breaking news
Dance Adventures
-
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత్‌కు బీటీఎస్ బృందం
బీటీఎస్.. ఈ తరం కుర్రకారును ఉర్రూతలూగించే కొరియన్ పాప్ బృందం అంది. దాదాపుగా అన్ని దేశాల్లో.. ముఖ్యంగా భారత దేశంలో చిన్నపిల్లలు మొదలు.. నడి వయస్కుల వరకు బీటీఎస్‌కు విపరీతమైన అభిమానులున్నారు. అంతెందుకు.. బీటీఎస్ పేరుతో ఉండే గిఫ్ట్‌లు, కీచైన్లు, ఫ్రెండ్షిప్ బ్యాండ్లు.. ఇలా ఆన్లైన్లో కానీ.. ఆఫ్‌లైన్‌లో కానీ.. భారత్‌లో గిరాకీ ఎక్కువే..! అలాంటి బీటీఎస్ బృందం భారతదేశానికి వస్తే.. అభిమానుల ఆనందానికి అవధులుండవు. అవును.. బీటీఎస్ ఈ ఏడాది మార్చిలో భారత్‌కు రానుంది. ఆ విశేషాలు తెలియాలంటే.. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ అవ్వకుండా చూడండి..!బీటీఎస్ అభిమానులకు 2026 నిజంగా ఓ శుభవార్తను మోసుకొచ్చింది. అదే.. బీటీఎస్ టీం భారత్‌కు రావడం..! ఇటీవల జరిగిన బీటీఎస్ స్టార్ కిమ్ టేంగ్ కార్యక్రమంలో స్వయంగా బీటీఎస్ బృందం ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో.. సోషల్ మీడియాలో ఓ హల్చల్ మొదలైంది.ప్రపంచ పర్యటనలో భాగంగా BTS బృందం 2026లో మొదటిసారిగా భారతదేశంలో ప్రదర్శిస్తోంది. ముంబై వేదికగా పాప్ బృంద ప్రదర్శనను స్టేడియం సామర్థ్యం ఆధారంగా సుమారు 60వేల మంది నేరుగా వీక్షిస్తారనే అంచనాలుండటంతో దేశంలో అతిపెద్ద పాప్ ఈవెంట్లలో ఒకటిగా మారనుంది. ప్రస్తుతానికి ముంబై వేదిక అని భావిస్తున్నప్పటికీ.. ముంబైలోనే నిర్వహిస్తారా? మరే ఇతర వేదికలను సిద్ధం చేస్తారా అనేది వేచి చూడాల్సిందే. ఇండియాకు రానున్న పాప్ బృందంలో ఏడుగురు సభ్యులున్నారు. ఈ బృందంలో RM, జిన్, సుగా, జె-హోప్, జిమిన్, వి, జంగ్ కూక్లు ఉన్నారు.ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయ అభిమానులకు ఈ ఈవెంట్ ఓ శుభవార్తగా చెప్పవచ్చు. 2016లో కోల్డ్ ప్లే ప్రత్యక్ష సంగీతం ఎలా ప్రేక్షకాదరణ పొందినదో.. ఈ ఈవెంట్ కూడా అలాగే రికార్డు నెలకొల్పుతుందనే అంచనాలున్నాయి. దీంతో ముంబైలోని పర్యాటకం, ఆతిథ్యం, స్థానిక వ్యాపారాలు గణనీయంగా లబ్ధి పొందే అవకాశాలున్నాయి. వేదికలో... ఈవెంట్ తేదీల్లో అధికారిక స్పష్టత లేకపోవడం కాస్త ఇబ్బందికరంగా మారింది. మరోవైపు నకిలీ టిక్కెట్ల విక్రయదారులు కూడా మార్కెట్లోకి చేరినట్లు సమాచారం అందడంతో అభిమానులు కాస్త జాగ్రత్తగా ఉండాలని నిర్వాహకులు సూచిస్తున్నారు.జూన్ 2025 లో సైనిక సేవను పూర్తి చేసిన తర్వాత మళ్లీ వారు 2026 మార్చి 20న వారి 5వ ఆల్బమ్ విడుదల కోసం తిరిగి కలుస్తున్నారు. ఈ పాప్ ప్రదర్శన నిమిత్తం టికెట్లు ఉన్నప్పటికీ... టికెట్ ధరలు ఇంకా ప్రకటించలేదు. కానీ జనరల్, వీఐపీ, ఫ్యాన్ క్లబ్ సభ్యుల కోసం టికెట్ ధరలు వేర్వేరుగా కేటాయించే అవకాశముంది. BTS డిమాండ్ ఆధారంగా, ఇక్కడి అభిమానులను దృష్ట్యా టిక్కెట్లు తక్షణమే అమ్ముడవుతాయని భావిస్తున్నారు. -
న్యూఇయర్.. సన్నీ.. నైట్
వణికించే చలిగాలులు ఆమె దూకుడుకు వేడెక్కాయి. ఆమె ఓరచూపులు కుర్రకారును కిర్రెక్కించాయి. జగద్విఖ్యాత సెక్సిణి సన్నీ లియోన్ ఒంపు సొంపుల సోయగాలను ఆరబోస్తూ, హొయల్ వగల్ ఒలికిస్తూ వేసిన చిందులు కుర్రాళ్ల గుండెల్లో పొగలు పుట్టించాయి. జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో న్యూఇయర్‌కు వెల్కమ్ చెబుతూ, పాత ఏడాదికి సెండాఫిస్తూ.. బుధవారం రాత్రి సన్నీ ప్రదర్శించిన నృత్య విన్యాసాలకు యంగ్తరంగాలు ఉర్రూతలూగాయి. బిఫోర్ షో: శృంగార తార సన్నీలియోన్ బుధవారం రాత్రి తన షోకు ముందు మాదాపూర్‌లోని ట్రైడెంట్ హోటల్‌కు వచ్చింది. షో వివరాలను ఆమె మీడియాకు వెల్లడిస్తారని నిర్వాహకులు చెప్పారు. అయితే, అభిమానులు ఆమెను చూసేందుకు పెద్దసంఖ్యలో ఎగబడటంతో.. ఆమె ‘హాయ్’ చెబుతూ అటు నుంచి అటే వెళ్లిపోయింది.


