breaking news
Date of change
-
పుట్టినతేదీ మార్పు కుదరదు
సాక్షి, హైదరాబాద్: కార్మికుడిగా ఉద్యోగంలో చేరినప్పుడు వయసును నిర్ధారిస్తూ వైద్యుడు ఇచ్చే ధ్రువపత్రమే చెల్లుబాటు అవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఏళ్ల తరబడిగా ఉన్న రికార్డుల్లోని పుట్టిన తేదీని, స్కూల్ ఇచ్చిన ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (టీసీ) ఆధారంగా మార్పు చేయడానికి సింగరేణి కాలరీస్ నిరాకరించడాన్ని సమర్ధించింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రామ్బ్రిచ్ యాదవ్ 1971లో సింగరేణి కాలరీస్‌లో కార్మికుడిగా చేరినప్పుడు ఆయన 1951 డిసెంబర్ 5న జన్మించినట్లు వైద్యులు ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. అంచెలంచెలుగా పదోన్నతి పొందిన యాదవ్ ఇటీవల తాను 1946లో జన్మించినట్లుగా రికార్డులు మార్పు చేయాలని స్కూల్ ఇచ్చిన టీసీని సాక్ష్యంగా పేర్కొంటూ సమర్పించిన వినతిపత్రాన్ని సింగరేణి యాజమాన్యం తోసి పుచ్చింది. దాంతో యాదవ్ హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. ఇటీవల న్యాయ మూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి వెలువరించిన తీర్పులో సింగరేణి యాజ మాన్య చర్యల్లో జోక్యం చేసుకోబోమని తెలిపారు. ఏళ్ల తరబడి సర్వీస్ రికార్డుల్లో ఉన్న పుట్టిన తేదీని ఇప్పుడు మార్పు చేయాలని కోరడం చెల్లదన్నారు. యాదవ్ సర్వీసులో చేరినప్పుడు వేలిముద్ర వేశారని, తర్వాత రికార్డుల్లో కూడా నిశానీ గానే ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని న్యాయమూర్తి పేర్కొన్నారు. -
పుష్కర ప్రత్యేక రైళ్ల తేదీల్లో మార్పు
సాక్షి,హైదరాబాద్ : నగరం నుంచి బాసర, భద్రాచలం వెళ్లేందుకు గతంలో ప్రకటించిన పుష్కరాల ప్రత్యేక రైళ్ల తేదీల్లో స్వల్ప మార్పు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు కాచిగూడ-ధర్మాబాద్ మధ్య నడిచే స్పెషల్ ట్రైన్ ఈ నెల 13, 15, 17, 19, 21, 23, 25 తేదీలకు బదులు 13, 14, 17, 18, 21, 22, 25,26 తేదీల్లో ఉదయం 7 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి అదేరోజు ఉదయం 11.30కు ధర్మాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు ధర్మాబాద్ నుంచి బయలుదేరి సాయంత్రం 4కు కాచిగూడ చేరుకుంటుంది. సికింద్రాబాద్-భద్రాచలం వెళ్లే స్పెషల్ ట్రైన్ ఈ నెల 14, 16, 18, 21, 23, 25 తేదీలకు బదులు 15, 16, 19, 20, 23, 24 తేదీలలో ఉదయం 6.10 కి సికింద్రాబాద్ నుంచి బయలుదేరి అదేరోజు ఉదయం 11.40 కి భద్రాచలం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అదేరోజు మధ్యాహ్నం 1.25 కు భద్రాచలం నుంచి బయలుదేరి సాయంత్రం 7.55 కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్-మణుగూర్ స్పెషల్ ట్రైన్ ఈ నెల 13, 15, 17, 20, 22, 24 తేదీలకు బదులు 13,14,17,18,21,22 తేదీల్లో ఉదయం 6.10 కి బయలుదేరి అదేరోజు మధ్యాహ్నం 1.30 కు మణుగూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణం లో అదేరోజు మధ్యాహ్నం 2.30 కు బయలుదేరి రాత్రి 10గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. పలు రైళ్ల రద్దు: గుంతకల్ డివిజన్లోని గుత్తి-ధర్మవరం స్టేషన్ల మధ్య నిర్మాణ పనుల దృష్ట్యా ఈ నెల 11, 16, 18 తేదీల్లో కాచిగూడ -తిరుపతి (22120) డబుల్‌డెక్కర్, అలాగే 12, 17, 19 తేదీల్లో తిరుపతి-కాచిగూడ (22119) డబుల్ డెక్కర్, ఆదిలాబాద్-నిజామాబాద్,ఆదిలాబాద్-పూర్ణ స్పెషల్ ట్రైన్స్ ఈ నెల 16, 23 తేదీల్లో రద్దు కానున్నాయి.


