడం ఉత్తమమని ఈ సంస్థ అభిప్రాయపడింది. -
స్టైòపెండ్తో పాటు విమాన టికెట్
వాషింగ్టన్: అమెరికాలోని అక్రమ వలసదారుల పట్ల కఠిన వైఖరి ఆవలంబిస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాస్తంత మెత్తబడ్డారు. ‘సెల్ఫ్–డిపోర్ట్’ఆప్షన్ ఎంచుకునే వలసదారులకు విమాన టికెట్లు కొనివ్వడంతోపాటు స్టైఫండ్‌గా కొంత డబ్బు కూడా అందజేయాలనే యోచన ఉన్నట్లు ట్రంప్ తెలిపారు. ఇది అన్ని దేశాల వలసదారులకూ వర్తిస్తుందన్నారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనీ విషయం వెల్లడించారు. ప్రస్తుతం హంతకులను మాత్రమే దేశం నుంచి పంపించివేస్తున్నామంటూనే ఆయన.. అక్రమంగా ఉంటున్న ఇతరులకు సాయప డేందుకు ‘సెల్ఫ్–డిపోర్టేషన్ ప్రోగ్రామ్’ను అమలు చేయనున్నామన్నారు. సొంత దేశాలకు వెళ్లాక వీరిలో సత్ప్రవర్తన కలిగి ఉన్న వారిని తిరిగి అమెరికాకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. అయితే, ఈ పథకాన్ని ఎప్పటి నుంచి వర్తింపజేస్తారు, ఇతర వివరాలను ఆయన వెల్లడించలేదు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు ట్రంప్ జనవరిలో అధ్యక్ష బాధ్యతలను చేపట్టినప్పటి నుంచి అక్రమ వలసదారులను నిర్బంధించి, వారిని బలవంతంగా సొంత దేశాలకు పంపిస్తున్న విషయం తెల్సిందే. ఇంటర్వ్యూ సందర్భంగా ఫాక్స్ న్యూస్ యాంకర్ రాచెల్ కంపోస్–డఫీ మెక్సికో వాసి వీడియో క్లిప్‌ను ప్రదర్శించారు. ‘నేను ట్రంప్‌కు ఓటేయలేదు. అయినప్పటికీ నా మద్దతు ట్రంప్‌కే. నేరాలకు పాల్పడిన వారిని, నాతో సహా ఎవరినైనా సరే సొంత దేశాలకు పంపించడంలో తప్పులేదు’అని ఆ వ్యక్తి తెలిపాడు. ఇరవయ్యేళ్ల క్రితం వచ్చిన ఈ వ్యక్తి ఇప్పుడు అమెరికా పౌరుడు..భార్య, పిల్లలు కూడా ఉన్నారని యాంకర్ డఫీ వివరించారు. ఇది చూసిన ట్రంప్..తమకు కావల్సింది ఇలాంటి వాళ్లేనన్నారు. అతడికి డిపోర్టేషన్ ముప్పు ఉన్నట్లు భావించడం లేదన్నారు. అవసరమైన సిబ్బందిని నియమించుకునే అవకాశం ఇవ్వడం ద్వారా హోటళ్లు, వ్యవసాయ క్షేత్రాల యజమానులకు సాయం చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న వాళ్లు సొంత దేశాలకు వెళ్లిపోయి, తిరిగి చట్టబద్ధంగా అమెరికా రావాలన్నదే తన ఉద్దేశమన్నారు. అయితే, ఇందుకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నదీ ఆయన వెల్లడించలేదు. -
ఆ రూల్స్ బ్రేక్ చేస్తే.. అమెరికాను వదలాల్సిందే!
డోనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలతో విదేశీయులపై కొరడా ఝుళిపించేందుకు సిద్ధమైంది. ట్రాఫిక్ నిబంధనల నుంచి ఏ చిన్న నిబంధనను ఉల్లంఘించినా దేశం నుంచి పంపించేసేందుకు అమెరికా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలు మంగళవారం విడుదల చేసిన కొత్త ఇమిగ్రేషన్ పాలసీలో ఉన్నాయి. కొత్త పాలసీకి సంబంధించిన పత్రాలపై సెక్రటరీ జాన్ కెల్లీ సంతకాలు కూడా పూర్తయ్యాయని హోం ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్(డీహెచ్ఎస్) పేర్కొంది. పాలసీ ప్రకారం అక్రమంగా బోర్డర్ దాటిన వారిన, చిన్న తప్పులను చేసిన వారిని అమెరికా ఇక ఏ మాత్రం ఉపేక్షించకుండా పంపేస్తుంది. ఒబామా సారథ్యంలోని అమెరికా ప్రభుత్వం విదేశీయులను ప్రధానంగా రెండు తప్పులు చేసినప్పుడు మాత్రమే దేశం నుంచి పంపేసింది. అవి వీసా గడువు పూర్తయినా కూడా అమెరికాలో నివసిచడం. మరొకటి అనుమతి లేకుండా సరిహద్దులు దాటడం. ట్రంప్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా ఇప్పటివరకూ నేర చరిత్ర కల విదేశీయులను దేశ భద్రతకు ఆటంకం కలిగించేవారుగా పరిగణించాలని నిర్ణయించింది. అంటే వారందరినీ తిరిగి స్వదేశాలకు పంపేస్తారన్నమాట. కొత్త నిబంధనలు-ప్రభావాలు - కొత్త నిబంధనల వల్ల డీహెచ్ఎస్ పని సులువు అవుతుంది. సరిహద్దులో భద్రత, అక్రమ వలసదారులను ఇమిగ్రేషన్ అధికారులు సులువుగా వెనక్కు పంపే వీలు కలుగుతుంది. - అనధికారక లెక్కల ప్రకారం.. అమెరికాలో నివసిస్తున్న మూడు లక్షల మందికి పైగా భారతీయ అమెరికన్లపై కొత్త నిబంధనలు ప్రభావం చూపుతాయి. - వలసదారుల కేసులు కోర్టుల్లో ఉన్నా వారిని అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ నిర్బంధించే అవకాశం ఉంది. అదే మెక్సికోకు చెందిన వారి దగ్గర సరైన పత్రాలు లేకపోతే వారిని వెంటనే తిరిగి వెనక్కు పంపేస్తారు. - అమెరికా-మెక్సికోల మధ్య రెండు వేల మైళ్ల పాటు నిర్మించనున్న గోడపై కూడా ఈ పాలసీలో క్లారిటీ ఇచ్చారు. - మెక్సికో నుంచి అమెరికాలో ప్రవేశించిన ఇతర దేశస్ధులను మెక్సికోకు తిరిగి పంపేయాలని తాజా పాలసీలో నిర్ణయించారు. - కొత్తగా 10 వేల ఉద్యోగాలు యూఎస్ ఇమిగ్రేషన్‌లో, 5 వేల ఉద్యోగాలు యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఏజెంట్స్‌లో భర్తీ చేయనున్నట్లు పాలసీలో పేర్కొన్నారు.