breaking news
Deepak Lather
-
రెండో రోజూ పతకాల పంట
కామన్ వెల్త్ యూత్ గేమ్స్ లో భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. తొలి రోజు నాలుగు మెడల్స్ గెలిచిన భారత్ రెండో రోజు కూడా రెండు స్వర్ణాలతో సహా ఐదు పతకాలు ఖాతాలో వేసుకున్నారు. వెయిట్ లిఫ్టర్ దీపక్ 62కేజీల విభాగంలో స్వర్ణం సాధించగా.. మొహద్ హదీస్ జావెలిన్ త్రో లో స్వర్ణం సాధించాడు. బాలికల 400 మీటర్ల రన్నింగ్ లో జిస్నామాథ్యూస్ రజత పతకం గెలుచుకుంది. 400 మీటర్ల బాలుర విభాగంలో చందన్ బౌరీ, స్వ్కాష్ సింగిల్స్ లో సెంధిల్ కుమార్ లు కాంస్య పతకాలు సాధించారు. -
యూత్ గేమ్స్ లో భారత్ కు మరో స్వర్ణం
కామన్ వెల్త్ యూత్ గేమ్స్ లో భారత్ కు మరో స్వర్ణం దక్కింది. సమోవాలో జరుగుతున్న ఈ క్రీడా పోటీల్లో వెయిట్ లిఫ్టర్ దీపక్ స్వర్ణం సాధించాడు. వెయిట్ లిఫ్టింగ్ 62 కేజీల విభాగంలో 15ఏళ్ల దీపక్ పతకం దక్కించుకున్నాడు. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో తొలి రోజు 56 కేజీల విభాగంలో జంజాంగ్ దేరు స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే.