breaking news
DEO rameshbabu
-
వారంలో మూడుసార్లు గుడ్డు తప్పనిసరి
డీఈఓ రమేష్‌బాబు నర్సాపూర్‌రూరల్: మధ్యాహ్న భోజన పథకంలో వారంలో మూడుసార్లు తప్పనిసరి విద్యార్థులకు గుడ్లు వడ్డించాలని డీఈఓ రమేష్‌బాబు సూచించారు. మధ్యాహ్న భోజనంలో వారంలో మూడుసార్లు గుడ్లుపెట్టని వంట కార్మికులను తొలగిస్తామన్నారు. మూడుసార్లు గుడ్లు అందే విధంగా హెచ్ఎంలు , మండల విద్యాధికారి గమనించాలన్నారు. గుడ్లకు బదులు పండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు ఇవ్వకూడదని సూచించారు. గురువారం నర్సాపూర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల-2ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. 10వ తరగతి విద్యార్థులను కొన్ని ప్రశ్నలు వేసి బోర్డుపై స్పెల్లింగ్‌తో కూడిన పదాలను రాయించారు. టెన్త్‌క్లాస్ విద్యార్థులకు ప్రత్యేకంగా ఉదయం, సాయంత్రం వేళల్లో గంటసేపు ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు ఇప్పటికే చర్యలు తీసుకున్నామన్నారు. టెన్త్ పరీక్షలు రాసే విద్యార్థులకు సైకాలజిస్టులతో కౌన్సెలింగ్ చేపట్టేందుకు దసరా సెలవుల అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాలలకు సంబంధించిన జాబితాను పంపించాలని మరమ్మత్తుల కోసం జెడ్పీసీఈఓకు నివేదిస్తామన్నారు. నర్సాపూర్ రావడం ఆనందంగా ఉంది నర్సాపూర్ ప్రభుత్వ కళాశాలలో తాను చదువుకున్నట్లు డీఈఓ రమేష్‌బాబు తెలిపారు. అప్పట్లో ఇంటర్‌తోపాటు ప్రభుత్వ ఉన్నత పాఠశాల షిప్టుల పద్దతిన ఉదయం, సాయంత్రం నడిచేవన్నారు. తాను ఇంటర్ ఇదే పాఠశాల, కళాశాలలో చదివినట్లు తెలిపారు. ఇక్కడికి రావడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. పాఠశాల తరగతి గదులన్నీ కలియ తిరిగి తన గతస్ముృతులను గుర్తు చేసుకున్నాడు. -
అక్టోబర్ 1 నుంచి ‘ఓపెన్’ సప్లిమెంటరీ ఎగ్జామ్స్
సంగారెడ్డి మున్సిపాలిటీ: ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాటు చేసినట్లు డీఈఓ రమేష్‌బాబు ఓ ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 1 నుంచి 14 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ప్రతిరోజు ఉదయం 9.30 గంటల నుంచి 12.30 వరకు, మధ్యాహ్న 2 గంటల నుంచి 5 వరకు పరీక్షలు ఉంటాయని చెప్పారు. ఎనిమిది ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటుచేశామన్నారు. ఇంటర్ పరీక్షలకు 1371 మంది, 10వ తరగతికి 1912 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు.