వీధివీధిన ఖాకీల బూట్ల చప్పుడు | Afzal Guru row: Cops alert airports on JNU absconders | Sakshi
Sakshi News home page

వీధివీధిన ఖాకీల బూట్ల చప్పుడు

Feb 21 2016 9:21 AM | Updated on Aug 21 2018 5:51 PM

ఢిల్లీ అంతటా ఖాకీ బూట్లు చప్పుళ్లు చేస్తున్నాయి. ఇందులో ప్రత్యేక పోలీసు టీంలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక బృంద పోలీసులు కూడా ఇందులో ఉండటం గమనార్హం.

న్యూఢిల్లీ: ఢిల్లీ అంతటా ఖాకీ బూట్లు చప్పుళ్లు చేస్తున్నాయి. ఇందులో ప్రత్యేక పోలీసు టీంలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక బృంద పోలీసులు కూడా ఇందులో ఉండటం గమనార్హం. జేఎన్యూ వివాదానికి సంబంధించి పోలీసులు కేసులు పెట్టిన విద్యార్థుల్లో కొంతమంది అరెస్టులకు భయపడి కనిపించకుండా పోయిన విషయం తెలిసింది. ముఖ్యంగా ఇందులో ఉమర్ ఖలీద్ అనే పీహెచ్డీ స్కాలర్ పై దేశ ద్రోహం ఆరోపణలు ఉన్నాయి.

దీంతో వీరిని అరెస్టు చేసేందుకు పోలీసులు అంగుళం వదిలిపెట్టకుండా గాలిస్తున్నారు. ఇప్పటికే లుకౌట్ నోటీసులు విడుదల చేసిన వారు వారిని ఎలాగైనా అదుపులోకి తీసుకునేందుకు అన్ని మార్గాలు అనుసరిస్తున్నారు. వారు విదేశాలకు పారిపోతారేమోనని ఇప్పటికే అన్ని విమానాశ్రయాల్లో అప్రమత్తం విధించారు. వారికి అసలు పాస్పోర్ట్లే లేవని ఆ విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తుండగా ఉండిఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఫారిన్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కు పోలీసులు విద్యార్థుల సమాచారం అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement