breaking news
deploye
-
12 నూక్లియర్ ఆయుధాలు మోహరింపు : ఇండియా వ్యూహాత్మక మార్పు!
సాక్షి, న్యూఢిల్లీ: అణ్వాయుధ విధానానికి సంబంధించి ఇండియా ముఖ్యమైన అణు వ్యూహాత్మక మార్పుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తొలిసారిగా 12 అణ్వాయుధాలను (Nuclear Warheads) మోహరిం చిందంటూ అంతర్జాతీయ పరిశోధన సంస్థ (సిప్రి) రిపోర్ట్ సంచలనంగా మారింది. అణ్వాయుధ సామర్థ్యాన్ని పెంచుకునే క్రమంలో ఇప్పటికే దేశం వద్ద 190 అణ్వాయుధాలుఉన్నాయని ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆయుధ పర్యవేక్షణ సంస్థ SIPRI ఈ నివేదిక తాజాగా విడుదల చేసింది.స్టాక్‌హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ (SIPRI) తాజా నివేదిక ప్రకారం భారతదేశం మొట్టమొదటి సారిగా 12 అణ్వాయుధాలను మోహరించింది. భారతదేశం తన దశాబ్దాల కాలపు అణువిధానాన్ని పక్కనబెట్టి, తొలిసారిగా 12 అణు వార్హెడ్లను వ్యూహాత్మకంగా మోహరించింది. గతంలో అణు వార్హెడ్లను, వాటిని ప్రయోగించే క్షిపణులను వేర్వేరు నిల్వ కేంద్రాలలో భద్రపరిచే విధానాన్ని (Separate Storage Policy) భారత్ అనుసరించేది. అయితే ఇప్పుడు వాటిని సిద్ధంగా ఉంచడం ద్వారా దేశ రక్షణలో ఉన్నత స్థాయి సంసిద్ధతకు సంకేతమని తెలిపింది.శాంతిసమయంలో కూడా క్షిపణులను సిద్ధంగా ఉంచడం, సముద్రంలో నిరంతర నిఘా లాంటి చర్యలు భారతదేశ రక్షణ సంసిద్ధతను సరికొత్త స్థాయికి తీసుకెళ్లాయని SIPRI నివేదిక వెల్లడిస్తోంది. అయితే దశాబ్దాలుగా అణ్వాయుధాలను, వాటిని ప్రయోగించే వ్యవస్థలను వేర్వేరు నిల్వ కేంద్రాలలో ఉంచే విధానానికి బదులుగా ఇది విరుద్ధమైన చర్య అని పేర్కొంది.ఇదీ చదవండి: 10 రోజులు లీవ్ తర్వాత ఉద్యోగికి బాస్ బంపరాఫర్నివేదికలోని ముఖ్యాంశాలు భారత అణు చరిత్రలో ఈ వార్హెడ్లను కేవలం నిల్వ ఉంచడమే కాకుండా, ప్రయోగానికి సిద్ధంగా ఉన్నట్లు (Operationally Deployed) వర్గీకరించడం ఇదే మొదటిసారి. ఈ 12 వార్హెడ్లను క్షిపణులతో అనుసంధానించడం (Mating) లేదా సముద్రగర్భ నిఘా నిర్వహించే అణు జలాంతర్గాములపై (SSBNs) ఉంచడం ద్వారా క్షేత్రస్థాయి దళాల వద్ద సిద్ధంగా ఉంచారు.2026 జనవరి నాటికి భారతదేశం వద్ద ఉన్న మొత్తం అణు ఆయుధాల సంఖ్య 190కి చేరిందని అంచనా (గత ఏడాదితో పోలిస్తే స్వల్పంగా పెరిగింది). ఇవి వైమానిక, భూతల మరియు సముద్ర రక్షణ వ్యవస్థలతో అనుసంధానించబడి ఉన్నాయి. ఇదీ చదవండి: 40ల తరువాత అల్ట్రామారథాన్ : తృటిలో తప్పిన ముప్పు"నో ఫస్ట్ యూజ్" (No First Use) విధానంఅణ్వాయుద విధానంలో వ్యూహాత్మక మార్పు జరిగినప్పటికీ, ఇండియా తన ప్రాథమిక అణు విధానమైన "నో ఫస్ట్ యూజ్" (మొదటగా అణు దాడి చేయకూడదు) అనే సూత్రానికే కట్టుబడి ఉంది. శత్రు దేశాలు అణు దాడికి పాల్పడితే మాత్రమే, ప్రతీకార చర్యగా మాత్రమే, భారత్ తన అణు ఆయుధాలను ఉపయోగిస్తుంది. అంతేకాదు భారతదేశం పమర్థవంతమైన అణ్వాయుధాలను కలిగి ఉంది. ఈ సామర్థ్యం ఆయుధ పోటీలో పాల్గొనడానికి కాకుండా, కేవలం దురాక్రమణదారులను నిరోధించడానికే రూపొందించబడింది.భారత్ అణుసామర్థ్యం పరిమితమైనప్పటికీ, దీన్ని ఆయుధాల పోటీ కోసం కాకుండా, దేశ రక్షణ కవచంగా మాత్రమే భావిస్తుంది. -
యుద్ధ విమానం నుంచి జారిపడ్డ సామగ్రి
జైపూర్: భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్) చెందిన యుద్ధ విమానం గాల్లో దూసుకెళ్తుండగా అనూహ్యమైన సంఘటన జరిగింది. సాంకేతిక సమస్యతో పలురకాల వైమానిక సామగ్రి జారిపడింది. రాజస్తాన్‌లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్ సమీపంలో బుధవారం ఈ ఘటన జరిగింది. యుద్ధ విమానం అనుకోకుండా నిర్మానుష్య ప్రాంతంలో సామగ్రిని జారవిడిచినట్లు అధికారులు తెలియజేశారు. ప్రాణ, ఆస్తి నష్టమేమీ జరగలేదన్నారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. జారిపడిన సామగ్రి ఏమిటన్నది బయటపెట్టలేదు. సైనిక భాషలో బాంబు, క్షిపణులు, ఆయుధాలు, చమురు ట్యాంక్‌లను కూడా వైమానిక సామగ్రిగా పిలుస్తుంటారు. -
డ్రాగన్ దూకుడుకు చెక్
సాక్షి, న్యూఢిల్లీ : భారత్- చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో డ్రాగన్ దూకుడుకు చెక్ పెట్టేందుకు భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు మరణించిన కొద్ది నెలల అనంతరం భారత నౌకాదళం దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో యుద్ధ నౌకను మోహరించింది. దక్షిణ చైనా సముద్ర ప్రాంతం వద్ద తాము కీలక యుద్ధ నౌకను మోహరించామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయని ఆదివారం ఓ జాతీయ వార్తాఛానెల్ పేర్కొంది. దక్షిణ చైనా సముద్రం ఆవల గస్తీ కాస్తున్న అమెరికన్ యుద్ధ నౌకలతో భారత యుద్ధనౌక సంప్రదింపులు జరుపుతోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కి ఇక వివాదాస్పద ప్రాంతంలో భారత యుద్ధ నౌకల కదలికలపై డ్రాగన్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తూర్పు లడఖ్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో భారత యుద్ధవిమానాల మోహరింపు ప్రాధాన్యత సంతరించుకుంది. దక్షిణ చైనా సముద్రంపై ప్రాబల్యం కలిగిన చైనా ఆ ప్రాంతంలో ఇతర దేశాల యుద్ధవిమానాల ఉనికిని వ్యతిరేకిస్తోంది. మరోవైపు దక్షిణ చైనా సముద్రంపై చైనా ప్రాబల్యానికి చెక్ పెట్టేందుకు అమెరికా పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. చదవండి : చైనా దూకుడు: మిస్సైల్ బేస్‌ల నిర్మాణం! -
వీధివీధిన ఖాకీల బూట్ల చప్పుడు
న్యూఢిల్లీ: ఢిల్లీ అంతటా ఖాకీ బూట్లు చప్పుళ్లు చేస్తున్నాయి. ఇందులో ప్రత్యేక పోలీసు టీంలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక బృంద పోలీసులు కూడా ఇందులో ఉండటం గమనార్హం. జేఎన్‌యూ వివాదానికి సంబంధించి పోలీసులు కేసులు పెట్టిన విద్యార్థుల్లో కొంతమంది అరెస్టులకు భయపడి కనిపించకుండా పోయిన విషయం తెలిసింది. ముఖ్యంగా ఇందులో ఉమర్ ఖలీద్ అనే పీహెచ్డీ స్కాలర్ పై దేశ ద్రోహం ఆరోపణలు ఉన్నాయి. దీంతో వీరిని అరెస్టు చేసేందుకు పోలీసులు అంగుళం వదిలిపెట్టకుండా గాలిస్తున్నారు. ఇప్పటికే లుకౌట్ నోటీసులు విడుదల చేసిన వారు వారిని ఎలాగైనా అదుపులోకి తీసుకునేందుకు అన్ని మార్గాలు అనుసరిస్తున్నారు. వారు విదేశాలకు పారిపోతారేమోనని ఇప్పటికే అన్ని విమానాశ్రయాల్లో అప్రమత్తం విధించారు. వారికి అసలు పాస్‌పోర్ట్‌లే లేవని ఆ విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తుండగా ఉండిఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఫారిన్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు పోలీసులు విద్యార్థుల సమాచారం అందించారు.


