breaking news
Defense clearance
-
భారత్‌కు జావెలిన్ క్షిపణి వ్యవస్థ
న్యూయార్క్/వాషింగ్టన్: భారత భూతల రక్షణ వ్యవస్థను మరింత పటిష్టంచేసే రక్షణ ఒప్పందం కార్యరూపం దాల్చింది. భారత్‌కు రూ.826 కోట్ల విలువైన ఆయుధాలను విక్రయించేందుకు అమెరికా గురువారం అంగీకారం తెలిపింది. ఇటీవల యుద్ధంలో రష్యా యుద్ధ ట్యాంక్‌లను తుత్తునియలు చేసిన జావెలిన్ క్షిపణి వ్యవస్థలను సైతం ఒప్పందంలోభాగంగా భారత్‌కు అమెరికా విక్రయించనుంది. రష్యా నుంచి ముడిచమురును కొంటున్నందుకు ఆగ్రహించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై 50 శాతం దిగుమతి టారిఫ్‌లను పెంచాక ఆ దేశంతో మోదీ సర్కార్ కుదుర్చుకున్న తొలి రక్షణరంగ ఉత్పత్తుల కొనుగోలు ఒప్పందం ఇదేకావడం విశేషం. దిగుమతి సుంకాల సుత్తితో మోదాక మోదీ సర్కార్ గుర్రుగా ఉండటంతో వేడెక్కిన ఇరుదేశాల సంబంధాలను శాంతపరిచేందుకే అమెరికా ఈ ఒప్పందాలు చేసుకుందని తెలుస్తోంది. తాజా ఒప్పందంపై అమెరికా స్పందించింది. ప్రధానమైన రక్షణరంగ భాగస్వామి దేశంలో భద్రతను పెంచేందుకే ఈ కొనుగోలు ఒప్పందం ఎంతో దోహదపడుతుంది. ఇండో–పసిఫిక్, దక్షిణాసియా ప్రాంతాల్లో రాజకీయ సుస్థిరత, శాంతికి ఈ ఆయుధ కొనుగోలు ఒప్పందం తన వంతు సాయంచేస్తుంది’’ అని అమెరికా పేర్కొంది. రూ. 418 కోట్ల విలువైన ఎం982ఏ1 రకం 216 ఎక్సాక్యాలిబర్ ప్రొజెక్టయిల్స్, సంబంధిత ఉపకరణాలతోపాటు రూ. 408 కోట్ల విలువైన ఎఫ్‌జీఎం–148 రకం 25 జావెలిన్ క్షిపణి వ్యవస్థలు, వాటికి అనుబంధంగా కమాండ్ లాంచ్ యూనిట్లు, 100 వరకు మందుగుండును భారత్‌కు విక్రయించేందుకు తమ విదేశాంగ శాఖ అనుమతి ఇచ్చిందని అమెరికా డిఫెన్స్ సెక్యూరిటీ సహకార ఏజెన్సీ బుధవారం ప్రకటించింది. ప్రభుత్వం తరఫున సాంకేతిక సహకారం, సమాచారం, రిపేర్లు, సేవలను సైతం ఈ ఒప్పందంలో భాగంగా అందివ్వనున్నారు. ఏమిటీ జావెలిన్ క్షిపణి లాంచర్? జావెలిన్ ఎఫ్‌జీఎం–148 యాంటీ ట్యాంక్ క్షిపణి వ్యవస్థను అమెరికా దాదాపు మూడు దశాబ్దాలుగా వినియోగిస్తోంది. సైనికుడు భుజంపై పెట్టుకుని మాటువేసి ప్రయోగించే ఈ జావెలిన్ మిస్సైల్‌తో శత్రుదేశాల యుద్ధట్యాంక్‌లను అవలీలగా పేల్చేయవచ్చు. జావెలిన్ క్షిపణిని ప్రయోగించిన సైనికుడి జాడను కనిపెట్టడం చాలా కష్టం. దీంతో శత్రుయుద్ధట్యాంక్లను వేగంగా తుదముట్టించవచ్చు. జావెలిన్ లాంచర్‌ను సైనికుడు సులభంగా ఎక్కడికైనా మోసుకెళ్లవచ్చు. భూతల సమరంలో పైచేయి సాధించేందుకు భారతీయ సైన్యానికి ఇవి ఎంతగానో ఉపయుక్తంకానున్నాయి. 4 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం అత్యంత కచి్చతత్వంతో పేల్చవచ్చు. దీనిలోని బాంబు బరువు 8 కేజీల పైమాటే. పొడవుగా రెండు కొనల్లో మందుగుండుతో దీనిని డిజైన్‌చేశారు. శత్రు యుద్ధ ట్యాంక్‌ను తాకగానే ఒకసారి పేలిపోయి దాని పైపొర, కవచాన్ని ఛిద్రం చేస్తోంది. వెనువెంటనే మరోసారి పేలి మొత్తం యుద్ధట్యాంక్నే ఛిన్నాభిన్నం చేస్తుంది. రష్యాకు చెందిన వందలాది ట్యాంక్‌లను ఉక్రెయిన్ సైనికులు ఈ జావెలిన్తోనే నాశనంచేశారు. జావెలిన్ భయానికి రష్యా ట్యాంక్‌లతో దాడులను తగ్గించుకుంది. -
పాక్, సౌదీ అరేబియా రక్షణ ఒప్పందం...
దుబాయ్/ఇస్లామాబాద్: పాకిస్తాన్, సౌదీ అరేబియాల రక్షణ ఒప్పందం వల్ల భారత్‌పై ప్రభావం ఏమేరకు ఉంటుందన్నది చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ భారత్‌పై తమపై దాడికి దిగితే ఒప్పందం ప్రకారం సౌదీ అరేబియా సైన్యం తమకు మద్దతుగా నిలస్తుందని పాకిస్తాన్ విశ్వసిస్తోంది. కానీ, క్షేత్రస్థాయి పరిస్థితులను గమనిస్తే పాక్ ఆశలు నెరవేరే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే భారత్, సౌదీ అరేబియాల మధ్య బలమైన స్నేహ సంబంధాలున్నాయి. ఇరుదేశాల మధ్య దశాబ్దాలుగా వాణిజ్య బంధం కొనసాగుతోంది. ఏ దేశమైనా తమపై దాడికి దిగితే ఉమ్మడిగా ఎదుర్కొంటామని ఒప్పందంలో పేర్కొన్నారు. కానీ, ఫలానా దేశం అంటూ పేర్లు ప్రస్తావించలేదు. ఇండియాకు నాలుగో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి సౌదీ అరేబియా. సౌదీ అరేబియాకు రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి ఇండియా. 2024–25లో ఇరుదేశాల మధ్య 41.88 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది. పాక్–సౌదీ అరేబియాల మధ్య వాణిజ్యం దాదాపు 4 బిలియన్ డాలర్లే. పాకిస్తాన్ కోసం భారత్‌పై సౌదీ అరేబియా యుద్ధం చేసే అవకాశం లేదన్నది నిపుణుల అంచనా. పాక్, సౌదీ అరేబియా తాజా ఒప్పందాన్ని ఇజ్రాయెల్ కోణంలో చూడాలని చెబుతున్నారు. ఇజ్రాయెల్ గనుక పాక్‌పై దాడికి పాల్పడితే ఒప్పందం ప్రకారం పాక్‌కు మద్దతుగా సౌదీ అరేబియా సైన్యం రంగంలోకి దిగుతుందని పేర్కొంటున్నారు. ఇటీవలి కాలంలో అరబ్ దేశాలు–ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. భారత్, పాక్ మధ్య ఇప్పటిదాకా నాలుగు యుద్ధాలు జరిగాయి. మూడుసార్లు భీకర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పాక్‌కు అండగా సౌదీ అరేబియా ఏనాడూ జోక్యం చేసుకోలేదన్న సంగతి తెలిసిందే. ఇదీ ఒప్పందంఅణ్వాయుధ దేశం పాకిస్తాన్, సౌదీ అరేబియాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ‘వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం’పై రెండు దేశాలు బుధవారం సంతకాలు చేశాయి. దీనివల్ల ఇరుదేశాల మధ్య రక్షణ బంధం మరింత బలపడనుంది. ఒక దేశంపై దాడి జరిగితే మరో దేశం అండగా నిలుస్తుంది. పాక్, సౌదీ అరేబియాల్లో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా రెండు దేశాలపై జరిగినట్లేనని పరిగణిస్తాయి. రక్షణ రంగంలో పాక్, సౌదీ అరేబియా దశాబ్దాలుగా సహకరించుకుంటున్నాయి. ఈ సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్, పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ పరస్పర రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రక్షణ సహకారాన్ని బలోపేతం చేసుకోవడం, ఎవరైనా దురాక్రమణకు పాల్పడినప్పుడు ఉమ్మడి పోరాటం సాగించడం ఒప్పందం అసలు ఉద్దేశమని పాకిస్తాన్ ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. భద్రత విషయంలో అమెరికాపై ఆధారపడడం తగ్గించుకోవాలని గల్ఫ్ అరబ్ దేశాలు భావిస్తున్నాయి. అమెరికా మిత్రదేశమైన ఇజ్రాయెల్ గతవారం ఖతార్‌లోని దోహా నగరంలో వైమానిక దాడులకు పాల్పడింది. కాల్పుల విరమణ ప్రతిపాదనపై చర్చల్లో పాల్గొన్న హమాస్ నేతలను అంతం చేసేందుకు ప్రయతి్నంచింది. ఈ దాడులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుమతి ఉన్నట్లు అరబ్ దేశాలు భావిస్తున్నాయి. హమాస్–ఇజ్రాయెల్ యుద్ధంతోపాటు తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా నుంచి సెక్యూరిటీ గ్యారంటీ ఇకపై ఆశించినంతగా ఉండకపోవచ్చని అంచనాకొచ్చాయి. అందుకే పొరుగు దేశాలతో రక్షణ ఒప్పందాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే పాక్, సౌదీ అరేబియాల మధ్య ఒప్పందం కుదరడం గమనార్హం. భారత్‌తో సంబంధాలకు అధిక ప్రాధాన్యం: సౌదీ అధికారి ఎన్నో ఏళ్ల చర్చల తర్వాతే పాకిస్తాన్‌తో రక్షణ ఒప్పందం కుదిరినట్లు సౌదీ అరేబియా సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఏవో కొన్ని దేశాలు లేదా కొన్ని ఘటనలను దృష్టిలో పెట్టుకొని జరిగిన ఒప్పందం కాదని స్పష్టంచేశారు. తమ రెండు దేశాల మధ్యనున్న దీర్ఘకాల, లోతైన సహకారాన్ని వ్యవస్థీకృతంగా మార్చుకోవాలన్నదే అసలు లక్ష్యమని వివరించారు. భారత్‌తో సంబంధాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఉద్ఘాటించారు. భారత్–సౌదీ అరేబియాల మధ్య గతంలో ఎన్నడూ లేనంతగా బలమైన సంబంధాలు ఇప్పుడున్నాయని వెల్లడించారు. ప్రాంతీయంగా శాంతి, స్థిరత్వం కోసం భారత్‌తో కలిసి పని చేస్తామన్నారు. భారత్, పాకిస్తాన్లతో సంబంధాల విషయంలో సమతూకం పాటించాలన్నదే తమ విధానమని తెలిపారు. పాక్ ప్రభుత్వం అణు శక్తిని సౌదీ అరేబియాకు అందజేయడానికి అంగీకరించిందా? అని ప్రశ్నించగా.. ఇది సమగ్ర రక్షణ ఒప్పందమని, సైనికపరంగా అన్ని అంశాలూ దీని పరిధిలోకి వస్తాయని స్పష్టంచేశారు. అధ్యయనం చేస్తాం: రణదీర్ జైస్వాల్ పాక్, సౌదీ అరేబియాల రక్షణ ఒప్పందంపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ«దీర్ జైస్వాల్ స్పందించారు. ఈ పరిణామంపై తమకు అవగాహన ఉందని వెల్లడించారు. భారతదేశ భద్రత, ప్రాంతీయ స్థిరత్వంపై ఈ ఒప్పందం చూపే ప్రభావాన్ని అధ్యయనం చేస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఎక్స్’లో పోస్టు చేశారు. -
రెక్కలు ఊపితే... అది స్నేహ చిహ్నం!
రెక్కల చేతులు యుద్ధ విమానాలే కాదు, సాధారణ విమానాలు కూడా డిఫెన్స్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతే బయలుదేరాలి. ‘ఫ్రెండ్లీ’ అనే సంకేతాన్ని జారీ చేసిన తర్వాత విమానాలు టేకాఫ్ అవుతాయి. మన గగనతలంలో మనవి కాని విమానాలు సంచరిస్తున్నట్లు గమనిస్తే వెంటనే వాటిని అడ్డగించడానికి మన ఎయిర్ క్రాఫ్ట్‌ను పంపించాలి. అందుకోసం యుద్ధ విమానాలు సిద్ధంగా ఉంటాయి. అది అనుమానాస్పద విమానానికి ఎదురుగా వెళ్లి రెక్కలు ఊపుతుంది. ఇలా రెక్కలను కదిలించడం అంటే... నీ కదలికలను అనుమానిస్తున్నామని ఎదుటి విమానంలోని పైలట్‌కి సంకేతం ఇవ్వడం! శత్రు విమానం అయితే ఈ సంకేతానికి స్పందించకుండా తాను అనుకున్న లక్ష్యం వైపు వెళ్తుంటుంది. సంకేతాలకు స్పందించడం లేదనే సమాచారాన్ని ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఉన్న పైలట్ మాకు చేరవేస్తాడు. అలాంటప్పుడు పర్యవేక్షణ బృందం తరఫున ఫైరింగ్ ఆదేశాలు జారీ చేస్తాం. (మాజీ రింగ్ కమాండర్ టి.జె.రెడ్డి ఇచ్చిన సమాచారంతో)


