breaking news
dalit couple
-
ఆలయంలో దళిత నవదంపతులకు అవమానం : వీడియో వైరల్
తెలంగాణాలోని నాగర్ కర్నూల్ జిల్లాలోని కుమ్మెర గ్రామంలోమల్లన్న జాతరలో మూడు నెలల పసిపాప ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర ప్రకంపనలు రేపింది. మరోవైపు కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో కుల వివక్షకు సంబంధించిన మరో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. అక్కడ ఒక దళిత కుటుంబాన్ని అవమానించి, ఆలయం నుండి బహిష్కరించిన ఘటన ఘర్షణకు దారి తీసింది. ఈఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఇదీ చదవండి: గర్ల్ ఫ్రెండ్ ద్వారానే ఎల్ మెంచో కథ ఖతంప్రత్యక్ష సాక్షుల ప్రకారం గోని గ్రామంలోని అరసమ్మ ఆలయంలో ఈ సంఘటన జరిగింది. కొత్తగా పెళ్లైన దళిత జంట ప్రార్థనలు చేయడానికి ఆలయానికి వచ్చినప్పుడు నారాయణప్ప అనే వ్యక్తి అడ్డుకున్నాడు. ఆధిపత్య కులానికి చెందిన నారాయణప్ప, ఎలాగైనా వారిని ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకు నానాయాగీ చేశాడు. తనకు దేవత సోకిందంటూ నాటకం ఆడాడు. మెకాళ్లపై అమ్మవారికి అడ్డంగా కూర్చొని, వారిని దర్శనం చేసుకోనీయకుండా అడ్డుపడటం ఫుటేజ్‌లో ఉంది. ఆ తర్వాత అతను లేచి నిలబడి వెంటనే వెళ్లి పోవాలంటూ గట్టిగా అరుస్తూ ఊగిపోయాడు."Dalits can't enter Hindu temple." 🚨A newly married Dalit couple was humiliated and forced out of temple in Karnataka.Where are those "South Indians" who mock "North" over such acts? Speak up, saar..😭Be it North or South, when it comes to caste, entire nation is doomed.… pic.twitter.com/RtJ2ol9Zub— Suraj Kumar Bauddh (@SurajKrBauddh) February 24, 2026 దీంతో ఆవేదనకు గురైన వరుడు జగదీష్ న్యాయం కోసం అధికారులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు ఆధారంగా, షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నివారణ) చట్టం కింద తురువేకెరె పోలీస్ స్టేషన్లో FIR నమోదు చేశారు. ఈ ఘటనపై స్పందించిన ఎస్పీ కేవీ అశోక్ తురువేకెరె పోలీస్ స్టేషన్లో తమకు అందిన ఫిర్యాదు మేరకు ఒకర్ని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఇదీ చదవండి: అతని కోసం రూ.8 లక్షలు అప్పు: అంతా క్షణాల్లో మాయం! -
దళిత దంపతులపై జులుం
-
‘చావు తప్ప మరో దారి లేదు’
భోపాల్: చేతికొచ్చిన పంటను అధికారులు బుల్డోజర్తో నాశనం చేయడం చూసి ఆ దళిత దంపతులు తట్టుకోలేకపోయారు. సొంత బిడ్డను చంపుతున్నట్లే భావించారు. ఆ ఘోరాన్ని చూడలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవ్వడంతో అధికారుల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ దారుణమైన సంఘటన మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. రామ్ కుమార్ అహిర్వార్, సావిత్రి దేవి దంపతులు కొన్నేళ్లుగా రెండు బిఘాల(5.5 ఎకరాలు) ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో 2018లో ప్రభుత్వం ఆ భూమిని ఓ కాలేజీ కోసం కేటాయించింది. దాంతో ఆ భూమిని ఖాళీ చేయాల్సిందిగా అధికారులు రామ్ కుమార్ దంపతులకు సూచించారు. కానీ వాళ్లు అంగీకరించకపోవడంతో.. రెండు రోజుల క్రితం రాష్ట్ర రెవెన్యూ అధికారులు పోలీసులతో వచ్చి భూమిని ఖాళీ చేయాల్సిందిగా రామ్ కుమార్ దంపతులను బెదిరించారు. ఈ క్రమంలో బుల్డోజర్తో వారి పంటను నాశనం చేసే ప్రయత్నం చేశారు. దాంతో పోలీసులకు, రామ్ కుమార్ దంపతులకు మధ్య వాగ్వాదం జరిగింది. ‘మాకు మూడు లక్షల రూపాయల అప్పు ఉంది. దాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందా. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ సాగు చేసుకుంటున్నాం. ఇప్పుడ ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి అంటే.. మేం ఎలా బతకాలి. చావు తప్ప మాకు వేరే దారి లేదు’ అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో పోలీసులు లాఠీలతో విచక్షణారహితంగా రామ్ కుమార్ మీద దాడి చేశారు. అడ్డుకోబోయిన సావిత్రి దేవిని అసభ్యకరమైన మాటలతో అవమానించారు. చివరకు బుల్డోజర్తో పంటను నాశనం చేసేందుకు ప్రయత్నించారు. ఇది చూసి తట్టుకోలేకపోయిన ఆ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. దాంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. రామ్‌కుమార్ దంపతుల మీద దాడి చేసిన పోలీసులకు జిల్లా కలెక్టర్ క్లీన్‌చీట్ ఇవ్వడం మరింత వివాదాస్పదంగా మారింది. (మృతదేహం కళ్లు పీక్కుతిన్న చీమలు!) దాంతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా రంగంలోకి దిగారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అన్నింటికంటే ముందుగా పోలీసులకు క్లీన్‌చీట్ ఇచ్చిన కలెక్టర్‌ను, ఎస్పీని సస్పెండ్ చేశారు. తల్లిదండ్రులను కాపాడేందుకు ప్రయత్నించిన పిల్లలను కూడా పోలీసులు అవమానించారు. అవతలకు ఈడ్చిపారేశారు. ప్రతిపక్షాలు కూడా ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మాజీ సీఎం కమల్‌నాథ్ రాష్ట్రంలో జంగిల్‌రాజా పాలన కొనసాగుతుందని ఆరోపించారు. ‘దళిత దంపతుల మీద పోలీసులు విచక్షణారహితంగా దాడి చేశారు. ఏంటిది జంగిల్ రాజా. ఒకవేళ వారు ప్రభుత్వ భూమినే సాగు చేస్తున్నారనుకుందా. దాన్ని చట్టబద్దంగా పరిష్కరించుకోవాలి. అంతకాని జాలీ, దయ లేకుండా ఆ దంపతులను, వారి పిల్లలను కొట్టడం న్యాయం కాదు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.(కమల్‌ను కాపాడిన ‘కరోనా’) దీని గురించి ప్రభుత్వ అధికారులను ప్రశ్నించగా.. ‘లోకల్ గ్యాంగ్‌స్టర్ ఒకడు దాదాపు 4.5 బిఘాల(12.5ఎకరాలు) భూమిని ఆక్రమించుకున్నాడు. రామ్ విలాస్ దందపతులను వాడుకుని ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోకుండా ఉండేందుకు అప్పులపాలైన రామ్ విలాస్ దంపతులను వాడుకుంటున్నాడు’ అని తెలిపారు. -
దళితులతో ఇంట్లో పూజ చేయించిన సీఎం!
ముంబై: ఓ దళిత జంటతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన నివాసంలో గణపతి పూజ చేయించారు. బుధవారం కొంకణ్ తీరంలో ఉన్న మహాదేవాచే కెర్వాడే గ్రామంలో పండుగ సందర్భంగా గ్రామానికి చెందిన పరమానంద్ హీవాలేకర్, ప్రీతమ్ దంపతులు పూజ కోసం ఆలయానికి వెళ్లారు. దళిత కులానికి చెందిన వారు ఆలయంలోకి ప్రవేశించకూడదంటూ జాట్ పంచాయతీ పెద్దలు, గ్రామస్థులు వారిపై ఆంక్షలు విధించారు. దీంతో వారు ఆలయం వద్దే నిరసనకు దిగారు. ఈ ఘటనపై స్పందించిన సీఎం ఫడ్నవీస్ వారిని వార్షాలోని తన నివాసానికి రావాలంటూ ఆహ్వానం పంపారు. అక్కడే ఏర్పాటు చేసిన గణపతి విగ్రహానికి వారితో పూజ చేయించారు. గత కొద్ది రోజులుగా మహారాష్ట్రలో కులం పేరుతో దారుణాలు జరుగుతున్న విషయం తెలిసిందే.


